సీఎం జగన్‌కు హరిరామ జోగయ్య బహిరంగలేఖ.. ఆ పరిస్థితే వస్తే సీఎం ఎవరు?
ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెరుగుతూనే ఉంది.. ఓవైపు యాత్రలు, పాదయాత్రలు, సభలు, సమావేశాల వేదికగా సవాళ్ల పర్వం, ఆరోపణలు, విమర్శలు కొనసాగుతుండగా.. మరోవైపు లేఖల యుద్ధం కూడా సాగుతూనే ఉంది.. సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ హోంమంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.. గతంలో సీఎం వైఎస్ జగన్‌తో పాటు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకి లేఖలు రాసిన ఆయన.. ఈ సారి సీఎం జగన్‌కు రాసిన లేఖలో సంచలన విషయాలు పేర్కొన్నారు.. మీపై సీబీఐ, ఈడీ విచారణ చేసి క్విడ్‌ప్రోకో కింద, మనీ ల్యాండరింగ్ కింద సీబీఐ 11 కేసులు, ఈడీ ఆరు కేసులు బనాయించాయి.. 16 నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యారు.. కానీ, ముఖ్యమంత్రిపై ఉన్న కేసుల్లో సీబీఐ కోర్టులో ఇంకా విచారణలో ఉన్నాయి.. కోర్టులు ఏ కారణం చేతైనా మిమ్మలను దోషులుగా ప్రకటిస్తే.. సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వస్తే.. మీ వారసులుగా రెడ్డి కులస్తులను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారా..? లేక కాపు బడుగు బలహీన వర్గాల వారిని వారసులుగా ప్రకటిస్తారా? ఈ విషయాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు.. దీని ద్వారా బడుగు బలహీన వర్గాలపై మీకున్న కమిట్‌మెంట్ చూసి గర్వపడతామని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని బహిరంగ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేయాలని మిమ్మల్ని కోరుతున్నానంటూ.. సీఎం వైఎస్ జగన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు హరిరామ జోగయ్య.
టీడీపీని నందమూరి ఫ్యామిలీకి అప్పగించాలి.. జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌కు పగ్గాలు ఇవ్వాలి..!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌పై మరోసారి మండిపడ్డారు తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆమె.. చంద్రబాబు హయాంలో సెల్ఫ్ డబ్బా తప్ప.. అభివృద్ది శూన్యం.. ఎన్నో కష్టాలు పడిన వైఎస్ జగన్ కు రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారని తెలిపారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ధనవంతుడు అయ్యాడే తప్ప.. నిరుపేదలు అలాగే ఉన్నారని విమర్శించిన ఆమె.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. పుత్రుడు, దత్త పుత్రుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినా.. ప్రజలు నమ్మరు.. ఎన్టీఆర్ మనవడుగా లోకేష్ ను ప్రజలు రిసీవ్ చేసుకోవడం లేదు.. వాళ్లిద్దరికీ నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ఇక, టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పగించాలని డిమాండ్ చేసిన లక్ష్మీపార్వతి.. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌కు పార్టీ పగ్గాలు ఇవ్వాలని సూచించారు. చంద్రబాబు నాయడు ఇసుక మీద 4 వేల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారని ఆరోపించారు లక్ష్మీపార్వతి.. చంద్రబాబు సైకో, శాడిస్ట్ కాబట్టే.. ప్రశ్నించే వారిని గుర్రాలతో తొక్కించారు.. తహశీల్దార్ వనజాక్షిని బెదిరించారని విరుచుకుపడ్డారు. ఇక, లోకేష్ అయోమయంలో మాట్లాడుతున్నారు.. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వైసీపీ హయాంలో జరిగినట్లు విమర్శలు చేస్తున్నారని.. అధికారంలోకి రాక ముందే దత్త పుత్రుడు, సొంత పుత్రుడు చంపుతా, నరుకుతా, బట్టలు విప్పి కొడతా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పనికి మాలిన లోకేష్ కోసం కోట్లు ఖర్చు పెట్టి భాష నేర్పించాడు.. అయినా అతనిలో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు.. ఇప్పటికైనా టీడీపీని నందమూరి ఫ్యామిలీకి అప్పగించాలి.. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని సూఇంచారు.. 2019లోనే చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అయ్యిందని వ్యాఖ్యానించిన ఆమె.. సినిమాలు చేసుకుంటున్న పవన్ ను తీసుకొచ్చి.. కాపు నాయకుల్ని తిట్టిస్తున్నాడని ఆరోపించారు.. విష వృక్షం నీడలో రాజకీయాలు చెయ్యొద్దని గతంలో పవన్ కల్యాణ్‌కి చెప్పానని గుర్తుచేసుకున్నారు లక్ష్మీపార్వతి.
