IND Vs AUS 3rd T20: హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఒకే ఏడాది టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఈ ఏడాది భారత్ 21 టీ20ల్లో గెలిచింది. ఈ మ్యాచ్‌లో 187 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే భారత్ ఛేదించింది. ఓపెనర్లు రాహుల్ (1), రోహిత్ (17) ఇద్దరూ నిరాశపరిచినా విరాట్ కోహ్లీ (63), సూర్యకుమార్ యాదవ్ (69)…
IND Vs AUS 3rd T20: హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ముందు భారీ స్కోరు నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు తొలి 5 ఓవర్లు, చివరి 5 ఓవర్లలో చెలరేగి ఆడింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 186 పరుగులు చేసింది. ఓపెనర్ కామెరూన్ గ్రీన్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అతడు మొత్తం 52…
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో ఓ మార్పు చేసింది. రిషబ్ పంత్ స్థానంలో భువనేశ్వర్‌ను తీసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లు చెరొకటి గెలవగా.. నేటి మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిరీస్‌ను డిసైడ్ చేసే నిర్ణయాత్మక మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో ఓ మార్పు చేసింది. రిషబ్ పంత్ స్థానంలో భువనేశ్వర్‌ను తీసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లు చెరొకటి గెలవగా.. నేటి మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌ను కైవసం…
Mahendra Singh Dhoni: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ నెల 25న సర్ప్రైజ్ ఇవ్వనున్నాడు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సోషల్ మీడియా లైవ్‌లోకి వచ్చి సర్ప్రైజ్ను ధోనీ రివీల్ చేయనున్నాడు. సాధారణంగా ధోనీ సోషల్ మీడియాలో అంతంత మాత్రంగానే యాక్టివ్‌గా ఉంటాడు. చాలా అరుదుగా పోస్టులు చేస్తుంటాడు. అయితే ఫేస్బుక్లో మాత్రం అప్పుడప్పుడు పోస్టులు పెట్టి అభిమానులను ఉత్సాహపరుస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఈనెల 25న లైవ్‌లో ఓ…
Rohit Sharma Record: నాగపూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ మొత్తం నాలుగు సిక్సర్లు కొట్టాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. దీంతో అతడు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల (173) రికార్డును చెరిపేశాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 176 సిక్సర్లు ఉన్నాయి. ఈ జాబితాలో మార్టిన్ గప్తిల్ (173),…
IND Vs AUS: నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా చెలరేగిపోయింది. 91 పరుగుల విజయలక్ష్యాన్ని మరో 4 బంతులు ఉండగానే ఛేదించి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ రాహుల్ (10) నిరాశపరిచాడు. విరాట్ కోహ్లీ 11 పరుగులకు అవుట్ కాగా సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా 9…
IND Vs AUS: నాగపూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. గురువారం కురిసిన వర్షానికి మైదానం చిత్తడిగా మారడంతో పిచ్‌ను డ్రై చేయడంలో ఆలస్యమైంది. దీంతో రెండు జట్ల కెప్టెన్లతో సంప్రదింపుల అనంతరం మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్ రాత్రి 9:30 గంటలకు ప్రారంభం అవుతుందని అంపైర్లు ప్రకటించారు. కేవలం 8 ఓవర్ల మ్యాచ్ కావడంతో ఇరు జట్లలో హిట్టర్లు చెలరేగే అవకాశం…
IND Vs AUS: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నాగపూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యం కానుంది. నాగపూర్‌లో ప్రస్తుతం వర్షం కురవకపోయినా.. గత రాత్రి భారీ వర్షం మైదానాన్ని ముంచెత్తింది. దీంతో అవుట్ ఫీల్డ్‌తో పాటు పిచ్ చిత్తడిగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు టాస్ కూడా వేయలేదు. పిచ్‌పై కవర్లు కప్పి ఉంచారు. అవుట్ ఫీల్డ్‌లో ఒకట్రెండు చోట్ల తేమ శాతం అధికంగా ఉంది.…
Mahendra Singh Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు మైదానంలో ఎంత కూల్‌గా ఉంటాడో అందరికీ తెలుసు. బౌలర్ ఎక్కువ పరుగులు ఇచ్చినా.. ఫీల్డర్ క్యాచ్ డ్రాప్ చేసినా ధోనీ ఎప్పుడూ అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించదు. అందుకే ధోనీని అందరూ కెప్టెన్ కూల్ అని అభివర్ణిస్తారు. అయితే తనకు మైదానంలో ఎందుకు కోపం రాదో.. తన కూల్‌నెస్‌కు కారణాలేంటో తాజాగా ధోనీ వెల్లడించాడు. తాను…