టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే టాప్ ఫీల్డర్లలో ఒకడు. దాదాపు జడేజా క్యాచ్‌ను మిస్ చేయడం అరుదుగా చూస్తుంటాం. కానీ ధర్మశాలలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జడేజా చాలా సింపుల్ క్యాచ్ విడిచిపెట్టాడు. ఆ క్యాచ్ మిస్ చేసినందుకు ఫ్యాన్స్ తో పాటు.. భార్య రివాబా జడేజా కూడా ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం జడేజా భార్య రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: Jabardasth Dhanraj: పవన్ డైరెక్టర్ నే డైరెక్ట్ చేయబోతున్న జబర్దస్త్ కమెడియన్
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ని చూసేందుకు రివాబా ధర్మశాలకు వచ్చారు. న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర కొట్టిన క్యాచ్‌ను జడేజా జారవిడిచాడు. షమీ బౌలింగ్ లో బాల్ ను పాయింట్ వద్ద షాట్ ఆడగా.. బంతి నేరుగా జడేజా వైపు క్యాచ్ గా వెళ్లింది. దీంతో అతను మోకాళ్లపై కూర్చొని క్యాచ్‌కి ప్రయత్నం చేశాడు. కానీ బంతి అతని చేతిలో బయటకు రావడంతో క్యాచ్ మిస్ అయింది. రచిన్ క్యాచ్‌ను మిస్ చేసినప్పుడు అతను స్కోరు 12 పరుగులు ఉంది. అయితే అతని క్యాచ్ ద్వారా బ్యాటింగ్ లైఫ్ రావడంతో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 75 పరుగులు చేశాడు.
Read Also: Chandrababu: ఈ కష్టకాలంలో ప్రజల్లోకి వెళ్లి పోరాడాలని భువనేశ్వరిని నేను కోరాను..
ఈ మ్యాచ్ లో మహ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్ 2023 వన్డే ప్రపంచ కప్‌లో మొదటి మ్యాచ్ ఆడుతున్నారు. ఈ టోర్నీలో షమీ తొలి బంతికే వికెట్ తీశాడు. అతను విల్ యంగ్‌ను బౌల్డ్ చేసి అవుట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా గాయం కారణంగా.. అతని స్థానంలో జట్టులో రెండు మార్పులు కనిపించాయి. గాయపడిన హార్దిక్‌తో పాటు ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ కూడా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. శార్దూల్ స్థానంలో మూడో పేసర్‌గా షమీని జట్టులోకి తీసుకున్నారు.
Reaction of Rivaba Jadeja on Ravindra Jadeja's drop catch. pic.twitter.com/9cLQxaVz8C
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 22, 2023