పవన్‌కు స్వల్ప అస్వస్థత..! సమావేశం వాయిదా..
ఉభయ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర చేపట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బిజీబిజీగా గడుపుతున్నారు.. ఓవైపు సమావేశాలు నిర్వహిస్తూ.. పార్టీ నిర్మాణంపై కీలక సూచనలు చేస్తూ వస్తున్న ఆయన.. మరోవైపు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు.. ఇలా వారాహి యాత్ర చేపట్టినాటి నుంచి నిత్యం ఏదో ఒక షెడ్యూల్‌లో గడుపుతున్నారు.. అయితే, ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈరోజు ఉదయం 11 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కావాల్సింది ఉంది.. కానీ, ఉదయం జరగాల్సిన ఆ సమావేశం ఉన్నట్టుండి సాయంత్రానికి వాయిదా వేశారు.. సాయంత్రం 4 గంటలకు భీమవరంలో జనసేన నేతల మీటింగ్ ఉంటుందని తాజాగా ప్రకటించాయి జనసేన పార్టీ శ్రేణులు. అయితే, దీనికి ప్రధాన కారణం జనసేనాని పవన్ కల్యాణ్‌కు స్వల్ప అస్వస్థతకు గురికావడమే కారణంగా తెలుస్తోంది. పవన్ అస్వస్థతకు గురికావడంతో వైద్యుల సూచన మేరకు రెస్ట్ తీసుకుంటున్నారట.. దీంతో.. ఉదయం జరగాల్సిన సమావేశం కాస్త.. సాయంత్రానికి వాయిదా పడింది.
మీడియా ముందుకు ఈటల దంపతులు..! సంగతి ఏంటి?
ఈటల రాజేందర్ దంపతులు మంగళవారం మీడియా ముందు హాజరుకానున్నారు. సంచలన ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఏదో పెద్ద ప్రకటన చేయబోతున్నారు. రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్న ప్రస్తుత తరుణంలో.. ఈటల రాజేందర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతున్నారు? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుని భార్యతో చర్చించి తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై ప్రెస్ మీట్ పెట్టి నిర్ణయం ప్రకటిస్తున్నట్లు సమాచారం. ఈటల స్వతహాగా చాలా సమర్థుడైన నాయకుడు. అయితే, అత్యంత క్లిష్టమైన సమయాల్లో మాత్రమే అతని భార్య జమున జోక్యం చేసుకుంటుంది. గతంలో బీఆర్‌ఎస్ నుంచి వెళ్లే సమయంలో జమున ఈటెలకు అండగా నిలిచారు. ఆ సమయంలో ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పించారు. అయితే విప్లవ భావాలు బలంగా ఉన్న ఈటల రాజేందర్ గత కొంతకాలంగా కాషాయ కూటమిలో చేరడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మంగళవారం నాడు ఈటల దంపతుల ప్రెస్ మీట్.. తడబడకుండా మీడియా ముందుకు వస్తున్నారంటే సంగతి ఏంటి? ఈటల రాజేందర్ బీజేపీని వీడుతున్నారా? ఆ నిర్ణయం ప్రకటించేందుకు ప్రెస్ మీట్ పెట్టారా? బీజేపీని వీడితే ఎక్కడికి వెళ్తారు? సొంత పార్టీ ఉందా? ప్రచారంలో జరుగుతున్నట్లు కాంగ్రెస్‌లో చేరతారా? అనే చర్చ సాగుతోంది.
మందార పూలను ఇలా తీసుకుంటే చాలు.. వందేళ్ల ఆయుష్షు..
