హాయ్ ఏపీ.. బైబై బీపీ ( బాబు, పవన్) ప్రజల నినాదం..!
హలో ఏపీ.. బైబై వైసీపీ.. ఇదే మన నినాదం అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.. వారాహియాత్ర చేస్తున్న ఆయన.. ప్రభుత్వ విధానాలు, సీఎం జగన్, మంత్రలు, వైసీపీ నేతలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇక, అదే స్థాయిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఎటాక్ చేస్తోంది.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి ఆర్కే రోజా.. పవన్ కల్యాణ్‌తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.. హాయ్ ఏపీ.. బైబై బీపీ (బాబు, పవన్ కల్యాణ్) అనే నినాదాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలు అందుకుంటారని తెలిపారామె. ఎన్నికల గుర్తులేదు, జిల్లా అధ్యక్షులు లేరు, 175 స్థానాల్లో అభ్యర్థులు లేరు.. అయినా సీఎం జగన్‌ను తరిమేస్తానని పవన్ కల్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.. ఇక చంద్రబాబు నాయుడును నమ్మే పరిస్థితిల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరన్నారు మంత్రి ఆర్కే రోజా.. వీరు స్లోగన్ దగ్గర నుంచి మేనిఫెస్టో వరకు అంతా కాపీ కొడుతున్నారు.. బుర్ర పెట్టి కొత్తగా ఆలోచించే సత్తా కూడా వీరికి లేదంటూ ఎద్దేవా చేశారు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన మేనిఫెస్టోని పక్కన పెట్టేశాడు.. చెప్పిన ప్రతి మాటను నెరవేర్చిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ ఒక్కడేనని పేర్కొన్నారు.. ఇప్పుడిప్పుడే ఏపీ ప్రజలు బాగున్నారు.. మళ్లీ చంద్రబాబును కొనితెచ్చుకుంటారా? అని ప్రశ్నించారు..
ఆ ప్రచారాలు నమ్మొద్దు.. పార్టీ మార్పుపై రాజగోపాల్ క్లారిటీ
పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తాను కాంగ్రెస్‌లో చేరుతున్నానని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను బీజేపీలోనే ఉన్నానని.. ఊహాగానాలను, ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. తాను ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. పార్టీ మారుతున్నట్టు తనపై ప్రచారాలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని అన్నారు. పార్టీ మార్పుపై తాము ఏదైనా నిర్ణయం తీసుకుంటే, తామే స్వయంగా మీడియాకి చెప్తాం కదా! అని పేర్కొన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని.. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్యం బతకాలంటే, అది ప్రధాని మోడీ నాయకత్వంలోని బీజేపీతోనే సాధ్యమవుతుందనే ఉద్దేశంతోనే తాను ఆ పార్టీలోకి చేరానని చెప్పారు. కేసీఆర్ కుటుంబం అవినీతి బయటపడాలన్నా, రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలు బాగు పడాలన్నా.. అది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందని అన్నారు. అలాగే.. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలిసినప్పుడు, తాను తన అభిప్రాయాలను తెలుపుతానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందేని చెప్పారు. కవితను అరెస్ట్ చేయాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. అయితే కవిత అరెస్ట్, ఈడీ కేసుల వ్యవహారంలో నాన్చుడు జరుగుతుండటంతో.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అండర్‌స్టాండింగ్ ఉందని ప్రజలంతా అనుకుంటున్నారన్నారు. ఈ విషయంపై కూడా తాను అధిష్టానంతో మాట్లాడుతానన్నారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని.. ఇందులో భాగంగానే కేటీఆర్‌కు కేంద్రమంత్రులు అపాయింట్‌మెంట్ ఇస్తున్నారని వెల్లడించారు. కేటీఆర్, కేంద్రమంత్రుల భేటీని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని సూచించారు. కాగా.. బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు ఈటల రాజేందర్‌తో కలిసి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ బయల్దేరిన విషయం తెలిసిందే.
ఆసియా క్రీడల్లో ఆ రెండు జట్లు పాల్గొంటాయి.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..!
ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో ఆసియా క్రీడలు జరగనున్నాయి. చైనాలో జరగనున్న ఈ గేమ్స్‌లో క్రికెట్‌ను కూడా చూడనున్నారు. ఈ క్రీడల్లో భారత పురుషుల, మహిళల జట్లు పాల్గొంటాయి. ఆసియా క్రీడలకు తమ పురుషుల, మహిళల జట్లను పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి ముందుగా బోర్డు సిద్ధంగా లేకపోయినా ఇప్పుడు అంగీకరించడంతో.. ఆసియా క్రీడల్లో టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ ఆడనుంది. అయితే ఈ గేమ్‌లలో భారత మహిళల జట్టు ఆడనుంది. మరోవైపు ఇండియాలో జరిగే వన్డే ప్రపంచకప్‌కు ప్రధాన జట్టు సిద్ధమవుతున్నందున.. పురుషుల విభాగంలో భారత ‘బి’ జట్టు బరిలోకి దిగుతుంది. హాంగ్‌జౌలో జరిగే ఈ గేమ్‌ల కోసం బీసీసీఐ రెండు జట్ల పేర్లను సమర్పించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు గతంలో బిజీ షెడ్యూల్ కారణంగా ఈ గేమ్‌లలో జట్టును ఎంపిక చేయడానికి బీసీసీఐ నిరాకరించింది. ఈ గేమ్‌లకు తమ జట్టులో ఎవరినీ పంపబోమని బోర్డు స్పష్టంగా పేర్కొంది. ఎందుకంటే ఆసియా క్రీడల్లో పురుషుల జట్టు మ్యాచ్‌లు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 8 వరకు జరగనున్నాయి. మరోవైపు వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లు కూడా అప్పుడే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల జట్టు విదేశీ పర్యటనలకు వెళ్లవచ్చని బీసీసీఐ తెలిపింది. గతంలో రెండు సార్లు ఆసియా క్రీడల్లో క్రికెట్ భాగమైంది. 2010 మరియు 2014లో ఈ గేమ్‌లలో క్రికెట్‌ను చేర్చారు. అయితే భారత్ రెండుసార్లు ఈ గేమ్ లలో పాల్గొనలేదు. 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను చేర్చలేదు.
ఒమిక్రాన్ ఎంఆర్‌ఎన్‌ఏ బూస్టర్ వ్యాక్సిన్ ప్రారంభం
కొవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ నివారణ కోసం ఒమిక్రాన్ ఎంఆర్‌ఎన్‌ఎ ఆధారిత బూస్టర్ వ్యాక్సిన్‌ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శనివారం ప్రారంభించారు. జెమ్ కొవాక్ ఒమ్(GEMCOVAC-OM) అనేది భారత దేశానికి చెందిన మొట్టమొదటి ఎంఆర్‌ఎన్‌ఎ ఆధారిత వ్యాక్సిన్. స్వదేశీ సాంకేతికతతో జెనోవా దీనిని అభివృద్ధి చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ), బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చి అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్‌ఎసీ) నిధులు సమకూర్చాయి. సాధారణ ఉష్ణోగ్రతల స్థాయిలో ఈ వ్యాక్సిన్ నిల్వ చేయవచ్చు. అలాగే దేశంలో ఎక్కడికైనా రవాణా చేయవచ్చు . సూది, సిరంజీ అవసరం లేకుండా ఈ ఇంజెక్షన్‌ను ఇవ్వవచ్చని మంత్రి జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా వివరించారు. కొన్ని రోజుల క్రితం, ఈ టీకా అత్యవసర వినియోగ అనుమతి కోసం డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) కార్యాలయం నుంచి ఆమోదం పొందింది. రోగులు ఎవరైనా కొవిషీల్డ్, కొవాక్సిన్ టీకాలు వేయించుకున్నా బూస్టర్ డోస్‌గా ఈ ఒమిక్రాన్ వ్యాక్సిన్‌ను వేసుకోవచ్చు. ఎంఆర్‌ఎన్‌ఎ ఆధారిత ఇతర వ్యాక్సిన్ల మాదిరిగా ఈ వ్యాక్సిన్‌కు అతిశీతల సరఫరా వ్యవస్థ అవసరం లేదు. దేశంలో ఎక్కడికైనా ఎటువంటి ఉష్ణోగ్రతల్లో నైనా సరఫరా చేయవచ్చు. సంప్రదాయ సిరంజీలు, సూదులు అవసరం లేకుండా ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు. వేగంగా అందుబాటు లోకి తీసుకురాడానికి తాము చేసిన ప్రయత్నాలకు ఈ అనుమతి రావడమే సాక్షంగా జెనోవా బయోఫార్మాక్యూటికల్స్ సంస్థ సీఈవో సంజయ్ సింగ్ చెప్పారు. సాధారణంగా వ్యాక్సిన్ల సరఫరాకు దేశంలో 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు సౌకర్యం కల్పించ వలసి ఉంటుంది. కానీ ఈ బూస్టర్ ఒమిక్రాన్ వ్యాక్సిన్‌కు సరఫరా చేయాలన్నా నిల్వ చేయాలన్నా అతిశీతల ఉష్ణోగ్రత పరిస్థితి అవసరం లేదని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.
తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే.. కేంద్రమంత్రి రూపాల
ఈసారి తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పరుషోత్తం రూపాల ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గడికోటను సందర్శించిన అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ.. పూర్వ బీజేపీ కార్యకర్తల వల్ల నేడు తెలంగాణలో బీజేపీ బలంగా తయారైందన్నారు. భారతదేశ అభివృద్ధి.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి.. మోడీని ప్రపంచ దేశాలు ఆహ్వానిస్తున్నాయని చెప్పారు. గతంలో అగ్రరాజ్యమైన అమెరికా మోడీ వీసాను నిషేధించిందని, ఇప్పుడు ఆ అగ్రరాజ్యాలే మోడీని పిలుస్తున్నాయని చెప్పారు. దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందన్న ఆయన.. రాబోయే తెలంగాణ ఎన్నికల్లోనూ బీజేపీ గెలుస్తుందని నమ్మకం వెలిబుచ్చారు. రామ మందిరాన్ని నిర్మించిన ఘనత ప్రధాని మోడీకి దక్కుతుందని ఉద్ఘాటించారు. అంతకుముందు మంచిర్యాల చెన్నూర్‌లో మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధి సాధించాలంటే.. బీజేపీని గెలిపించాలని పరుషోత్తం రూపాల పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై విముఖత ఉందని తాను విన్నానని, తెలంగాణకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్నో నిధులు మంజూరు చేసిందని అన్నారు. మోడీ రాకముందే దేశంలో అవినీతి మాత్రమే ఉండేదని, కానీ మోడీ ప్రధాని అయ్యాక ఈ 9 ఏళ్లలో ఒక్కరు కూడా అవినీతి గురించి మాట్లాడే ధైర్యం చేయడం లేదన్నారు. కరోనా కాలంలో వ్యాక్సిన్ అందించి, ఎంతోమంది ప్రాణాలను మోడీ కాపాడారన్నారు. ఆర్టికల్ 370 కశ్మీర్ సమస్యను పరిష్కరించిన ఘనత ఒక్క మోడీకే దక్కిందన్నారు. సమర్థవంతమైన మోడీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోందన్నారు. ఆగిపోయిన 100 డ్యామ్‌ల నిర్మాణాలను మోడీ తిరిగి ప్రారంభించారని.. వాటిలో 60 డ్యామ్‌ల పని పూర్తయ్యిందని తెలిపారు. దేశంలో 11 కోట్ల మరుగుదొడ్లను సైతం కట్టించారన్నారు.
షాంపైన్ మూత తెరవడంపై వాదన.. కొట్టుకున్న క్లబ్ సిబ్బంది, కస్టమర్లు
షాంపైన్‌ను తీయడం వల్ల క్లబ్ ఉద్యోగికి, కస్టమర్‌కు మధ్య జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి బాంద్రాలోని ఇస్కో క్లబ్‌లో చోటుచేసుకుంది. క్లబ్‌లోని కస్టమర్లను బౌన్సర్లు కొట్టిన వీడియో కూడా వైరల్‌గా మారింది. వీడియోలో, బౌన్సర్ కస్టమర్లను కొట్టడం స్పష్టంగా కనిపించింది. ఈ కేసులో బాధితురాలి ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. నిన్న(శుక్రవారం) అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కొందరు యువకులు బాంద్రాలోని ఇస్కో క్లబ్‌కు వెళ్లారు. అక్కడ షాంపైన్‌ను విప్పడంపై క్లబ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ఈ వాదన ఘర్షణగా మారింది. క్లబ్‌లలోని బౌన్సర్లు కస్టమర్లను కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే బాంద్రా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కస్టమర్లను రక్షించారు. దీంతో బాంద్రా పోలీసులు యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఏడుగురిని అరెస్టు చేసినట్లు ముంబై పోలీస్ జోన్ 9కి చెందిన సీపీ కృష్ణకాంత్ ఉపాధ్యాయ తెలిపారు.
మొన్న బాలయ్య, ఇప్పుడు చిరు.. తెలంగాణ యాసలో రచ్చ లేపుడే!
ఒకప్పుడు తెలంగాణ యాసను సినిమాల్లో ఎక్కువగా వాడేవారు కాదు. ఎక్కువగా అచ్చమైన తెలుగు భాషను అప్పుడప్పుడు విలన్లకు రాయలసీమ యాసను, తెలంగాణ యాసను మాత్రమే వాడుతూ ఉండేవారు. కానీ ఈ మధ్యకాలంలో తెలంగాణ యాస ఉన్న సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఫిదా ఆ తర్వాత బలగం, దసరా, ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ చేత కూడా ఇదే విధమైన తెలంగాణ యాస మాట్లాడించడంతో ఇప్పుడు తెలంగాణ యాస మీద కూడా అందరికీ సెంటిమెంట్ ఏర్పడుతోంది. తెలంగాణ యాస వుంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ కూడా భగవంత్ కేసరి సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఉండగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సైతం భోళా శంకర్ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతున్నట్టుగా తేలిపోయింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళాశంకర్ సినిమాకి సంబంధించిన టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఒక్కసారిగా ప్రేక్షకులలో అంచనాలు పెంచే విధంగా సాగింది. ఇక ఈ టీజర్ లో మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. మొన్నటికి మొన్న బాలకృష్ణ, ఇప్పుడు చిరంజీవి కూడా తెలంగాణ యాసలోనే మాట్లాడుతూ ఉండడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని మెగా అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన హీరోయిన్గా తమన్నా భాటియా నటిస్తుండగా సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. అక్కినేని కుటుంబానికి చెందిన సుశాంత్ ఒక లవర్ బాయ్ తరహా పాత్రలో నటిస్తుండగా ఆయన కీర్తి సురేష్ కి జోడిగా నటిస్తున్నాడని ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ఈ సినిమాని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు..
