Maharashtra: తప్పుడు మాటలు చెబుతూ, చేతబడులను, దోషాలను వదిలిస్తామంటూ కొందరు బాబాలు, మాంత్రికులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో వాస్తుదోషాలు, చెడు దోషాలు వదిలిస్తానని చెబుతూ 35 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు.
తల్లిని మించిన దైవం లేదంటారు. తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే తల్లిని మించి ఎవరూ లేరని అర్ధం. నవమాసాలు మోసి కని పెంచి కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే తల్లి మనసు కల్మషం లేనిది. కానీ అలాంటి అమ్మను ఎవరైనా చంపాలనుకుంటారా? ఊహించుకోడానికే మనసు దీనికి ఒప్పుకోదు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. సభ్యసమాజం తలవంచుకునే విధంగా, తండ్రిలా ఉండాల్సిన మామ, తన కొడలిపై దారుణానికి తెగబడ్డాడు. కొడుకు భార్య అనే సోయి లేకుండా అత్యాచారం చేశాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ దారుణం జరిగింది. మామ తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ 26 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తను బెదిరించి, తీవ్రంగా కొట్టాడని చెప్పింది.
Nagpur: అత్యాచారం కేసు పెడతానని ఓ యువతి, ఆమె కుటుంబ సభ్యులు బ్లాక్మెయిల్ చేయడంతో ఓ వ్యక్తి ఫేస్బుక్ లైవ్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగ్పూర్ నగరానికి చెందిన 38 ఏళ్ల మనీష్ ను ఆమె స్నేహితురాలు బ్లాక్మెయిల్ చేసింది. ఆమె కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా భయపెట్టడంతో మనీష్ తనువు చాలించాడు. సెప్టెంబర్ 10న 38 ఏళ్ల వ్యక్తి మనీష్ తన ఫేస్బుక్ లైవ్లో, 19 ఏళ్ల కాజల్ అనే అమ్మాయి, ఆమె కుటుంబ సభ్యులచే…
Live-In Relation: సహజీవనం చేస్తూ సర్వస్వం అర్పిస్తున్న యువతులు హత్యకు గురవుతున్నారు. గతంలో ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్య దేశంలో లివ్-ఇన్ రిలేషన్లో పరిణామాలను హెచ్చరించింది. ఏళ్లుగా సహజీవనం చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చే సరికి మహిళల్ని కడతేరుస్తున్నారు. ఇటీవల అలహాబాద్ హైకోర్టు లివ్ ఇన్ రిలేషన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశ సంస్కృతికి ఈ విధానం నష్టం చేకూరుస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ప్రియురాలు పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు నిప్పంటించుకున్నాడు. మొదట తన ప్రియురాలి దగ్గరకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని కోరాడు.. దీంతో ప్రియురాలు నిరాకరించడంతో యువకుడు సమీపంలోని పెట్రోల్ పంపు వద్దకు వెళ్లి పెట్రోల్ తీసుకుని మళ్లీ ప్రియురాలి దగ్గరకు వచ్చాడు. మళ్లీ చివరగా పెళ్లి చేసుకోవాలని అని అడగగా.. అప్పుడు కూడా నిరాకరించడంతో యువకుడు తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్స్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుండి రూ. 21 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన పై గౌహతి పోలీస్ కమిషనర్ దిగంత బోరాహ్ మాట్లాడుతూ.. నిందితులు హెరాయిన్ ను సుబ్బుపెట్టెల్లో ఉంచి రహస్యంగా తరలించేందుకు ప్రయత్నించారని.. కాగా తమకు అందిన రహస్య సమాచారం ఆధారంగా నిందితులని పట్టుకున్నామని వెల్లడించారు.
బెంగుళూరులో ఇద్దరు దుబాయ్ ప్రయాణీకులు బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు సినిమా స్టైల్ లో ప్లాన్ చేశారు. బంగారాన్ని పేస్ట్ గా మార్చి దాంతో బెల్టు తయారు చేశారు. ఆ బంగారపు బెల్టుని అక్రంగా రవాణా చెయ్యడానికి ప్రయత్నించగా బెంగుళూరు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
భార్యా భర్తల గొడవకు పసిపిల్లలను బలి చేస్తున్న ఘటనలు ఈమధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగు చూసింది.. మద్యం మత్తులో కన్న తండ్రి 18 నెలల చిన్నారి పాలిట కాలయముడు అయ్యాడు.. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన అల్తాఫ్ మహ్మద్ సమీవుల్లా అన్సారీ కు కొన్నేళ్ల కిందట వివాహమైంది. అతడు తన భార్యతో కలిసి దైఘర్ గావ్ లోని అభయ్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. వీరికి ఓ కూతురు…