ఈ మధ్య వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్న వారిసంఖ్య ఎక్కువగా ఉంది.. చిన్న వయస్సు వారిలోనూ గుండె సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. WHO ప్రకారం, హృదయ సంబంధ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఏడాదికి 17 మిలియన్ల కంటే ఎక్కువ మంది గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్నారు. ఆసియన్లలోనూ గుండె సంబంధత సమస్యలు ఎక్కువవుతున్నాయని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది.. ఇలా సమస్యలు రావడానికి కారణం జీవనశైలిలో మార్పు కారణం అని నిపుణులు చెబుతున్నారు.. ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే మంచి ఆహరం తీసుకోవాలి.. దాంతో పాటు తరచు మందారం టీ తాగితే గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అంటున్నారు. మందారం మన గుండె ఆరోగ్యాన్ని ఎలా రక్షిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మందారలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనం వాస్కులర్ ఎండోథెలియం నుంచి నైట్రిక్ ఆక్సైడ్ విడుదలకు తోడ్పడుతుంది. ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది..రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి, రక్తనాళాలు పగిలిపోవడాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటారు. ఇది ప్రాణాంతకం కావచ్చు. మందారం తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్, చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. రక్తనాళాలలో ఆక్సీకరణ ఒత్తిడి, తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ ఆక్సీకరణం, నురుగు కణాల నిర్మాణాన్ని మందారం తగ్గిస్తుంది.. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అయినప్పుడు.. అది అథెరోస్క్లెరోసిస్‌కు దారి తీస్తుంది. ఇది అనేక గుండె సమస్యల ముప్పును పెంచుతుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మందారలో ఫ్లేవనాయిడ్లు, ఫినాలిక్ సమ్మేళనాలు, బీటా కెరోటిన్, విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.. అందుకే కొవ్వు కంట్రోల్ అవుతుంది.
ఇంట్లోకి బొద్దింకలు వస్తున్నాయా.. ఈ 5 మార్గాలతో వాటిని వదిలించుకోండి
వర్షాకాలంలో ఇంట్లో బొద్దింకల భయం మొదలవుతుంది. ఇంట్లో ఎంత శుభ్రత ఉన్నా, వర్షంలో తేమ కారణంగా బొద్దింకలు విజృంభిస్తాయి. ఇంట్లో వంటగది, స్టోర్ రూమ్‌లో ఉండే బొద్దింకలు మిమ్మల్నీ బాగా ఇబ్బందిపెడతాయి, కొన్ని చిట్కాలతో మీరు వాటిని సులభంగా వదిలించుకోవచ్చు. బొద్దింకలను వదిలించుకోవడానికి మార్కెట్లో అనేక రకాల మందులు, స్ప్రేలు అందుబాటులో ఉన్నాయి. కానీ అవి రసాయనాలు, విషపూరితమైనవి. అటువంటి పరిస్థితిలో బొద్దింకలను వదిలించుకోవడానికి మీరు ఈ హోం మేడ్ చిట్కాలను పాటించి బొద్దింకలను తరిమేయవచ్చు. అవేంటో తెలుసుకుందాం..
– ఇంట్లో నుండి బొద్దింకలను తరిమికొట్టడానికి.. ఒక గిన్నె పిండిలో రెండు చెంచాల పంచదార, ఒక చెంచా పసుపు, రెండు చెంచాల బోరిక్ పౌడర్ కలిపి పేస్ట్ చేయండి. పేస్ట్ సిద్ధమైన తర్వాత, దానిని వంటగదిలోని స్లాబ్‌పై, బొద్దింకలు వచ్చే చోట రాయండి. ఈ పరిహారం బొద్దింకలను తరిమికొడుతుంది.
– వర్షాకాలంలో అపరిశుభ్రత వల్ల బొద్దింకలు విజృంభిస్తాయి. ఇలాంటప్పుడు ఒక గిన్నెలో వేపనూనె తీసుకుని ఇంట్లో స్ప్రే చేయాలి. దీన్ని ఇంట్లో చల్లితే బొద్దింకలు ఇంట్లోంచి పారిపోతాయి.
– బొద్దింకలు లవంగాల వాసన నుండి దూరంగా ఉంటాయి. కాబట్టి లవంగాలను ఇంటి మూలల్లో చల్లుకోండి. దాని వాసనతో వర్షంలో పెరిగే బొద్దింకలు, ఇతర కీటకాలు రావు.
– ఆకులను గ్రైండ్ చేసి నీళ్లలో కలిపి ఇంట్లో చిలకరించాలి, ఇలా చేయడం వల్ల బొద్దింకలు ఇంట్లో నుండి మాయమవుతాయి.
– ఇంట్లో, వంటగదిలో శుభ్రత పాటించడం ద్వారా బొద్దింకలు పెరగకుండా నిరోధించవచ్చు.
