వారికి శుభవార్త.. రేపు ఖాతాల్లోకి సొమ్ము..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త చెప్పారు.. ఈ నెల 28న పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించనున్న ఆయన అమ్మ ఒడి పథకం నిధులను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.. ఇక, కురుపాం పర్యటన కోసం 28వ తేదీ ఉదయం 8 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. 10 గంటలకు చినమేరంగి పాలిటెక్నిక్ కాలేజ్ హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కురుపాంలోని బహిరంగ సభ వేదిక వద్దకు రోడ్డు మార్గంలో వెళ్తారు.. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులు విడుదల చేస్తారు.. అనంతరం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయల్దేరి తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.. కాగా, తమ పిల్లలను స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదివిస్తోన్న తల్లుల ఖాతాల్లో జూన్ 28న అమ్మఒడి నగదును జమ చేయనుంది ఏపీ సర్కార్.. కుటుంబంలో చదువుకుంటున్న పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా తల్లి/సంరక్షకుడు ఏటా రూ.15 వేలు చొప్పున అందజేస్తోంది ప్రభుత్వం.. అమ్మఒడి కింద ఇచ్చే రూ.15 వేల నుంచి స్కూల్, మరుగుదొడ్ల నిర్వహణ నిధి కోసం రూ.2వేలు మినహాయిస్తున్నారు. మిగతా రూ.13వేలు మాత్రమే తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. లబ్ధిదారులకు ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్ కార్డు, లబ్ధిదారుడు తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. స్కూల్ ఐడీ కార్డు.. ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబానికి చెందిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులైన విషయం విదితమే..
విఠేశ్వరస్వామిని దర్శించుకోనున్న సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ఉదయం 8 గంటలకు పండరీపురం వెళ్లనున్నారు. అక్కడ రుక్మిణి సమేతంగా విఠేశ్వరస్వామిని పూజిస్తారు. ఆ తర్వాత షోలాపూర్ జిల్లా సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరవుతారు. సీఎం సమక్షంలో జిల్లా నేత భగీరథ బాల్కేతోపాటు పలువురు నేతలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. ఆ తర్వాత ధరాశివ్ జిల్లాలోని శక్తివంతమైన ఆలయమైన తుల్జాభవాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో మహారాష్ట్ర బీఆర్‌ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ సీనియర్ నేతలు ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి రథం 600 కార్ల కాన్వాయ్‌తో సోమవారం ఉదయం ప్రగతి భవన్ నుంచి మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరారు. రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ నుంచి రెండు ప్రత్యేక బస్సులు, భారీ కార్ల కాన్వాయ్ బయలుదేరారు. ధారశివ్ జిల్లా ఒమర్గాలో మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం సాయంత్రం షోలాపూర్ చేరుకున్న ముఖ్యమంత్రికి బీఆర్‌ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. కాగా.. ఉదయం 10:50 గంటలకుకు ప్రగతిభవన్ నుంచి బయలుదేరిన కేసీఆర్ ‘మహా’యాత్ర సాయంత్రం 4:17 గంటలకు సోలాపూర్ చేరుకోవటంతో ముగిసింది. షోలాపూర్ చేరుకున్న కేసీఆర్ స్థానిక నేత, మాజీ ఎంపీ ధర్మాన ముండయ్య సాదుల్ నివాసానికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. స్థానికులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు. షోలాపూర్‌లో తెలుగు వలసదారులు, తెలంగాణ నుంచి ఇక్కడ స్థిరపడిన వారు పెద్ద సంఖ్యలో ఉండగా, వారంతా సీఎం కేసీఆర్‌తో తెలుగులో మాట్లాడారు. షోలాపూర్ కు కేసీఆర్ రావడం సంతోషంగా ఉందని, ఇక్కడ బీఆర్ ఎస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. స్థానిక రాజకీయాలపై ధర్మన్నతో కేసీఆర్ కాసేపు ముచ్చటించారు.
