ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్లో రాయల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 141 పరుగులు చేసింది. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. కాగా.. ఈ ఐపీఎల్లో రాజస్థాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి. రాజస్థాన్ ఈ ఓటమితో ప్లేఆఫ్ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. అయితే రాజస్థాన్‌కు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలవాలి.
Air India: ప్రయాణికులకు ఊరట.. విధుల్లో చేరిన సిబ్బంది
మరోవైపు.. ఈ ఓటమిపై ఆర్ఆర్ కెప్టెన్ స్పందించాడు. పిచ్‌ను ప్రిడిక్ట్ చేయడం విఫలమయ్యామని శాంసన్ చెప్పాడు. పవర్‌ప్లేలో వికెట్ స్లోగా ఉందని, ఆ సమయంలో పరుగులు చేయడం అంత సులభం కాదని భావించామన్నారు. తమ లక్ష్యం 170-175 పరుగులు ఉండాలనున్నాం.. కానీ 20-25 పరుగులు వెనుకపడినట్లు శాంసన్ తెలిపారు. చెన్నై బౌలర్లలో సిమర్‌జీత్ బాగా బౌలింగ్ చేశాడన్నారు. 3 కీలకమైన వికెట్లు తీసి పరుగులు చేయకుండా ఆపారని చెప్పారు.
Chennai Super Kings: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన రికార్డు!
మరోవైపు.. డే గేమ్‌లో చెన్నైలో వేడి ఎక్కువగా ఉంటుంది.. పిచ్ నెమ్మదిగా మారుతుందని అన్నారు. బ్యాటింగ్‌లోనూ చెన్నై తమ కంటే మెరుగ్గా రాణించారని చెప్పారు. గత మూడు మ్యాచ్‌ల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ, కొన్ని విషయాలు తమ చేతుల్లో లేవన్నారు. తాము మంచి క్రికెట్ ఆడుతున్నామని.. ఓడిన మ్యాచ్‌ల నుండి ఖచ్చితంగా కొన్ని పాఠాలు నేర్చుకుంటామని సంజూ శాంసన్ తెలిపారు.