Chandrayangutta Murder: మే 8న చంద్రాయణగుట్టలోని బాధితురాలి ఇంటికి వెళ్లి, అక్కడ కొంత సమయం గడిపిన తర్వాత నిందితుడు జుల్ఫికర్ ఆమె గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత అతను పరుపుకు నిప్పంటించి మృతదేహాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించాడని డీసీపీ పి. కాంతిలాల్ సుభాష్ తెలిపారు. హత్య గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానం రావడంతో వారు జుల్ఫికర్‌ను అరెస్టు చేశారు. విచారణలో అతను ఆ మహిళను హత్య చేసినట్లు అంగీకరించాడు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Also: Tech Layoffs: ఆందోళనలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.. మైక్రోసాఫ్ట్ భారీగా లేఆఫ్స్
ఇక విచారణలో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే హత్య చేసినట్లు హంతకుడు అంగీకరించాడు. ఇకపోతే ఘటన జరిగిన రోజు మహిళ గొంతు కోసి హత్య చేసి.. తగలబెట్టాడు దుండగుడు. ఆపై తనకేం తెలియనట్టు బయటకు వచ్చి కేకలు పెట్టాడు. స్థానికులతో కలిసి మంటలు ఆర్పే ప్రయత్నం చేసి, ఆపై మహిళ ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించే ప్రయత్నం చేసాడు. కూలి పనులు చేసుకుంటూ కేశవగిరిలో నివాసం ఉంటున్నాడు కేతావత్ బుజ్జి. ఇక భర్త రూప్లా చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది బుజ్జి.
Read Also: Health Tips : పరగడుపున ఒక స్పూన్ పసుపు, తేనె తీసుకుంటే..ఎన్ని లాభాలో తెలుసా !
వెస్ట్ బెంగాల్ కి చెందిన మేస్త్రీ జుల్ఫికర్ అలీ తో బుజ్జి కి అక్రమ సంబంధం ఉండేదని సమాచారం. బుజ్జి ఇంటి పక్కనే అద్దెకు దిగిన జుల్ఫికర్ ను వివాహం చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చింది బుజ్జి. దానితో ఆమె అడ్డు తొలగించుకునేందుకు హత్యకు ప్లాన్ చేసాడు నిందితుడు. దానితో మే 8న అర్ధరాత్రి బుజ్జి గొంతు కోసి హత్య చేసాడు జుల్ఫికర్. బుజ్జి మృతదేహాన్ని ఇంట్లోనే తగలబెట్టి.. బయటకు పరిగెత్తుకు వచ్చాడు జుల్ఫికర్. ఆ తర్వాత బుజ్జి ఇంట్లో మంటలు చెలరేగాయి అంటూ కేకలు పెట్టి స్థానికులను నిద్ర లేపిన జుల్ఫికర్. అలా హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసాడు నిందితుడు.