Indus Waters Treaty: భారత్ ‘‘రావి’’ దెబ్బ.. పాకిస్తాన్‌లో నీటి సంక్షోభం ఖాయం..
- రావి కుళాయిని కట్టేస్తున్న భారత్..
- పాకిస్తాన్‌లో ఈ వేసవిలో తీవ్ర నీటి సంక్షోభం..
- రావి నదిపై పూర్తవుతున్న షాపూర్ కండి ప్రాజెక్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indus Waters Treaty: ఈ వేసవిలో దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోబోతోంది. ‘‘రావి’’ నీటి కుళాయిని భారత్ మూసివేసింది. ఇన్నాళ్లు ‘‘ఇండస్ వాటర్ ట్రిటీ’’ని అడ్డుపెట్టుకుని భారత వాటా నీటిని కూడా ఎంజాయ్ చేసిన పాకిస్తాన్‌కు అసలు దెబ్బ తగలబోతోంది. సిందు జలాల ఒప్పందం నిలిపేయడంతో ఇప్పటికే పాక్ సతమతమవుతున్న సమయంలో, మార్చి 31 నాటికి షాపూర్ కండి ప్రాజెక్టును పూర్తి చేయాలని భారత్ అనుకుంటోంది. దీనికి రావి నది నుంచి అదనపు నీటి ప్రవామాన్ని నిరోధించింది. భారత్ వైపు రావి నదిపై ఇన్నాళ్లు సరైన ప్రాజెక్టులు లేకపోవడంతో పాకిస్తాన్ భారత్ వాటా నీటిని కూడా వాడుకుంది. ఈ ఏప్రిల్ నుంచి మాత్రం పాకిస్తాన్ నీటి సంక్షోభంతో విలవిల్లాడాల్సిందే. జమ్మూ కాశ్మీర్‌లోని కథువా, సాంబా జిల్లాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి జావెద్ అహ్మద్ రాణా సోమవారం ప్రకటించారు.
పాక్‌ను ఎలా దెబ్బతీస్తుంది.
Also Read
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
ప్రస్తుతం రావి మిగులు జలాలు మాధోపూర్ ద్వారా ప్రవహిస్తున్నాయి. అయితే, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ మధ్య దశాబ్ధాలుగా ఉన్న రాజకీయ నిర్లక్ష్యం, గొడవల కారణంగా ఏళ్లుగా నిలిచిపోయిన షాపూర్ కండి బ్యారేజీ నీటి వృధాను అరికడుతుంది. ప్రస్తుతం పాక్ వైపు వెళ్తున్న సింధు నీటిని నిలిపేసి భారత్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని కేంద్ర జల వనరుల మంత్రి సీఆర్ పాటిల్ వారం క్రితం చెప్పారు.
సింధు నది వ్యవస్థలో మూడు తూర్పు నదుల్లో ఒకటైన రావి నీటిపై భారత్‌కు సంపూర్ణ హక్కులు ఉన్నాయి. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో సింధు జలాల ఒప్పందం జరిగింది. దీని ద్వారా తూర్పు నదులైన సట్లేజ్, బియాస్, రావిపై హక్కులు ఉన్నాయి. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్‌పై పాక్‌కు హక్కులు కల్పించబడ్డాయి. అయితే, తూర్పు నదులపై సరైన ప్రాజెక్టులు లేకపోవడంతో ఇన్నాళ్లు పాక్ మన వాటా నీటిని కూడా దర్జాగా వాడుకుంది. ఇప్పుడు ఈ పరిస్థితి మోడీ ప్రభుత్వం మార్చేసింది.
పాక్ వ్యవసాయం 80 శాతం సింధు జలాలపై ఆధారపడి ఉంది. భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపేసిన తర్వాత పాక్‌లో వ్యవసాయం దెబ్బతింటుంది. లాహోర్, ముల్తాన్ వంటి నగరాల్లో నీటి కొరత ఏర్పడుతుంది.
షాపూర్ కండి బ్యారేజ్:
దీనికి 1979లో ప్రణాళిక వేస్తే, 1982లో ఇందిగా గాంధీ ఫౌండేషన్ స్టోన్ వేశారు. 46 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. మోడీ ప్రభుత్వం 2018లో రెండు రాష్ట్రాల వివాదాన్ని పరిష్కరించి ప్రాజెక్ట్ పనుల్ని వేగవంతం చేసింది. మార్చి 31, 2026 నాటికి ఇది పూర్తవుతుంది. దీని ద్వారా 32,000 హెక్టార్లకు సాగునీరు అందుతుంది. ఇదే కాకుండా చీనాబ్‌పై హైడ్రో పవర్ ప్రాజెక్టుల్ని, జీలం నదిపై వులార్ బ్యారేజ్ పనుల్ని భారత్ వేగంగా చేస్తోంది. దీని వల్ల పాక్‌కు నీటి కష్టాలు మరింత ఎక్కువ అవుతాయి.
తాజావార్తలు
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!