పోలింగ్ ఏజెంట్ల నియామకం.. ఈసీ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో.. ఎన్నికల కమిషన్ తీసుకునే ఏ నిర్ణయమైనా ఆసక్తికరంగా మారుతుంది.. ఇప్పుడు పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది.. పోలింగ్ ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఎన్నికల సంఘం.. పోలింగ్ తేదీ రోజు ప్రిసైడింగ్ అధికారికి పోలింగ్ ఏజెంట్ తమ వివరాలు సమర్పిస్తే సరిపోతుందని పేర్కొంది.. పోలింగ్ ఏజెంట్లను అభ్యర్థి సర్టిపై చేయాల్సి ఉంటుందని పేర్కొంది ఈసీ.. ఇక, ప్రిసైడింగ్ ఆఫీసర్ సమక్షంలో పోలింగ్ ఏజెంట్ల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని స్పష్టం చేసింది ఎన్నికల కమిషన్. కాగా, ఎన్నికల సమయంలో.. డీజీపీ సహా కీలక పోలీసు అధికారుల బదిలీలు ఓవైపు.. గాజు గ్లాస్ కామన్ సింబల్ వ్యవహారం.. ఇలా అనేక వ్యవహారాల్లో ఎన్నికల కమిషన్ కీలకంగా వ్యవహరించిన విషయం విదితమే.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పార్టీలో ప్రచారాన్ని ఉధృతం చేయగా.. రేపు సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది.. ఈ నెల 13వ తేదీన పోలింగ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే.
ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్.. పొరపాటున బాబుకు ఓటేస్తే..!
ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు అన్నీ ఆగిపోతాయని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. ఈ 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలను అమలు చేశామని.. హామీలు అమలయ్యాయో లేదో ఇంటింటికి పంపించి అడిగే సంప్రదాయం మొదలుపెట్టామన్నారు. అయితే, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు అయిపోతాయి.. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ చేశాం.. వివిధ పథకాల ద్వారా 2,70 వేల కోట్లు నేరుగా 130 సార్లు బటన్ నొక్కి నేరుగా అకౌంట్ లో వేశాం.. గతంలో ఎప్పుడైనా ఇలా నేరుగా అకౌంట్‌లో డబ్బులు వేశారా? అని నిలదీశారు. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, కాపు నేస్తాం.. ఈబీసీ నేస్తాం.. విద్యా దీవెనతో లాంటి పథకాలు అందిస్తున్నాం అని గుర్తుచేశారు సీఎం జగన్.. గతంలో ఎప్పుడూ చూడని విధంగా అక్కచెల్లెళ్ళుకు అండగా నిలిచాం.. ఇంటి వద్దకే పెన్షన్.. రేషన్, పథకాలు ఇచ్చిన ఘనత నాదన్నారు. గతంలో ఎప్పుడైనా ఇంటికి పెన్షన్ వచ్చిందా..? పథకాలు వచ్చాయా..? అని ప్రశ్నించారు. అయితే, దేవుడు దయతో పేదాలందరికి మంచి చేశాను అన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం అయినా గుర్తు వస్తుందా? అని మరోసారి నిలదీశారు. ఏ పేదవాడికైనా ఒక్క మంచి పని చేశాడా..? చంద్రబాబుఅధికారంలోకి వస్తే మోసాలు చేశాడు..? గత ఎన్నికల ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలు చేశాడా..? చంద్రబాబు లాంటి మోసాగాడిని నమ్మాచ్చా…? ఇంటికి కేజీ బంగారు, బెంజ్ కారు ఇస్తానని చెబుతాడు.. నమ్ముతారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మళ్లీ మేనిఫెస్టోతో మోసం చేయాలి చూస్తున్నాడు అని ఆరోపించారు. మళ్లీ వాలంటీకంలె ఇంటికి రావాలన్నా.. పెన్షన్ రావాలన్న.. బటన్‌లు నొక్కాలన్నా.. సీఎంగా మళ్లీ జగనే రావాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా నగదు జమ.. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్మును లబ్దిదారాల ఖాతాల్లో ప్రభుత్వం డీబీటీ ద్వారా నగదు జమ చేయటంపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది… ఈ నెల 14వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసుకోవచ్చని గతంలో ఇచ్చిన ఎన్నికల కమిషన్ ఆదేశాలను కొనసాగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ ఒక్కరోజు నగదు బదిలీ చేసేందుకు వెసులుబాటు ఇస్తూ.. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై డివిజన్ బెంచ్ లో విచారణ సాగింది.. అయితే, ఈ నెల 13న పోలింగ్ ఉన్న కారణంగా తర్వాత రోజున డీబీటీ ద్వారా నగదు బదిలీ చేసుకోవాలనీ గతంలోనే ఈసీ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో.. ఆ ఆదేశాలను కొనసాగిస్తూ ఈ నెల 14వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసుకోవచ్చని ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక, DBT ద్వారా నగదు జమ చేయటానికి హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు కాగా.. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలోనే లబ్ధిదారుల ఎంపిక జరిగిందని.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా లబ్ధిదారుల ఎంపిక జరగలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఇప్పుడు కేవలం నగదు ట్రాన్స్ ఫర్ చేయటం మాత్రమే చేస్తున్నాం.. ఇవన్నీ పాత పథకాలు తప్ప కొత్తవి కావన్నారు.. సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చినా ఇప్పటి వరకు ఈసీ మాకు క్లారిటీ ఇవ్వలేదన్నారు.. ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల మేం ఇంకా నిధులు విడుదల చేయలేదని.. గతంలో 2019లో పసుపు కుంకుమ కోసం పోస్ట్ డిటెడ్ చెక్కులు ఇవ్వటం జరిగిందని గుర్తుచేశారు. కానీ, ఈ నెల 14వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసుకోవచ్చని గతంలో ఇచ్చిన ఎన్నికల కమిషన్ ఆదేశాలను కొనసాగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
మోడల్ స్కూల్ ‘ఇంటర్’ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల – వివరాలు ఇలా..
తెలంగాణ మోడల్ పాఠశాలల్లో ఇంటర్ అడ్మిషన్స్ 2024 కోసం నోటిఫికేషన్ ప్రకటించబడింది. అడ్మిషన్ 2024 – 25 విద్యా సంవత్సరకు జరుగుతుంది. ఈ ప్రవేశం మొదటి సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మే 10 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేయాలి. మే 31 చివరి రోజు అని ప్రకటించారు. దరఖాస్తు షరతులు పదవ తరగతి ఉతీర్ణత సాధించిన విద్యార్థులకు వర్తిస్తాయి. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం కోసం ప్రవేశాలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మాధ్యమంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్ లలో అడ్మిషన్లను అందిస్తారు. ఇక వీటికి అర్హత విషయానికి వస్తే.. పదో తరగతి అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ లో దరఖాస్తు పూరించాలి. ఇక ఈ దరఖాస్తులు ప్రారంభం 10, మే, 2024 నుండి మొదలుకాగా.. దరఖాస్తులకు తుది గడువును 31 మే, 2024గా ఇచ్చారు. వీటికి ఎంపిక విధానంలో పదో తరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల ఆధారంగా తుది జాబితాను వెల్లడిస్తారు. ఇందుకోసం అధికారిక వెబ్ సైట్ https://telanganams.cgg.gov.in/ లో అప్లై చేసుకోవచ్చు.
కేజ్రీవాల్ బెయిల్ సందర్భంగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..!
కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ఒక జాతీయ పార్టీకి నాయకుడని తెలిపారు. సమాజానికి ఎటువంటి ముప్పు కలిగించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అయినా కూడా ఇంకా దోషిగా నిర్ధారించబడలేదని అభిప్రాయపడ్డింది. ఎటువంటి నేర చరిత్రలు లేవు కాబట్టి.. సమాజానికి ముప్పులేదని పేర్కొంది. కేవలం లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసమే బెయిల్ ఇస్తున్నట్లు తెలిపింది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన వద్దని సూచించింది. ఈ కేసుకు సంబంధించి గత నెలలో బెయిల్ పొందిన ఆప్ నాయకుడు సంజయ్ సింగ్‌కు విధించిన బెయిల్ షరతులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
ఖలిస్తానీ నేత నామినేషన్.. పంజాబ్ ప్రభుత్వం కీలక ప్రకటన
ఖలిస్తానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశాడు. నిబంధనల ప్రకారం అతడికి సహకరించినట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టుకు సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం జాతీయ భద్రతా చట్టం కింద అమృత్‌పాల్ అస్సాంలోని డిబ్రూగఢ్ జైల్లో ఉంటున్నాడు. శ్రీ ఖదూర్ సాహెబ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు న్యాయస్థానంలో కూడా పిటిషన్ వేశాడు. నామినేషన్ దాఖలు చేసేందుకు తాత్కాలికంగా జైలు నుంచి విడుదల చేయాలని అభ్యర్థించాడు. తన నామినేషన్ దాఖలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ఎన్నికల అధికారి, డిప్యూటీ కమిషనర్‌ను కోరినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించాడు.
టీ20 వరల్డ్ కప్కు ఎంపికైన ఆటగాళ్లకు చాలా అనుభవం ఉంది.. విశ్వాసం వ్యక్తం చేసిన జైషా
టీ20 ప్రపంచ కప్ 2024 కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. జూన్ 2 నుంచి వెస్టిండీస్, అమెరికా గడ్డపై మెగా టోర్నీ ప్రారంభం కానుంది. కాగా.. మెగా టోర్నీకి భారత జట్టును ప్రకటించగా, అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై సెలక్టర్లు మరింత విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా.. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్ వంటి పేర్లు ప్రధాన జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. అయితే, అగార్కర్ నేతృత్వంలో సెలెక్టర్లు అత్యుత్తమ 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేశామని బీసీసీఐ సెక్రటరీ జై షా అభిప్రాయపడ్డారు. పీటీఐతో జై షా మాట్లాడుతూ.. “మాకు అనుభవం ఉన్న జట్టు ఉంది. ఇంతకంటే మెరుగైన జట్టును ఎంపిక చేయలేము. అత్యుత్తమ 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేయడానికి ప్రయత్నించాము. మా జట్టులో 8 మరియు 9 నంబర్లలో బ్యాటింగ్ చేసే ఆటగాళ్లను ఎంపిక చేసాము. ప్రతి పరిస్థితిలోనూ ఆడగలరు.” అని జై షా పేర్కొన్నాడు. అయితే.. జూన్ 5న ఐర్లాండ్‌తో జరిగే ప్రపంచకప్‌లో భారత జట్టు తన మొదటి మ్యాచ్ ఆడనుంది.
టీమిండియాలో పునరాగమనం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన బౌలర్..
టీమిండియాకు ఆడటం అనేది ప్రతి భారతీయ క్రికెటర్ కల. అయితే.. కొంతమంది క్రికెటర్లు విజయం సాధిస్తుండగా, మరికొంత మంది నిరాశ చెందుతున్నారు. టీమిండియాలో అడుగుపెట్టి వారి స్థానాన్ని నిలబెట్టుకోలేక మళ్లీ తిరిగి పునరాగమనం చేయడానికి చాలా కష్టపడుతున్నారు కొందరు క్రికెటర్లు. అలాంటి క్రికెటర్లలో ఖలీల్ అహ్మద్ ఒకరు. తాజాగా.. టీ20 ప్రపంచకప్-2024కి ఎంపికైన టీమిండియా రిజర్వ్ ఆటగాళ్లలో ఖలీల్ ఉన్నాడు. 2019 తర్వాత ఖలీల్ మళ్లీ టీమిండియాలోకి వచ్చాడు. ఈ లెఫ్టార్మ్ బౌలర్ ప్రస్తుతం ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. ఈ సీజన్ లో మంచి ప్రదర్శన ఇస్తున్నాడు. ఈ క్రమంలో.. అతని ప్రదర్శన చూసి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ అతనిపై విశ్వాసం ఉంచి టీ20 వరల్డ్ కప్ లో రిజర్వ్ ఆటగాడిగా ఎంపిక చేశారు. ప్రపంచకప్ రిజర్వ్ ఆటగాళ్లలో చోటు దక్కించుకోవడంపై ఖలీల్ సంతోషం వ్యక్తం చేశాడు. తాను పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం లభించిదని ఆవేదన వ్యక్తం చేశాడు.