ఏపీలో బంగారపు గనులు.. వెలికితీసేందుకు రూ.500 కోట్ల పెట్టుబడి
తెలుగు రాష్ట్రాల్లో ఖనిజ సంపదకు లోటు లేదు.. ఇక, ఇప్పుడు బంగారపు గనుల తవ్వకాల వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి.. ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్‌ఎండీసీ.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో బంగారం గని కోసం చర్యలను వేగవంతం చేసింది. అందులో భాగంగా తొలి విడతలో 61 మిలియన్ డాలర్లు అంటే రూ.500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధం అయ్యింది.. గోల్డ్ మైనింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఎన్‌ఎండీసీ వర్గాలు చెబుతన్నాయి.. ప్రాంతీయ చట్టాల ప్రకారం ఈ బ్లాక్ కోసం మైనింగ్ లీజుకు తీసుకున్న మూడేళ్ల లోపు గని పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. 1.83 మిలియన్ టన్నుల బంగారం నిల్వలు కలిగిన ఈ బ్లాక్‌లో టన్నుకు 5.15 గ్రాములు మాత్రమే బంగారం రానున్నదని అంచనా వేస్తున్నారు.. కాగా, రాష్ట్రంలోని అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో బంగారం నిక్షేపాలు ఉన్నట్టు గతంలోనే గుర్తించారు.. జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మరికొన్ని సంస్థలు సర్వే నిర్వహించి. ఏ ప్రాంతాల్లో.. ఏ మేరకు బంగారం ఖనిజ నిల్వలు ఉన్నాయనే అంశంపై సమాచారాన్ని సేకరించిన విషయం విదితమే. ఇందులో కీలకమైన బంగారపు గని.. చిత్తూరు జిల్లా ఉంది.. కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండంలం చిగరగుంట-బీసంతంలో బంగారపు గనులను గుర్తించారు. ఈ గనిలో సుమారుగా 18 లక్షల టన్నుల బంగారం ఖనిజం ఉండవచ్చు అనే అంచనాలున్నాయి.. ఇక, తవ్వకాలు చేపట్టేందుకు ఎన్‌ఎండీసీ రెడీ అవుతోంది.. దీని కోసం ఇప్పటికే ఏపీ సర్కార్‌తో ఎల్‌వోఐ (లెటర్ ఆఫ్ ఇంటెంట్)పై సంతకాలు చేసింది.. దీనికి తదుపరి చర్యగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మైనింగ్ లీజు తీసుకోబోతోంది. అన్ని రకాల అనుమతలును రెండేళ్లలో పూర్తి చేసి బంగారం గని తవ్వకాలు ప్రారంభించడమే ఎన్‌ఎండీసీ ఆలోచనగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
తెలుగులోనూ జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష!..
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ) అడ్వాన్స్ డ్ కు హాజరయ్యే తెలుగు విద్యార్థులకు శుభవార్త. జేఈఈ మెయిన్‌ను తెలుగు రాసుకునేలాగానే.. ఇకపై జేఈఈ అడ్వాన్స్ డ్‌ను కూడా తెలుగులో రాసుకోవడానికి అవకాశం కలగనుంది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఐఐటీ కౌన్సిల్ ఐఐటీ ఢిల్లీని ఆదేశించింది. తెలుగుతోపాటు ప్రస్తుతం నీట్, జేఈఈ మెయిన్‌ను నిర్వహిస్తున్నట్టుగా 11 ప్రాంతీయ భాషల్లో జేఈఈ అడ్వాన్స్ డ్ నిర్వహణపై సాధ్యాసాధ్యాలపై 5 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఐఐటీ కౌన్సిల్ ఆదేశించింది. ప్రధానంగా ఐఐటీల్లో డ్రాపౌట్ల నివారణకు తీసుకోవల్సిన చర్యలపై ఐఐటీ కౌన్సిల్ దృష్టి పెట్టింది. డ్రాపౌట్స్ నివారణకు తీసుకోవల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదికను ఇవ్వాలని ఐఐటీ ఖరగ్‌పూర్‌ను కౌన్సిల్ ఆదేశించింది. గత ఏప్రిల్‌లో జరిగిన ఐఐటీ కౌన్సిల్ మీటింగ్‌కు సంబంధించిన తీర్మానాలను కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐఐటీ కౌన్సిల్ సమావేశం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో తీసుకున్న తీర్మానాలను కేంద్ర విద్యా శాఖ వెల్లడించింది. నీట్, జేఈఈ మెయిన్, నీట్ పరీక్షల మాదిరిగానే జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షను తెలుగుతోపాటు 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం వచ్చే 3,4 నెలల్లో మేధోమథన సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులతో సహా చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరింది. JEE అడ్వాన్స్ డ్‌ను ప్రస్తుతం ఇంగ్లీష్ మరియు హిందీ రెండు భాషలలో మాత్రమే నిర్వహించబడుతున్న విషయం తెలిసిందే. అన్ని ఉన్నత విద్యా సంస్థల కోసం ఒకే ప్రవేశ పరీక్షను దృష్టిలో ఉంచుకుని దేశంలో నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షల సంఖ్యను తగ్గించడంపై చర్చించారు. ప్రవేశ పరీక్షల సంఖ్యను తగ్గించడం మాత్రమే కాకుండా విద్యార్థులపై భారం పడుతుందని.. కోచింగ్ అవసరాలు కూడా తగ్గుతాయని కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారు.
