ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను ఒంటరిని చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. సరిహద్దులో ఇటీవలి ఘర్షణల తర్వాత పాకిస్తాన్‌ను ఒంటరిని చేసే ప్రయత్నంలో బీసీసీఐ కఠిన వైఖరి తీసుకున్నట్లు సమాచారం. ఈ చర్యలు రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై దీర్ఘకాలిక, శాశ్వత ప్రభావాన్ని చూపనున్నాయి. భారతదేశం మరియు పాకిస్తాన్ ఇప్పటికే ద్వైపాక్షిక క్రికెట్ ఆడేది లేదని తేల్చేసినప్పటికీ.. రెండు దేశాల మధ్య ప్రస్తుత రాజకీయ సంబంధాలు రెండు జట్ల మధ్య బహుళ-జట్టు ఈవెంట్లను కూడా ప్రమాదంలో…
భారతదేశం నుంచి ప్రతీకార దాడుల తర్వాత.. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) మిగిలిన మ్యాచ్‌లను దుబాయ్‌కు మార్చాలని పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా రావల్పిండి, ముల్తాన్, లాహోర్లలో జరగాల్సిన పీఎస్ఎల్ చివరి ఎనిమిది మ్యాచ్‌లను ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్వహించనున్నట్లు పీసీబీ ధృవీకరించింది. రాబోయే 6 రోజుల్లో పీసీఎల్ తిరిగి ప్రారంభమవుతుంది.
హైస్కూల్ గ్రౌండ్లో విద్యార్థులు అంతా సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. జరిగిన ఓ ఘటన ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసింది.. కర్నూలు జిల్లాలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కౌతాళం మండలం కాత్రికిలో పిడుగు పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు..
క్రికెట్ గ్రౌండ్‌లోనే గుండె ఆగి.. యువకులు చనిపోయిన సందర్భాలు లేకపోలేదు.. అలాంటి ఘటన ఇప్పుడు పల్నాడు జిల్లాలో జరిగింది.. జిల్లాలోని వినుకొండలో క్రికెట్ ఆడుతూ గుండెపోటుకు గురైన గౌస్ బాషా అనే యువకుడు కుప్పకూలిపోయాడు.. అయితే, వెంటనే ఆస్పమత్తమైన తోటి క్రికెటర్లు.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు గౌస్ భాష..
MS Dhoni : క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోనీ పేరుకు స్పెషల్ పేజీలు ఉన్నాయి. క్రికెట్ ప్రపంచంలో ధోనీకి ఇప్పటికీ తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి ధోనీ తరచూ ఏదో ఒక యాడ్ లో కనిపిస్తూనే ఉంటాడు. అంతే తప్ప ఇప్పటి వరకు సినిమాల్లో మాత్రం కనిపించలేదు. ధోనీ సినిమాల్లో కనిపిస్తే చూసేందుకు ఆయన ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అయితే తాజాగా ధోనీ గురించి ఓ సాలీడ్ అప్డేట్ వచ్చేసింది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్,…
ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో శతాబ్దకాలం తర్వాత క్రికెట్‌కు మళ్లీ చోటు దక్కిన విషయం తెలిసిందే. దాదాపు 128 ఏళ్ల తర్వాత.. లాస్ ఏంజిలెస్ వేదికగా జరగనున్న 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగం కానుంది. విశ్వ క్రీడల నిర్వహణ కోసం ఇప్పటికే కసరత్తు మొదలైంది. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నట్లు తాజాగా నిర్వాహకులు ధృవీకరించారు. ఆతిథ్య హోదాలో అమెరికాకు డైరెక్ట్ ఎంట్రీ దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. 2032లో బ్రిస్బేన్ ఒలింపిక్స్‌లో కూడా క్రికెట్ ఉంటుంది.…
RR vs PBKS : ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. మొదటి నుంచి బ్యాటర్లు బౌండరీలతో అదరగొట్టారు. యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ 67 పరుగులతో అదరగొట్టాడు. అతనికి తోడుగా రియాన్ పరాగ్ 43 పరుగులతో అండగా నిలిచాడు.…
ఐపీఎల్ 2025లో భాగంగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. ఇంకా 24 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. 164 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సునాయసంగా ఛేదించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో శనివారం (మార్చి 29) జరిగే మ్యాచ్ నంబర్-9లో గుజరాత్ టైటాన్స్ (GT), ముంబై ఇండియన్స్ (MI) తలపడనున్నాయి. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ సీజన్లో గుజరాత్ తన తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS)తో 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరోవైపు, ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్…