న్యూయార్క్ లో ఇకపై దీపావళి నాడు స్కూళ్లకు హాలిడే.. ప్రకటించిన మేయర్
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచంలోని పలు దేశాలు అమలు చేస్తున్నాయి. భారతీయ సంస్కృతిలో భాగమైన దేవాలయాలు ఇప్పటికే కొన్ని దేశాల్లో నిర్మించారు. అలాగే విదేశాల్లో భారతీయ సంతతికి చెందిన వారు ఎక్కువగా ఉంటున్న ప్రాంతాల్లో భారతీయ పండుగలను సైతం జరుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో దీపావళి పండుగకు సెలవు ఇవ్వాలని కామన్స్ సభలో ప్రైవేటు తీర్మానం ప్రవేశ పెట్టారు. త్వరలోనే దీనిపై నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే దీపావళి నాటికి అనుకూలమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందంటున్నారు. ఇపుడు న్యూయార్క్ లో సైతం దీపావళి పండుగకు స్కూల్స్ కు సెలవు ఇస్తున్నట్టు మేయర్ ప్రకటించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భారతీయులు దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగకు న్యూయార్క్ లో సైతం ప్రాధాన్యత కల్పించబడింది. విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లు సైతం ఈ పండుగను ఏటా ఎంతో సందడిగా జరుపుకుంటారు. హిందువులు ఘనంగా జరుపుకునే దీపావళి పండుగకు న్యూయార్క్ మేయర్ ప్రాధాన్యత కల్పించారు. దీపావళి పర్వదినాన న్యూయార్క్‌లో పాఠశాలలకు సెలవుదినంగా ప్రకటించారు. న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. దీపావళి రోజున స్కూళ్లకు సెలవు ప్రకటించే చట్టంలో తాను భాగమైనందుకు గర్విస్తున్నట్లు చెప్పారు. దీపావళి పర్వదినాన స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సాగిన పోరాటం అసెంబ్లీ మెంబర్ జెనిఫర్ రాజ్‌కుమార్.. సంఘం నాయకులకు అండగా నిలిచినందుకు గర్వపడుతున్నానని తెలిపారు. ఈ ప్రకటనతో దీపావళి ముందుగానే వచ్చినట్లయ్యిందని మేయర్ ఎరిక్ అన్నారు. న్యూయార్క్ నగరంలోని స్కూళ్లకు దీపావళి రోజున సెలవు ఇవ్వాల్సిందేనంటూ న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెనిఫెర్ రాజ్‌కుమార్ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. రెండు దశాబ్దాల తన పోరాటం తర్వాత ఈ విషయంలో విజయం సాధించినందుకు ఆనందంగా ఉందని జెనిఫెర్ రాజ్‌కుమార్ తెలిపారు.
ప్రపంచకప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది.. అహ్మదాబాద్‌లోనే భారత్, పాకిస్తాన్ మ్యాచ్!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. కొద్దిసేపటి క్రితం ఐసీసీ మెగా టోర్నీకి సంబందించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా ఆక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌తో ప్రపంచకప్ మొదలుకానుంది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ భారత గడ్డపై జరగనున్న విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీ కొట్టనుంది. ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఆక్టోబర్ 11న ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో మ్యాచ్ ఆడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. మెగా వెంట్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ప్రపంచకప్ 2023 కోసం ఎనిమిది జట్లు ఇప్పటికే అర్హత సాధించగా.. జూలై 9న ముగిసే క్వాలిఫయర్ టోర్నమెంట్ ద్వారా మరో రెండు జట్లు అర్హత సాధిస్తాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ప్రతి జట్టు మిగిలిన తొమ్మిది జట్లతో ఆడుతుంది. గ్రూప్ స్టేజ్ టాప్ 4లో నిలిచిన జట్లు సెమీ-ఫైనల్‌లకు అర్హత సాధిస్తాయి. గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచ్ నవంబర్ 12న కోల్‌కతాలో ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతుంది.
ఆ అభిమాని చేసిన పనికి కన్నీరు పెట్టిన మిల్కీ బ్యూటీ..