వరుడికి 100 ఏళ్లు, వధువుకు 96 ఏళ్లు! వచ్చే నెలలో వీరి ప్రేమ వివాహం!
ప్రేమ అనేది చిన్న పదం కానీ దాని లోతు చాలా పెద్దది. ప్రేమకు నియమాలు , షరతులు లేవు. షరతులతో కూడిన సంబంధంలో ప్రేమ ఉండదు. కౌమారదశలో ప్రేమ పుడుతుందని చాలా మంది అంటారు, కానీ ఇది పచ్చి అబద్ధం. ప్రేమకు వయోపరిమితి లేదు. అదంతా మించిన అనుభూతి. వారిద్దరూ తమ చిన్న వయసులోనే అలాంటి భావాల బంధానికి లొంగిపోయారు. ఎవరు వాళ్ళు వారి కథ ఏమిటి? ఇక్కడ తెలుసుకుందాం. హెరాల్డ్ టెరెన్స్ వయస్సు ఇప్పుడు 100 సంవత్సరాలు, జీన్ స్వెర్లిన్ వయస్సు 96, , వారు వచ్చే నెలలో ఫ్రాన్స్‌లో వివాహం చేసుకోనున్నారు. ఎందుకంటే హెరాల్డ్ టెరెన్స్ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఫ్రాన్స్‌లో పనిచేశాడు. యుఎస్ ఎయిర్ ఫోర్స్ వెటరన్ టెరెన్స్ జూన్ 6న నార్మాండీలో డి-డే ల్యాండింగ్‌ల 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, యుద్ధ గమనాన్ని మార్చిన చారిత్రాత్మక మిత్రరాజ్యాల ఆపరేషన్. ఈవెంట్ జరిగిన రెండు రోజుల తర్వాత, హెరాల్డ్ , జీన్ కారెంటన్-లెస్-మరైస్‌లో వివాహం చేసుకుంటారు. వీరి పెళ్లి రోజు చాలా ప్రత్యేకమైనది. అంటే 1944లో జరిగిన యుద్ధంలో వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అతని జ్ఞాపకార్థం ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. మా ప్రేమ “మీరు ఇంతకు ముందెన్నడూ వినని ప్రేమకథ” అని టెరెన్స్ US వార్తా సంస్థ AFPతో అన్నారు.
పిఠాపురం ప్రచారంపై స్పందించిన మెగాస్టార్..
మెగా స్టార్ చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ను ప్రకటించిన విషయం తెలిసిందే..తాజాగా పద్మ విభూషణ్ అవార్డు కోసం మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. మే 9 న న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా చ్రతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.అవార్డు ప్రధానోత్సవం ముగిసాక కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక డిన్నర్ పార్టీలో మెగాస్టార్ తన కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.అక్కడదిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా చిరంజీవి కుటుంబ సభ్యులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు.తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు..తన సేవలు గుర్తించి కేంద్రం ఈ అవార్డు ప్రధానము చేయడం ఎంతో సంతోషంగా వుంది.ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణం తన అభిమానులని చిరంజీవి తెలిపారు .వారు చూపిన ప్రేమాభిమానాల వల్లే తనకి ఈ అవార్డు లభించిందని ఆయన అన్నారు.ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ కు మద్దతుగా తాను పిఠాపురం ప్రచారానికి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని చిరణజీవి తెలిపారు .తాను ప్రచారానికి వెళ్లట్లేదని ఆయన తెలిపారు .