వన్డే క్రికెట్‌లో జింబాబ్వే సరికొత్త రికార్డు.. పాకిస్తాన్ కూడా సాధించలేకపోయింది!
ఐసీసీ ఒన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ 2023లో జింబాబ్వే భారీ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. హరారే వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో అమెరికాను ఏకంగా 304 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఎస్‌ఏ కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో ఓటమెరుగని జింబాబ్వే.. తాజాగా అమెరికాకు చుక్కలు చూపించింది. జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల కోల్పోయి 408 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ సీన్ విలియమ్స్(174; 101 బంతుల్లో 21 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ సెంచరీ చేయగా.. ఓపెనర్ జోయ్‌లార్డ్ గుంబీ (78; 103 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీబాదాడు. సికిందర్ రాజా (48; 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ర్యాన్ బర్ల్ (47; 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. జింబాబ్వే బ్యాటర్ల ధాటికి అమెరికా బౌలర్లు పోటాపడి మరీ పరుగులు సమర్పించుకున్నారు. అమెరికా బౌలర్లలో అభిషేక్ పరాద్కర్ మూడు వికెట్లు తీయగా.. జెస్సీ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. 409 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా 104 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే బౌలర్ల దాటికి 25.1 ఓవర్లకే చాపచుట్టేసింది. యూఎస్‌ఏ బ్యాటర్లలో ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ సాధించారు. దీంతో జింబాబ్వే 304 పరుగులతో రికార్డు విజయం అందుకుంది. తద్వారా వన్డేల్లో అత్యధిక తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించిన జట్టుగా భారత్ తర్వాతి స్థానంలో నిలిచింది. వన్డే క్రికెట్‌లో జింబాబ్వే నమోదైన చేసిన అత్యధిక స్కోరు (408) ఇదే. వన్డే క్రికెట్‌లో 400కు పైగా పరుగులు చేసిన 7వ జట్టుగా జింబాబ్వే నిలిచింది. ఈ రికార్డు వన్డే అగ్ర జట్టు పాకిస్థాన్ కూడా అందుకోలేదు. క్రికెట్‌లో మొత్తం 953 మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్.. ఇప్పటివరకు 400 పరుగుల మార్క్ కూడా అందుకోలేదు. గతంలో జింబాబ్వేపై పాకిస్థాన్ చేసిన 399 పరుగులే అత్యధిక స్కోరు. పాక్ చేసిన 399 పరుగుల రికార్డును జింబాబ్వే అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించింది.
కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్..క్షణాల్లో అకౌంట్ వివరాలు తెలుసుకోవచ్చు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్. బ్యాంకుకు వెళ్లకుండానే అకౌంట్ పూర్తి వివరాలు క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఒక నంబర్ మీ ఫోన్‌లో సేవ్ చేసుకుంటే సరిపోతుంది. అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్ వంటి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. మన బ్యాంకు అకౌంట్ తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ నుంచి +917208933148 కి ‘WAREG అకౌంట్ నంబర్’ ఫార్మాట్‌లో SMS పంపాలి. ఉదాహరణకు మీ ఖాతా నంబర్ 123456789 అయితే WAREG 123456789 అని టైప్ చేసిన ఆ నంబర్‌కి మెసేజ్ చేయాల్సి ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్ విజయ వంతంగా పూర్తియిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లోని వాట్సాప్‌కు కన్ఫర్మేషన్ నంబర్ వస్తుంది. ఆ తర్వాత మీ ఫోన్ లో +919022690226 నంబర్ సేవ్ చేసుకోవాలి.. ఆ తర్వాత వాట్సాప్ ను ఓపెన్ చేసి ఆ నంబర్ హాయ్ అని మెసేజ్ చెయ్యండి.. ఆ తర్వాత కొన్ని ఆఫ్షన్స్ వస్తాయి.. మీకు కావలసిన అప్షన్ ను ఎంపిక చేసుకోండి.. డిజిటల్ బ్యాంకింగ్, ముఖ్యమైన పత్రాల డౌన్‌లోడ్, హాలిడే క్యాలెండర్, డెబిట్ కార్డ్ సమాచారం, కార్డ్ పోగొట్టుకుంటే దాని సంబంధిత వివరాలు, సమీప ఏటీఎం, బ్రాంచ్ లొకేటర్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ సర్వీసుల ను వాట్సాప్ ద్వారానే కస్టమర్లు పొందవచ్చని ఎస్‌బీఐ వెల్లడించింది.. అయితే బ్యాంకు అకౌంట్ కు నంబర్ లింక్ చెయ్యకుంటే వెంటనే ఆ పని చెయ్యాలి.. అప్పుడే మీరు ఈ సేవలను పొందుతారు.. మీకు ఇంకేదైనా సందేహాలు ఉంటే దగ్గరలోని బ్రాంచ్ కు వెళ్లి అడిగి తెలుసుకోవచ్చు.. దేశీయ బ్యాంక్ అయిన ఎస్బిఐ ఇప్పటికే కష్టమర్స్ కోసం ఎన్నెన్నో పథకాలను అందుబాటు లోకి తీసుకురావడం తో పాటు అనేక సేవలను కూడా అందించింది.. ప్రస్తుతం కస్టమర్స్ కోసం మరికొని సేవలను అందుబాటులోకి తీసుకొని రావాలనే ప్రయత్నాలు చేస్తుంది..
నోకియా నుంచి సూపర్ 5G స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్స్ లీక్!
ఫిన్‌లాండ్‌కు చెందిన ‘నోకియా’ మొబైల్ కంపెనీకి భారత మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. గతంలో మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసిన నోకియా.. తిరిగి సత్తా చాటేందుకు ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ క్రమంలోనే మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను నోకియా విడుదల చేయనుంది. నోకియా జీ42 5G (Nokia G42 5G) పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో వదలనుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఇటీవల గీక్‌బెంచ్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌లలో లీక్ అయ్యాయి. తాజాగా ధరను కూడా వెల్లడించాయి. లీకైన ప్రెస్ రెండర్‌ల ప్రకారం.. నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ రెండు రంగు ఎంపికలలో (పర్పుల్ మరియు బ్లాక్) వస్తుంది. ఫోన్ మూలల్లో కర్వ్ ఫ్రేమ్ మరియు బ్యాక్ ప్యానెల్ ఉంటుంది. ఇందులో మూడు కెమెరాలు ఉంటాయి. బెజెల్స్, వాటర్ డ్రాప్ నాచ్ ముందు భాగంలో చూడవచ్చు. ఈ ఫోన్ క్విక్ ఫిక్స్‌కు మద్దతు ఇస్తుంది. నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ 1612 x 700 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.56-అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లే ప్యానెల్‌ను కలిగి ఉంది. ఫోన్ పవర్ బటన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్స్. ఇది కాకుండా 2-2 మెగాపిక్సెల్ మాక్రో మరియు డెప్త్ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది 128 గిగాబైట్ల స్టోరేజ్ స్పేస్ మరియు ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. నోకియా G42 5G బ్యాటరీ సామర్థ్యం 5000mAh. నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 480+ 5G ప్రాసెసర్ ఉండనుంది. ఈ ఫోన్ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 20:9 యాస్పెక్ట్ రేషియో కలిగి ఉంటుంది. ఇందులో 4GB లేదా 6GB RAM ఉండవచ్చని లీక్‌ల ద్వారా తెలుస్తోంది. నోకియా G42 5G ధర భారత దేశంలో సుమారు 23 వేల రూపాయలు ఉంటుందని సమాచారం.