శారీలో స్కిన్ షో చేస్తూ స్టన్నింగ్ పోజులు..
ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్లలో ఒకరు సంయుక్త మీనన్.. భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల కు పరిచయమైన ఈ అమ్మడు రీసెంట్గా విరూపాక్ష చిత్రంతో మరో సూపర్ కొట్టేసింది. అందంతో పాటు నటనలో కూడా అదరగొడుతుండడం తో టాలీవుడ్ లో సంయుక్త క్రేజీ హీరోయిన్ గా మారింది. ఈ చిత్రంతో సంయుక్త మీనన్ మరోసారి గోల్డెన్ లెగ్ అని నిరూపించుకుంది… దర్శకుడు కార్తీక్ దండు వణుకు పుట్టించే మిస్టరీ థ్రిల్లర్ కథ తో అదరగొట్టేశారు. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ నటన అద్భుతంగా ఉంది.. గ్రామంలో జరిగే మిస్టరిని చేదించడంలో తేజు తన నటనతో విజ్రూంభించాడు.. ఇక సంయుక్త కూడా హీరోతో సమానంగా నటిస్తూ తన గ్లామర్ మెరుపులను మెరిపించింది.. విరూపాక్ష చిత్రం సూపర్ హిట్ కావడం, తన పాత్రకి ప్రశంసలు దక్కుతుండడం తో ఆ జోష్ లో సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది. వరుసగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా సంయుక్త మీనన్ పింక్ కలర్ చీరలో మెరుపులు మెరిపిస్తూ ఫోజులు ఇచ్చింది. సంయుక్త మీనన్ కి ట్రెడిషనల్ వేర్ అద్భుతంగా సెట్ అవుతుంది. ఆ విషయం ఈ ఫొటోస్ తో మరోసారి ప్రూవ్ అయింది.. డిజైనర్ చీరలో మెస్మరైజ్ చేసింది.. ఎద అందాలు హైలైట్ అయ్యేలా బ్లౌజ్ చూపిస్తూ మెరుపులు మెరిపిస్తోంది. కళ్ళు చెదిరే స్కిన్ షోతో సంయుక్త అదరహో అనిపిస్తోంది. టాలీవుడ్ ఆమె నటించిన భీమ్లా నాయక్, బింబిసార, సార్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఇటీవల విడుదలైన విరూపాక్ష సినిమా కూడా జనాలను ఆకట్టుకుంది.. టాలీవుడ్ లో సంయుక్త కూడా క్రేజీ హీరోయిన్ అనే చెప్పాలి. ఆమె అడుగు పెడితే సినిమా సూపర్ హిట్ అవుతుండడంతో ఇక ప్రొడ్యూసర్స్ ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు.. నెక్స్ట్ ఎవరికి ఛాన్స్ ఇస్తుందో చూడాలి.
రామ్ చరణ్ వాచ్ ధర ఎన్ని కోట్లో తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు..కొణిదెల వారి ఇంట మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టింది. ఈనెల 20న ఉదయం ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది..దీంతో మెగా ఇంట సంబురాలు జరుగుతున్నాయి. అభిమానులు, మెగా ఫ్యామిలీ, శ్రేయోభిలాషులు చెర్రీఉపాసన దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.. పాప పుట్టి నాలుగు రోజులు అవుతున్నా కూడా ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో ఇంక ఇదే మాట వినిపిస్తుంది. ఇక రామ్ చరణ్ – ఉపాసనలు శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. కూతురు పుట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆశీర్వదించిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే.. తాజాగా చెర్రీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అందేంటో కాదు చరణ్ ఆ సమయంలో పెట్టుకున్న వాచ్..ఆ వాచ్ ధర ఎంతో తెలిస్తే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. రిచర్డ్ మిల్లే బ్రాండ్ కు చెందిన వాచ్ ను చరణ్ ధరించారు. ఆ వాచ్ ధర ఎంతనే దానిపై కొందరు అభిమానులు సెర్చ్ చేశారు. అక్షరాల రూ. కోటీ 62 లక్షలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఫ్యాన్స్,, నెటిజన్లు షాక్ అవుతున్నారు.