భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. ఈరోజు ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో రెండో టీ20 జరుగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో.. మొదట భారత్ బ్యాటింగ్ చేయనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు.. బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో గెలువాలని పట్టుదలతో ఉంది. కాగా బంగ్లాదేశ్ జట్టు ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. టీమిండియా ఎలాంటి మార్పులు చేయలేదు.
Read Also: AP Cabinet: రేపు ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక ప్రతిపాదనలపై చర్చ
భారత్ ప్లేయింగ్ ఎలెవన్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్.
బంగ్లాదేశ్ ప్లేయింగ్ ఎలెవన్: పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తౌహీద్ హర్దోయ్, మహ్మదుల్లా, జకీర్ అలీ, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్.