సగం రేటుకే బంగారం వస్తుందంటే నమ్మేశాడు. ఏకంగా కోటి రూపాయల బంగారం కావాలని ఆర్డర్ ఇచ్చాడు. రిటైల్‌గా బంగారం అమ్మి సొమ్ము చేసుకుందామనుకుంటే అసలుకే మోసం వచ్చింది. ఓ ముఠా స్మార్ట్‌గా చీట్ చేయడంతో.. ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. కోటి రూపాయల బంగారం ఆర్డర్ ఇచ్చిన వ్యాపారి. సికింద్రాబాద్ పరిధిలోని ఆర్‌కే జ్యువెలరీ యజమానిని కొంత మంది ముఠా సంప్రదించింది. అతని వద్దకు నకిలీ పోలీసుల రూపంలో వెళ్లారు ఆరుగురు ముఠా సభ్యులు. వచ్చింది నిజం పోలీసులేనని జ్యువెలరీ వ్యాపారి నమ్మిన తర్వాత మార్కెట్ ధర కంటే తక్కువకే బంగారం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. జ్యువెలరీ వ్యాపారికి డీల్ నచ్చడంతో కోటి రూపాయల బంగారం కావాలని ఆర్డర్ ఇచ్చాడు. ఐతే కాస్త అనుమానంతో నగలు చూపించాలని కోరాడు. వారు బంగారం చూపించడంతో అంతా నిజమేనని నిర్ధారించుకున్నాడు..
Israel-Iran War: ఇరాన్‌పై దాడి.. రెండు వారాల్లో నిర్ణయం..
ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య కోటి రూపాయల డీల్ కుదిరింది. ఐతే డీల్‌లో భాగంగా తమకు కోటి నగదు చూపించాలని ముఠా సభ్యులు కోరడంతో షాపు యజమాని నగదు తెచ్చేందుకు సెకండ్ బజార్‌లో ఉన్న తన కార్యాలయానికి వెళ్లాడు. నగదు తీసుకొస్తుండగా దారిలో ముగ్గురు వ్యక్తులు SOT పోలీసుల పేరుతో ఎంట్రీ ఇచ్చారు. వ్యాపారిని బెదిరించి డబ్బు సీజ్ చేస్తున్నామని చెప్పి కారులో పరారయ్యారు.. ముఠా చేతిలో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జూబ్లీ బస్ స్టాప్ వద్ద ముఠాలోని ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో కీలక సూత్రధారిగా ఉన్న 8వ బెటాలియన్ కు చెందిన కేశవ్ అనే కానిస్టేబుల్ కొట్టేసిన డబ్బుతో పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు…
Karishma Kapoor : సంజయ్ కపూర్ అంత్యక్రియల్లో ఏడ్చేసిన కరిష్మాకపూర్..