రాజస్థాన్లో దారుణ ఘటన జరిగింది. రక్షించాల్సిన పోలీసే ఓ దళిత వ్యక్తిపై అమానవీయంగా ప్రవర్తించాడు. బాధితునిపై మూత్ర విసర్జన చేశాడు. మూత్రం పోయడమే కాకుండా స్థానిక ఎమ్మెల్యే కాళ్లు నాకించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై క్రై బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించినట్లు కేసులు నమోదైన ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా బెంగుళూరులో ఉబెర్ డ్రైవర్ మహిళా ప్రయాణికురాలు, ఆమె కొడుకుపై దాడికి పాల్పడడం కలకలం రేపింది. తప్పు క్యాబ్లోకి ప్రవేశించినందుకు 48 ఏళ్ల మహిళ, ఆమె కొడుకుపై దాడి చేశాడు.
జాతి హింసతో అట్టుడికిపోతున్న ఈశాన్య రాష్టమైన మణిపూర్లో అకృత్యాలు ఆగడం లేదు. అక్కడి మహిళలపై జరుగుతున్న ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశాన్ని కుదుపేసిన సంగతి తెలిసిందే. పార్లమెంట్లోని ఉభయసభల్లోనూ నిరసన జ్వాలలు చల్లారకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
మచిలీపట్నంలో ప్రముఖ వైద్యుడి భార్య డాక్టర్ రాధ దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. జవ్వారుపేటకు చెందినడాక్టర్ రాధను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేసిన కేసులో కీలక పురోగతి లభించింది.
A young man stripped a woman on the road in Balajinagar: మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. ఆమెను నడి రోడ్డుపైనే వివస్త్రను చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని బాలాజీనగర్లో చోటుచేసుకుంది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో రోడ్డుపై వెళ్తున్న వారు అడ్డుకోవాల్సింది పోయి.. వీడియోలు తీస్తూ చోద్యం చూశారు. 15 నిముషాల పాటు యువతి నగ్నంగా రోడ్డుపైనే ఏడుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు.…
ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్ జిల్లాలో ఇద్దరు మైనర్ బాలురకు మూత్రం తాగించి, వారి మలద్వారంలో పచ్చిమిర్చి రుద్దారు. దొంగతనం చేశారనే అనుమానంతో బలవంతంగా కొన్ని గుర్తు తెలియని ఇంజెక్షన్లు ఇచ్చారు. బాధితులు 10, 15 సంవత్సరాల వయస్సు గల బాలురు కావడం గమనార్హం.
నర్సుగా నటించి ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడి భార్యనే హతమార్చాలని ప్రయత్నించింది ఓ మహిళ. ఇంజెక్షన్ వేసి ఆమెను చంపాలని వ్యూహం పన్నింది. కానీ అది బెడిసికొట్టి పోలీసులకు చిక్కింది.