Hyderabad: బ్రతకలేక బావిలో పడితే కప్పలు కనుగుడ్లు తిన్నాయని.. భర్తతో గొడవపడి బయటకి వస్తే మహిళని మాటల్లో పెట్టి బంగారం మాయం చేశారు మరో ఇద్దరు మహిళలు.. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని మధురానగర్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ ఈ నెల 13వ తేదీన తన భర్తతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చింది. కాగా ఆ మహిళను గమనించిన మరో ఇద్దరు మహిళలు ఆ మహిళను అనుసరించారు. మెల్లగా ఆ మహిళతో మాటలు కలిపారు. మాటల్లో ఉంచి ఆ మహిళను ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు.
Read also:Post office Scheme : సూపర్ స్కీమ్.. రూ.లక్షలతో రూ. 20 లక్షలు పొందవచ్చు..
అక్కడ కూల్ డ్రింక్స్ లో మత్తు మందు కలిపి ఆ మహిళకి ఇచ్చారు. ఆ కూల్ డ్రింక్ తాగిన మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఇదే అదునుగా భావించిన వారిద్దరూ ఆ మహిళ మేడలో ఉన్న నాలుగు తులాల బంగారం గొలుసు, చెవి దుద్దులు అపహరించారు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన మహిళ తన మెడలోని గొలుసు, చెవి దుద్దులు లేకపోవడంతో ఆమెకు అసలు విషయం అర్థమైనది. ఆ మహిళలు మత్తుమందు ఇచ్చి తన నగలను అపహరించారని తెలుసుకుంది. అంతరం అరక్షం కూడా ఆలోచించకుండా భర్త దగ్గరకి వెళ్లి జరిగింది చెప్పింది. దీనితో భార్యభర్తలిద్దరూ పోలీసు స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరిలో ఒక మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.