సినిమా ఇండస్ట్రీ లో చిన్న స్థాయి హీరో హీరోయిన్ నుండి స్టార్ హీరో హీరోయిన్ ల వరకు అభిమానులు ఉండటం సహజం. కొంతమంది హీరో హీరోయిన్ లకు డై హార్ట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. వారికీ ఏకంగా గుడి కట్టి పూజించే భక్తులు కూడా ఉంటారు. వారు తమ ఫేవరెట్ స్టార్ కోసం ఏమైనా చేస్తారు.సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్స్ కు వున్న క్రేజ్ ఎవరికీ ఉండదు.కొంతమంది స్టార్ హీరోయిన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉంటారు.ఆ విధంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్ లలో తమన్నా కూడా ఒకరు. హ్యాపీడేస్ సినిమా తో తనకంటూ మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. తెలుగులో ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది.. తెలుగులో స్టార్ లతో సినిమాలు చేసి ఎంతో పాపులరిటి సంపాందించుకుంది. ఈ భామ తెలుగుతో పాటు తమిళ్ సినిమాలు కూడా చేసింది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు హిందీ సినిమాలను కూడా చేస్తుంది . తాజాగా ఈ భామ నటించిన జీ కర్దా అనే వెబ్ సిరీస్ ఓటీటీ లో విడుదల అయింది.అలాగే లస్ట్ స్టోరీ సిరీస్ అనే మరో వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతుంది. ఇక రెండు వెబ్ సిరీస్ లలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి మరీ నటించింది తమన్నా. ఇదిలా ఉంటే తమన్నాకు లక్షల మంది అభిమానులు ఉన్నారు.తాజాగా ఓ అభిమాని చేసిన పనికి తమన్నాకన్నీరు పెట్టుకుంది.. తాజాగా ముంబై విమానాశ్రయంలో తమన్నా ను ఓ అభిమాని కలిసింది. తమన్నాను కలిసిన ఆ వ్యక్తి వెంటనే ఆమె కాళ్ళు మొక్కాడు.ఓ ఫ్లవర్ బొకే ను ఇచ్చి తన చేతి పై ఉన్న తమన్నా టాటూ ను కూడా చూపించి. ఆమె అంటే ఎంత అభిమానమో తమన్నాకు తెలియజేసాడు.. దాంతో తమన్నా ఒక్కసారిగా కన్నీరు పెట్టుకుంది.. వెంటనే అతడిని కౌగిలించుకొని మీ అభిమానానికి థాంక్స్ అండ్ లవ్ యు అని చెప్పింది.
శ్యామ్ చెల్లెల బాధ్యత తీసుకున్న ఎన్టీఆర్ ఫాన్స్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కోసం అభిమానులు ఎంతకైనా తెగిస్తారు. ఇక ఎన్టీఆర్ సైతం అభిమానుల కోసం ఏదైనా చేస్తాడు. ఇక తాజాగా ఎన్టీఆర్ అభిమానుల్లో విషాదం చోటుచేసుకుంది. తారక్ వీరాభిమాని చిన్న వయస్సులోనే మృతి చెందాడు. శ్యామ్ చనిపోలేదు అతని మరణం వెనక ఎవరో ఉన్నారు, అందుకే కేస్ ఫైల్ చేసి ఎంక్వయిరీ చెయ్యాలని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ ఫాన్స్ పోలీస్ విచారణ కోరుతున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో శ్యామ్ పేరుని ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఫాన్స్ అసోషియేషన్ ‘RAW NTR హెల్పింగ్ హాండ్స్’ శ్యామ్ ఫ్యామిలీని కలిసి వారికీ అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. “పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము. కాని శ్యామ్ కుటుంబానికి మేము అండగా నిలుస్తాం. ఇప్పటికే శ్యామ్ తల్లిదండ్రులతో మాట్లాడటం జరిగింది. వాళ్ళకి అన్నీ విధాలుగా ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. శ్యామ్ తన కుటుంబానికి వెన్నుముక్కలాంటోడు, తను లేని లోటు ఆ కుటుంబానికి మనమెవ్వరం తీర్చలేనిది. అందుచేత! శ్యామ్ చెల్లెలు పెళ్లి భాద్యత మేము తీసుకున్నాము. అలాగే జరిగిన సంఘటన మీద పోలీసు శాఖను స్పష్టమైన దర్యాప్తు చెయ్యమని కోరుతున్నాము” అంటూ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక అభిమాని చనిపోయినందుకు మిగిలిన ఫాన్స్ సపోర్ట్ ఇస్తున్న విధానంకి అన్ని వర్గాల ప్రజల నుంచి అభినందనలు అందుతున్నాయి. ప్రస్తుతం #WEWANTJUSTICE FOR SHYAMNTR అనే టాగ్ ట్రెండింగ్ లో ఉంది.