పెరుగుతున్న ప్రయాణికులు.. మూతపడుతున్న విమాన సంస్థలు
కరోనా వైరస్ మహమ్మారి ఆంక్షల తర్వాత, మరోసారి భారత విమానయాన రంగం గందరగోళాన్ని చూస్తోంది. ఈ రంగంలో ఉత్సాహం కరువైంది. ఎందుకంటే ఇప్పుడు గోఫస్ట్ ఎయిర్‌లైన్స్ దివాలా తీసిందని ప్రకటించి విమానాలను నిలిపివేసింది. దీంతో దేశంలో విమానయాన సంస్థల సంఖ్య తగ్గిపోయింది. దీంతో ప్రయాణికులు అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. 10.8 బిలియన్ డాలర్లు(రూ. 1,089 కోట్ల)తో ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన మార్కెట్లలో ఒకటిగా ఉన్న భారతదేశం విచిత్రమైన వైరుధ్యాన్ని ఎదుర్కొంటోంది. ఇక్కడ రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది, కానీ విమానయాన సంస్థల సంఖ్య తగ్గుతోంది. విమానంలో ప్రయాణించేవారిలో భయాందోళనలు పెరగడం మరో కారణం. తక్కువ ధర విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు దివాలా అంచులో ఉందన్న భయంకరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అది జరిగితే, పరిమిత సంఖ్యలో విమానయాన సంస్థల కారణంగా టిక్కెట్ ధరలు మరింత పెరుగుతాయి. అప్పుడు గుత్తాధిపత్యం మిగిలిపోతుంది. మోన్‌పోలి కారణంగా టిక్కెట్ల ధరలను పెంచడం తదుపరి దశ. అయితే విమానయాన సంస్థలకు ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సంస్థలకు ఇది కష్టమైన పరిస్థితి. భారీ డిమాండ్, పరిమిత సరఫరా బ్యాలెన్స్‌కు మరింత భంగం కలిగిస్తోంది.
పెళ్ళైన మగవాళ్ళు ఎక్కువగా అక్కడే ఎందుకుంటారో తెలుసా?
పెళ్లికి ముందు కింగ్..పెళ్లి తర్వాత పరిస్థితులు అలానే ఉన్నాయని కొందరు మగవారిని చూస్తే తెలుస్తుంది..పెళ్లికి ముందు నడి ఇంట్లో దర్జాగా ఉన్న పెళ్లి తర్వాత ఎక్కువ సమయం బాత్ రూమ్ లోనే గడుపుతుంటారని చాలా మంది ఆడవాళ్లు అంటుంటారు.. తమ భర్తలు బెడ్ రూమ్‌లో కంటే బాత్ రూమ్‌లోనే ఉంటారని కామెడీగా చెప్పినప్పటికీ అది నిజంగా నిజం. అసలు పెళ్ళైన మగవారు బాత్‌రూమ్‌లో ఎక్కువ సేపు కాలం గడిపేందుకు కారణాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వాళ్ళు అలా బాత్ రూమ్ లో ఉండటానికి ముఖ్య కారణం పనుల నుంచి తప్పించుకోవడానికే అని నిపుణులు అంటున్నారు.. భార్యల నుంచి ఇంటి పనుల నుంచి తప్పించుకోవాలని కావాలని ఎక్కువ సమయం అక్కడే గడుపుతారట.. ముఖ్యంగా గొడవలు జరగవని భావిస్తారని ప్రముఖులు చెబుతున్నారు.. కొంతమందికి జోక్‌గా కూడా అనిపిస్తుంది. చాలా మంది మగవారు ఇంటి పనులు చేయడానికి అంతగా ఇష్టపడరు. అలాంటి వారు భార్య చెప్పే పనులను తప్పించుకునేందుకు బాత్రూమ్‌కి వెళ్తామని చెబుతున్నారు.. కొంతమంది మగవాళ్లకు దుమ్ము దులపడం, గిన్నెలు కడగడం వంటి పనులను చేసేందుకు చాలా మందికి ఇష్టముండదు. అందుకోసమే బాత్రూమ్‌కి వెళ్తారట.అంతేకాదండోయ్.. అక్కడ కూర్చుని నిద్రకూడా పోతారు..