Team India: ఒక స్టార్ క్రికెటర్ పుట్టినరోజు జరుపుకుంటేనే సోషల్ మీడియాలో మాములు హడావిడి ఉండదు. అలాంటిది ఒకేరోజు టీమిండియాకు చెందిన నలుగురు స్టార్ క్రికెటర్లు బర్త్ డే జరుపుకుంటే సోషల్ మీడియాలో జరిగే హంగామా అంతా ఇంతా కాదనే చెప్పాలి. తాజాగా మంగళవారం అంటే డిసెంబర్ 6వ తేదీన ఏకంగా నలుగురు క్రికెటర్లు బర్త్ డే జరుపుకుంటున్నారు. పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, శ్రేయాస్ అయ్యర్, టెస్టు స్పెషలిస్టు కరుణ్ నాయర్ ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్‌లు విషెస్ తెలుపుతున్నారు.
Read Also: Pawan Kalyan: ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ పై ట్రోల్స్ షురూ.. ?
బుమ్రా 29వ బర్త్ డే, జడేజా 34వ బర్త్ డే, శ్రేయాస్ అయ్యర్ 28వ బర్త్ డే, 32వ బర్త్ డే జరుపుకుంటున్నారు. దీంతో బీసీసీఐ కూడా ఆయా ఆటగాళ్లకు ప్రత్యేకంగా విషెస్ తెలియజేసింది. గాయాల కారణంగా బుమ్రా, జడేజా కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నారు. వీళ్లిద్దరూ టీ20 ప్రపంచకప్ ఆడలేదు. అయితే జడేజా మాత్రం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ వన్డే జట్టులో కీలకంగా రాణిస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడే కర్చీఫ్ వేసినట్లు కనిపిస్తోంది. అటు టెస్టు స్పెషలిస్ట్ కరుణ్ నాయర్ భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. రహానె, పుజారా రిటైర్మెంట్ దగ్గర పడిన నేపథ్యంలో కరుణ్ నాయర్‌కు అవకాశం లభిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.