ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. సెలవులను ఎంజాయ్ చేసేందుకు థాయ్‌లాండ్ వెళ్లిన షేన్ వార్న్ అక్కడి హోటల్ గదిలో విగతజీవుడై పడిఉన్న సంగతి అతడి వ్యక్తిగత సిబ్బంది ద్వారా బయటకు వచ్చింది. అయితే వార్న్ మరణంపై థాయ్‌లాండ్ పోలీసులు షాకింగ్ అంశాలను ప్రస్తావించారు. వార్న్ గదిలో రక్తపు మరకలు గుర్తించినట్లు పోలీసులు చెప్పడం సంచలనం రేపుతోంది. దీంతో వార్న్ మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. గుండెపోటుతో కింద…
శ్రీలంకతో జరిగిన మొహాలీ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు కెప్టెన్‌గా మొదటి మ్యాచ్. తొలి మ్యాచ్‌లోనే భారీ విజయం సాధించిన టీమిండియా టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మకు మధురానుభూతిని మిగిల్చింది. అయితే శ్రీలంకపై ఘనవిజయం సాధించినా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ స్థానంలో మాత్రం ఎటువంటి మార్పూ రాలేదు. డబ్ల్యూటీసీలో భాగంగా టీమిండియా ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడగా వాటిలో…
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారీ విజయం సాధించి టీమిండియా తమ మాజీ సారథి విరాట్ కోహ్లీకి అదిరిపోయే కానుకను అందించింది. తద్వారా కోహ్లీ వందో టెస్టును టీమిండియా చిరస్మరణీయం చేసింది. అయితే భారత్, శ్రీలంక మధ్య జరిగిన తొలి టెస్టు పలు రికార్డులకు వేదికగా మారింది. ఆ రికార్డుల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ★ కోహ్లీకి ఇది 100వ టెస్ట్ మ్యాచ్★ శ్రీలంకకు 300వ టెస్ట్ మ్యాచ్★ జడేజాకు అత్యధిక వ్యక్తిగత స్కోరు 175★…
క్రికెట్ అభిమానులకు బీసీసీఐ అదిరిపోయే వార్త అందించింది. బీసీసీఐ పాలకమండలి ఆదివారం సాయంత్రం ఐపీఎల్ 2022 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. మార్చి 26న ఈ మెగా లీగ్ ప్రారంభం కానుంది. కరోనా పరిస్థితుల కారణంగా భారత్‌లోని రెండే నగరాల్లో లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబైలోని మూడు స్టేడియాలు, పూణెలోని ఓ స్టేడియంలో ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఐపీఎల్-15లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. మొత్తం 65 రోజుల పాటు…
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ టెస్టులో ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (175 నాటౌట్) విజృంభించడంతో 574/8 భారీ స్కోరు చేసింది. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే ఆలౌట్ కావడంతో ఫాలో ఆన్‌లో పడింది. చాన్నాళ్ల తర్వాత శ్రీలంక జట్టును భారత్ ఫాలోఆన్ ఆడించింది. రెండో…
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో మరో మైలురాయి అందుకున్నాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అసలంక వికెట్ తీయడం ద్వారా అశ్విన్ టెస్టుల్లో 435వ వికెట్ అందుకున్నాడు. దీంతో టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. టెస్టుల్లో టీమిండియా తరఫున కపిల్‌దేవ్ 434 వికెట్లు తీసి ఇప్పటివరకు రెండో స్థానంలో ఉండగా.. తాజాగా అశ్విన్ రెండో స్థానాన్ని ఆక్రమించడంతో కపిల్‌దేవ్ మూడోస్థానానికి పడిపోయాడు. అగ్రస్థానంలో…
టీమిండియా చేతిలో పాకిస్థాన్ మరోసారి చావుదెబ్బ తింది. వన్డే ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తుగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 244/7 స్కోరు చేసింది. 245 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 137 పరుగులకు ఆలౌటైంది. దీంతో 107 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా పాయింట్ల పట్టికలో ఖాతా తెరవడంతో పాటు అగ్రస్థానం సంపాదించింది.…
శ్రీలంకతో తొలి టెస్టులో జడేజా డబుల్ సెంచరీ ముంగిట ఉన్న సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంపై పలు విమర్శలు వచ్చాయి. కెరీర్లో జడేజా తొలిసారి డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పుడు రోహిత్ ఇలా చేయడం సరికాదనే కామెంట్లు వినిపించాయి. అయితే ఈ విమర్శలపై రవీంద్ర జడేజా స్పందించాడు. తానే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయమని రోహిత్‌కు చెప్పినట్లు జడేజా స్పష్టం చేశాడు. దీంతో ఈ వివాదానికి ఫుల్స్టాప్ పడింది. భారత్ 574…
మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లు రంజుగా జరుగుతున్నాయి. న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఇప్పటికే పలు మ్యాచ్‌లు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. నిజానికి మహిళల మ్యాచ్‌లకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉంటోంది. అయితే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కాబట్టి ఈ పోరు పట్ల అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. కాగా మహిళల క్రికెట్లోనూ పాకిస్థాన్‌పై భారత జట్టుకు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు…
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. రెండో రోజు ఆటలో శ్రీలంక బౌలర్లను ఉతికారేసిన జడ్డూ.. ఏకంగా 228 బంతుల్లో 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. జడేజా టెస్ట్ కెరీర్లో ఇది రెండో సెంచరీ మాత్రమే. ఈ క్రమంలో జడేజా 35 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఏడో స్థానంలో బరిలోకి దిగిన రవీంద్ర జడేజా 175…