IND Vs NZ: సొంతగడ్డపై వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లను గెలుస్తున్న టీమిండియా ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈరోజు ఇండోర్ వేదికగా జరగనున్న మూడో వన్డేలో కూడా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కూడా భారత్ క్వీన్ స్వీప్ చేసింది. అయితే ఈ వన్డేలో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించే…
Team India: ముంబై రంజీ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. రంజీ ట్రోఫీలో సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నా అతడికి టీమిండియాలో చోటుదక్కలేదని పలువురు బీసీసీఐపై విమర్శలు చేస్తున్నారు. కానీ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం సెలక్టర్లపై విమర్శలకు దిగుతుండటం పలువురికి నచ్చడం లేదు. అయితే తాజాగా సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషధ్ చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. తెలిసీ తెలియని వయసులో సర్ఫరాజ్ తనతో చెప్పిన మాటల్ని నౌషధ్…
ICC Rankings: టీమిండియాతో మూడు వన్డేల సిరీస్‌ను మరో వన్డే మిగిలి ఉండగానే న్యూజిలాండ్ ఓడిపోయింది. దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన అసలే వన్డే సిరీస్ ఓడిపోయిన బాధలో ఉన్న న్యూజిలాండ్‌కు మరో షాక్ తగిలింది. ఐసీసీ వన్డే ర్యాంకుల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్న న్యూజిలాండ్ రెండో స్థానానికి పడిపోయింది. దీంతో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అయితే మూడో వన్డేలోనూ భారత్ గెలిస్తే న్యూజిలాండ్ మూడో స్థానానికి పడిపోవడంతో…
Wasim Jaffer: న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ గెలిచిన నేపథ్యంలో మూడో వన్డే నుంచి కీలక ఆటగాళ్లను తప్పించాలని బీసీసీఐకి మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక సూచనలు చేశాడు. మూడో వన్డే నుంచి కోహ్లీ తప్పుకుని రంజీ ట్రోఫీ ఆడాలంటూ ఇప్పటికే రవిశాస్త్రి సహా పలువురు మాజీలు సూచించారు. అయితే కోహ్లీ మాత్రమే కాకుండా రోహిత్ శర్మ, సిరాజ్, షమీ కూడా ఇదే పని చేయాలని జాఫర్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో గెలిచినా.. గెలవకపోయినా సమస్య…
Umesh Yadav: టీమిండియా క్రికెటర్ ఉమేష్ యాదవ్‌కు షాక్ తగిలింది. స్నేహితుడి చేతిలో ఉమేష్ యాదవ్ దారుణంగా మోసపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉమేష్ యాదవ్ టీమిండియాకు ఎంపికైన తర్వాత తన వ్యవహారాలను చూసుకునేందుకు తన స్నేహితుడు శైలేష్ ఠాక్రే(37)ను పర్సనల్ మేనేజర్‌గా అపాయింట్ చేసుకున్నాడు. శైలేష్‌తో తనకు ఎంతోకాలంగా స్నేహం ఉండటంతో ఉమేష్ ఇలా చేశాడు. అంతేకాకుండా ఉమేష్ తన స్నేహితుడికి ఆర్ధిక వ్యవహారాల పర్యవేక్షణ కూడా అప్పగించాడు. ఈ మేరకు బ్యాంకు ఖాతాలు, ఆదాయపన్ను లావాదేవీలు,…
Team India: గతంలో సచిన్, గంగూలీ అంటే ఎంతో మంది క్రికెట్ అభిమానులు ఇష్టపడేవారు. వాళ్లు రిటైర్ అయిన తర్వాత వాళ్ల స్థానాలను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆక్రమించారు. వీళ్లిద్దరూ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానించే వాళ్లు ఉన్నారు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన రాయ్‌పూర్ వన్డేలో ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. తన అభిమాన క్రికెటర్ అయిన రోహిత్ శర్మ గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఈ ఊహించని ఘటనతో…
IND Vs NZ: రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో వన్డే మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్లు విజృంభించడంతో 15 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. అయితే తొలి వన్డే హీరో బ్రేస్‌వెల్, గ్లెన్ ఫిలిప్స్,…
Team India: రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. న్యూజిలాండ్‌ను 34.3 ఓవర్లలోనే 108 పరుగులకు ఆలౌట్ చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ ఏం తీసుకోవాలో తెలియక అలానే ఉండిపోయాడు. రోహిత్ అంత సేపు ఆలోచించడం చూసిన కామెంటేటర్ రవిశాస్త్రి ‘ఏం చేస్తున్నావ్ రోహిత్’ అని ప్రశ్నించాడు. అయితే చివరకు ఫీల్డింగ్ చేస్తామని రోహిత్ చెప్పాడు. అయితే టాస్ సమయంలో రోహిత్ తన నిర్ణయం చెప్పడానికి కారణం పిచ్…
Ranji Trophy: రంజీ ట్రోఫీలో ఢిల్లీ జట్టు 42 ఏళ్ల నిరీక్షణకు తెర దించింది. శుక్రవారం నాడు ముంబైతో ముగిసిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. దీంతో 42 ఏళ్ల తర్వాత ముంబైపై ఢిల్లీ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా 88 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో ముంబై.. ఢిల్లీ చేతిలో ఓడిపోవడం ఇది రెండోసారి మాత్రమే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌట్ కాగా.. ఢిల్లీ…