భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జనవరి 18 నుంచి ప్రారంభం కానుంది. భారత్-న్యూజిలాండ్ మధ్య హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో మొదటి వన్డే జరగనుంది.
Rishab Pant: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు యాక్సిడెంట్ తర్వాత తొలిసారి ట్వీట్ చేశాడు. తనకు జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని, కోలుకునే ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలైందని, మున్ముందు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని రిషబ్ పంత్ అన్నాడు. తనకు అన్ని విధాలుగా అండగా నిలిచిన బీసీసీఐ, జై షా, ప్రభుత్వ యంత్రాంగానికి ధన్యవాదాలు…
Robin Uthappa: ఇటీవల కాలంలో టీమిండియా ఎంపిక విషయంలో సెలక్టర్లపై తరచూ విమర్శలు వస్తున్నాయి. జట్టును సరిగ్గా ఎంపిక చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలలో టీమిండియా చతికిలపడిందనే వాదన ఉంది. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత క్రికెట్ జట్టు ఎంపిక తీరును తప్పుబట్టాడు. గత ఏడాది డిసెంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ప్లేయర్…
Team India: బుధవారం నాడు ఉప్పల్ వేదికగా హైదరాబాద్ నగరంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా సోమవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంది. తిరువనంతపురం నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరింది. ఈరోజు ఉదయమే విరాట్ కోహ్లీ హైదరాబాద్ చేరుకోగా.. మిగిలిన సభ్యులు సాయంత్రం వచ్చారు. టీమిండియా రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు టీమిండియా క్రికెటర్ల కోసం అధికారులు ప్రత్యేక…
U-19 World Cup: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టీ20 మహిళల అండర్ 19 ప్రపంచకప్‌లో టీమిండియా దుమ్ము రేపుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి భారత మహిళల జట్టు 219 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో అండర్ 19 మహిళల ప్రపంచకప్‌లో 200 పరుగులు చేసిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. టీమిండియా బ్యాటర్లలో కెప్టెన్ షఫాలీ వర్మ 34 బంతుల్లో 78, శ్వేత 49…
Babar Azam: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్ట్, వన్డే సిరీస్‌లను కోల్పోయిన తర్వాత బాబర్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బాబర్‌ను మూడు ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా తొలగిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాబర్ ఆజమ్‌కు మరో కొత్త సమస్య ఎదురవుతోంది. అతడు హనీ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. సెక్స్ చాటింగ్ చేస్తూ ఉన్నట్టుగా వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బాబర్‌కు చెందిన అనేక ప్రైవేట్ చిత్రాలు, ఆడియో…
Viacom 18: పురుషుల క్రికెట్ తరహాలో మహిళా క్రికెట్‌కు కూడా ఆదరణ పెంచాలని బీసీసీఐ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మహిళల ఐపీఎల్ ప్రసార హక్కులకు భారీ ధర లభించింది. మహిళల ఐపీఎల్‌కు సంబంధించి వచ్చే ఐదేళ్ల కాలానికి మీడియా రైట్స్‌ను రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. రూ.951 కోట్లతో వయాకామ్ 18 సంస్థ బిడ్డింగ్ వేసింది. అంటే ఒక మ్యాచ్‌కు…
Team India: హైదరాబాదీ ఆటగాడు మహ్మద్ సిరాజ్ కొంతకాలంగా టీమిండియాలో నిలకడగా రాణిస్తున్నాడు. దీంతో క్రమంగా జట్టులో తన స్థానాన్ని సుస్ధిరం చేసుకుంటున్నాడు. టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్న సిరాజ్ ఇప్పుడు వైట్‌బాల్ క్రికెట్లోనూ అదరగొడుతున్నాడు. తాజాగా శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో అతడు అద్భుతంగా రాణించాడు. చివరి మ్యాచ్‌లో 4 వికెట్లతో శ్రీలంక 73 పరుగులకే కుప్పకూలడంలో కీలకపాత్ర పోషించాడు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో సిరాజ్ 9 వికెట్లతో సత్తా చాటాడు. ఈ క్రమంలో సిరాజ్‌పై మాజీ…
Lalit Modi: ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కరోనా అనంతరం తలెత్తిన ఆరోగ్య సమస్యలు, న్యుమోనియాతో లలిత్ మోదీ బాధపడుతున్నాడు. దీంతో ఆక్సిజన్ సపోర్ట్ కోసం ఆయన లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెండు వారాల్లో రెండు సార్లు కరోనా సోకిందని.. న్యూమోనియా కూడా అటాక్ అవ్వడంతోనే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని లలిత్ మోదీ సోషల్ మీడియా ద్వారా స్వయంగా ప్రకటించాడు. మూడు వారాలుగా ఇద్దరు డాక్టర్లు రోజులో 24 గంటలు…
Team India: శ్రీలంకతో వన్డే సిరీస్ పూర్తి కాగానే న్యూజిలాండ్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈనెల 18 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. అనంతరం మూడు టీ20ల సిరీస్ జరగాల్సి ఉంది. అయితే టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీలను బీసీసీఐ మరోసారి దూరంపెట్టింది. ఈ మేరకు న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లతో పాటు ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు సెలక్టర్లు భారతజట్టును ప్రకటించారు. వన్డే సిరీస్‌కు రోహిత్ సారథ్యం వహించనుండగా..…