ఐపీఎల్ 2025 సీజన్లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాల్సిందే అంటూ టీంలు పోటీ పడుతున్నాయి. మరోవైపు.. ప్రముఖ టీంలు, ఐదు సార్లు కప్పులు కొట్టిన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెతికలపడ్డాయి. మన హోం జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా పరాజయాలను ఎదుర్కొంది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ విజయాలతో దూసుకువెలుతున్నాయి.
నేడు ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రాజస్థాన్ లక్ష్యం 189 పరుగులు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ పోరెల్(49) అత్యధిక పరుగులు సాధించాడు. కేఎల్ రాహుల్(38), అక్షర్ పటేల్ (34), ట్రిస్టన్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-28లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (RR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు జట్టుకు రజత్ పటిదార్ నాయకత్వం వహిస్తుండగా.. రాజస్థాన్ కెప్టెన్‌గా సంజు శాంసన్ ఉన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-27లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పంజాబ్ కింగ్స్ (PBKS)తో తలపడుతోంది. ఈ రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది. పంజాబ్ హైదరాబాద్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలవాలంటే…
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) గుజరాత్ టైటాన్స్ (GT)ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఏప్రిల్ 12న (శనివారం) లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో ఘన విజయం సాధించింది. మొదట బరిలోకి దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి180 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని లక్నో 4 వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలుండగా ఛేదించింది. మార్క్రమ్ (58), నికోలస్ పూరన్…
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. గుజరాత్ నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. లక్నో జట్టు 6 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో రెండు జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. కాగా.. టాస్ గెలిచిన రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
CSK vs KKR : ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గురువారం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఘన విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు బ్యాటింగ్ విఫలమవడంతో, కోల్‌కతాకు తక్కువ స్కోరు చేధించడంలో ఎలాంటి కష్టాలూ ఎదురుకాలేదు. మ్యాచ్ ప్రారంభంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి…
DC vs CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్లో భాగంగా అభిమానుల ఆసక్తిని రేకెత్తించే మరో కీలక పోరు ఇవాళ జరగనుంది. టోర్నమెంట్లో 17వ మ్యాచ్‌గానే రికార్డ్ అయ్యిన ఈ సమరం, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య మైదానంలో జరగనుంది. చెన్నైలోని ప్రసిద్ధ ఎంఏ చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికగా మారింది. రెండు జట్లూ సీజన్లో మంచి ఫామ్‌లో ఉండటంతో ఈ పోరుకు…
RCB vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్లో భాగంగా నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బెంగళూరు జట్టు బ్యాటింగ్‌లో ఆదిలోనే కీలక వికెట్లు…
HCA-SRH : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) , సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య కొనసాగుతున్న వివాదానికి శుభం కార్డు పడింది. బీసీసీఐ, హెచ్‌సీఏ, ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన ట్రైపార్టీ ఒప్పందం మేరకు ఇరు వర్గాలు పరస్పర అంగీకారంతో ముందుకు సాగేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఒప్పందం ప్రకారం, ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు ఎలాంటి ఆటంకం ఉండకూడదని హెచ్‌సీఏ స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం ప్రధాన అంశాలు: కాంప్లిమెంటరీ పాసులు: పాత ఒప్పందం ప్రకారమే…