Healthy Breakfast: మధుమేహం, అధిక బరువుకు చెక్.. నిమిషాల్లో తయారయ్యే ‘ఓట్స్ ఆమ్లెట్’ను ఇలా ట్రై చేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Healthy Breakfast: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయాన్నే పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో అవసరం అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కేవలం రుచికే ప్రాధాన్యమివ్వకుండా, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం కోసం వెతికే వారికి ‘ఓట్స్ ఆమ్లెట్’ ఒక అద్భుతమైన ఎంపికగా చెబుతున్నారు. నిమిషాల్లో తయారయ్యే ఈ వంటకం బ్రేక్‌ఫాస్ట్‌గా మాత్రమే కాకుండా, స్నాక్ లేదా డిన్నర్‌గానూ కడుపు నింపుతుంది. సాధారణంగా ఆమ్లెట్ అంటే అందరికీ ఇష్టమే. దానికి ‘ఓట్స్’ తోడుగా చేరితే ఆ రుచే వేరుగా ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే ఓట్స్‌ను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడేలా ఓట్స్ ఆమ్లెట్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Gautam Adani: AI రంగంలోకి అదానీ రాయల్ ఎంట్రీ.. లక్ష కోట్లు పెట్టుబడి పెట్టడానికి ప్లాన్!
Also Read
- Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
కావలసిన పదార్థాలు:
ఓట్స్: అర కప్పు
ఉప్మా రవ్వ (బొంబాయి రవ్వ): 2 టేబుల్ స్పూన్లు
పెరుగు: 2 టేబుల్ స్పూన్లు
గుడ్లు: 3
తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టమాటా ముక్కలు: తగినంత
మసాలాలు: ఉప్పు, కారం లేదా మిరియాల పొడి, పసుపు
తయారీ విధానం..
ముందుగా అర కప్పు ఓట్స్‌ను బాణలిలో వేసి 2-3 నిమిషాల పాటు తక్కువ మంటపై దోరగా వేయించాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఒక గిన్నెలో ఓట్స్ పొడి, బొంబాయి రవ్వ, పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమం పిజ్జా పిండి మాదిరిగా చిక్కగా ఉండాలి. సిద్ధం చేసుకున్న మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టమాటా ముక్కలతో పాటు తగినంత ఉప్పు, కారం, పసుపు వేయాలి. అనంతరం మూడు గుడ్లను కొట్టి వేసి బాగా కలపాలి. పొయ్యి మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె లేదా వెన్న రాసి, ఈ మిశ్రమాన్ని సమానంగా పరచాలి. పైన మూత పెట్టి తక్కువ మంటపై 3-4 నిమిషాల పాటు కాల్చాలి. ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత జాగ్రత్తగా రెండో వైపుకు తిప్పి మరో నిమిషం పాటు ఉంచాలి. ఎంతో సాఫ్ట్‌గా, స్పాంజీగా ఉండే ఈ ఓట్స్ ఆమ్లెట్‌ను వేడివేడిగా సర్వ్ చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. పైన కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ లేదా టమాటా కెచప్‌తో అలంకరిస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.
ఓట్స్ ఆమ్లెట్ ప్రయోజనాలు ఇవే..
* ఓట్స్ వల్ల శరీరానికి అవసరమైన పీచు పదార్థం అందుతుంది.
* గుడ్ల ద్వారా ప్రొటీన్ లభిస్తుంది.
* కూరగాయలు చేర్చడం వల్ల విటమిన్లు అందుతాయి.
* పిల్లల లంచ్ బాక్స్‌లకు ఇది ఒక పోషకమైన ఆహారం.
తక్కువ సమయంలో కమ్మని అల్పాహారం కావాలనుకునే గృహిణులకు, బ్యాచిలర్స్‌కు ఈ ‘ఓట్స్ ఆమ్లెట్’ సూపర్ ఛాయిస్‌గా చెబుతున్నారు. మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా మీ ఇంట్లో కుదిరినప్పుడు ట్రై చేసి చూడండి.
READ ALSO: Gautam Adani: AI రంగంలోకి అదానీ రాయల్ ఎంట్రీ.. లక్ష కోట్లు పెట్టుబడి పెట్టడానికి ప్లాన్!
తాజావార్తలు
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!