ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో టీమిండియా యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ అదరగొట్టాడు. ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్‌లో వీర విహారం చేసిన అతడు ఏకంగా 27 ర్యాంకులు మెరుగై 18వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ టాప్-10 నుంచి పడిపోయాడు. దీంతో కోహ్లీ 15వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. మరోవైపు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు ర్యాంకులు తగ్గి 13వ ర్యాంకులో ఉన్నాడు. గాయంతో జట్టుకు దూరమైన కేఎల్ ఒక ర్యాంకు తగ్గి…
టీమిండియా విషయానికి వస్తే ఇటీవల జట్టులో సూపర్ ఫామ్‌లో ఉన్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అతడు శ్రేయాస్ అయ్యర్ మాత్రమే. ఇటీవల శ్రీలంకతో ముగిసిన టీ20 సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ విజృంభించాడు. వరుసగా మూడు మ్యాచుల్లోనూ అర్ధశతకాలు చేయడమే కాకుండా.. నాటౌట్‌గా కూడా నిలిచాడు. అయితే టీ20 ఫార్మాట్లో ఆటడం ఎంత కష్టంగా ఉంటుందో అయ్యర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. పొట్టి ఫార్మాట్లో డాట్ బాల్స్ ఆడటం తన దృష్టిలో పెద్ద నేరమని చెప్పాడు. ఎందుకంటే…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుపై కన్నేశాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో టీమిండియా ఆడబోతున్న తొలి టెస్టు విరాట్ కోహ్లీకి 100వ టెస్టు. కెరీర్లో వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ ఈ టెస్టులో మరో 38 పరుగులు చేస్తే టెస్టుల్లో 8వేల పరుగులు పూర్తి చేసిన ఆరో భారత ఆటగాడిగా అవతరిస్తాడు. గతంలో భారత్ తరఫున సచిన్ (15,921), ద్రవిడ్ (13,288), గవాస్కర్ (10,122), సెహ్వాగ్ (8,586), లక్ష్మణ్ (8,781) మాత్రమే…
శ్రీలంకతో మార్చి 4 నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టు టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. దానికి కారణం ఆ మ్యాచ్ ద్వారా కోహ్లీ టెస్టుల్లో 100వ మ్యాచ్ ఆడనున్నాడు. టెస్టుల్లో 100వ మ్యాచ్ ఆడటం ఏంటే ఎంతో ప్రత్యేకం. దిగ్గజ ప్లేయర్లకు సైతం టెస్టుల్లో 100 మ్యాచ్ ఆడటం సాధ్యం అయ్యే పని కాదు. అయితే శ్రీలంకతో జరిగే ఈ టెస్టు ద్వారా కోహ్లీ ఈ ఘనతను అందుకోనున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్…
సాధారణంగా వన్డే మ్యాచ్‌లలో సెంచరీ చేయడమే గొప్ప విషయం. అలాంటిది ఇప్పుడు ఆటగాళ్లు టీ20 మ్యాచ్‌లలోనూ అతి కష్టం మీద సెంచరీ పూర్తి చేస్తున్నారు. అది కూడా పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటేనే ఇది సాధ్యపడే విషయం. కానీ 10 ఓవర్ల మ్యాచ్‌లో ఓ ఆటగాడు సెంచరీ చేయడం అంటే మాములు విషయం కాదండోయ్. తాజాగా వెస్టిండీస్ స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్ టీ10 మ్యాచ్‌లోనూ సెంచరీ బాదేశాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.…
మరో 25 రోజుల్లో ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. అయితే మెగా లీగ్ ఆరంభానికి ముందే కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్‌కు షాక్ తగిలింది. భారీ అంచనాలతో కొనుగోలు చేసిన స్టార్ ఓపెనర్, ఇంగ్లండ్ ఆటగాడు జాసన్ రాయ్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. చాలా కాలంగా కరోనా కారణంగా బయోబబుల్‌లో గడుపుతున్నానని, దీంతో ఒత్తిడి పెరిగిందని.. అందుకే ఈ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు రాయ్ తెలిపాడు. అయితే రాయ్ తప్పుకోవడంతో గుజరాత్ జట్టుకు ఓపెనర్ సమస్య మొదలుకానుంది.…
టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం పేలవ ఫామ్‌లో ఉన్నాడు. గత రెండేళ్లుగా అతడి కెరీర్లో సెంచరీ అనేది లేదు. అయినా అతడు కెప్టెన్ కాబట్టి ఇన్నాళ్లూ జట్టులో కొనసాగుతూ వచ్చాడు. ఇప్పుడు కెప్టెన్సీ కూడా పోయింది. కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత కోహ్లీ బ్యాటింగ్‌లో మార్పు వస్తుందని చాలా మంది ఆశించారు. కానీ అతడి బ్యాటింగ్‌లో మునుపటి వాడి, వేడి లేవనే విషయం మాత్రం అర్థమవుతోంది. అడపాదడపా కష్టపడి హాఫ్ సెంచరీలు కొడుతున్నా అవి సాధికారిక…
ఓ క్రికెట్ మ్యాచ్ ఏకంగా గిన్నిస్ రికార్డుల్లో ఎక్కింది. ఆ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడో జరిగిందో మీకు తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే. 1939లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ 10రోజుల పాటు జరిగింది. ఇది క్రికెట్ చరిత్రలోనే అతి సుదీర్ఘమైన మ్యాచ్. దీంతో ఈ మ్యాచ్ గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించింది. దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా ఈ మ్యాచ్ మార్చి 3 నుంచి 14 వరకు జరిగింది. ఇంగ్లండ్ జట్టు ఐదు…
టీ20 ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డు నమోదు చేశాడు. శ్రీలంకతో ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20లో రోహిత్ 5 పరుగులకే ఔటయ్యాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్‌కే అవుటైన ఆటగాడిగా రోహిత్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ ఫార్మాట్లో రోహిత్ 45 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుటయ్యాడు. ఈ క్రమంలో ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ (44) చెత్త రికార్డును రోహిత్ క్రాస్ చేశాడు. అలాగే…
ధర్మశాల వేదికగా శనివారం రాత్రికి టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20 జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ధర్మశాలలో ఆకాశమంతా మబ్బులు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. సాయంత్రానికి వర్షం ఆగిపోయినా మబ్బులు ఉంటాయన్నారు. పైగా ఆదివారం జరిగే మూడో మ్యాచ్‌పైనా వాతావరణ ప్రభావం ఉండొచ్చని తెలిపారు. కాగా టీ20లలో టీమిండియా…