BCCI: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వారికి ఉన్న 33 శాతం రిజర్వేషన్‌లు వినియోగించుకోవాలని చూస్తున్నారు. దీంతో ఇప్పటికే కండక్టర్లు, డ్రైవర్లు, పైలెట్లుగా ఎన్నో రకాల పాత్రలు పోషిస్తున్నారు. ఒకప్పుడు వంటింటి కుందేలుగా పరిమితమైన మగువలకు ప్రస్తుతం ఇలాంటి అవకాశాలు వారిని బయటకు వచ్చేలా చేస్తున్నాయి. దీంతో ఆత్మాభిమానం కోసం ఉద్యోగాలు చేసేందుకు మహిళలు ముందుకు వస్తున్నారు. వారికి ఉన్న రిజర్వేషన్‌లను వారు సద్వినియోగం చేసుకుంటున్నారు. దేశంలోని అన్ని రంగాల్లోనూ వారి ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది.
Read Also: Vladimir Putin: బెంజ్ కార్ నడిపి.. ఆ వార్తలకు చెక్ పెట్టిన పుతిన్
ఒకప్పుడు క్రికెట్ అంటే పురుషులు మాత్రమే ఆడేవాళ్లు. కానీ కొన్నేళ్లుగా క్రికెట్‌లోనూ గణనీయ మార్పులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పురుషుల క్రికెట్‌లో మహిళల భాగస్వామ్యం పెంచేలా బీసీసీఐ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే మహిళా కామెంటేటర్లను బీసీసీఐ నియమించింది. తాజాగా అంపైర్లుగా కూడా అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. త్వరలో ప్రారంభం కానున్న దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో మహిళా అంపైర్లు మైదానంలో కనిపించనున్నారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్‌లోనూ మహిళా అంపైర్లు కనిపించనున్నట్లు బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే భారత్‌లో వృందారతి, గాయత్రి, జనని మహిళా అంపైర్లుగా ఉన్నారు. ఈ క్రమంలో వారి సంఖ్య పెంచేందుకు బీసీసీఐ చర్యలు తీసుకుంటోంది. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఆడవారికి మంచి అవకాశాలు తీసుకొచ్చేలా ఉంది. ఆడవారిని కూడా ఆటలో ఉండేలా చేస్తే మరిన్ని మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయని బీసీసీఐ భావిస్తోంది. దీని కోసమే వారిని భాగస్వాములను చేసేందుకు సమ్మతిస్తోంది.