ENG vs IND: ఇంగ్లండ్, భారత్ మద్య జరుగుతున్న ఐదో టెస్టులో ,ఓడతి ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ 23 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ది ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ టెస్టులో భారత్ మొదటగా బ్యాటింగ్ చేయగా 224 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీనికి బదులుగా మెరుపు ఆరంభాన్ని అందుకున్న ఇంగ్లండ్ 51.2 ఓవర్లలో 247 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
Anil Ambani: అనిల్ అంబానీకి ఈడీ లుక్ అవుట్ నోటీస్.. రూ.3,000 కోట్ల లోన్ మోసం?
భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) తక్కువ పరుగులకు పెవిలియన్ చేరారు. మూడో స్థానంలో వచ్చిన సాయి సుదర్శన్ (38) నిదానంగా ఆడినా ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి నిలవలేకపోయాడు. ఆ తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (21) రనౌట్ కాగా, మధ్యలో కరుణ్ నాయర్ 57 పరుగులతో అర్ధశతకం నమోదు చేసి భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 26, ధృవ్ జురేల్ 19 పరుగులు చేశారు. దీంతో భారత జట్టు మొత్తం 69.4 ఓవర్లలో 224 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లండ్ తరపున గస్ అట్కిన్సన్ 5 వికెట్లు, జోష్ టంగ్ 3 వికెట్లు, వోక్స్ 1 వికెట్ తీశారు.
ఇక ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (64), బెన్ డకెట్ (43) బజ్‌బాల్ స్టైల్లో వేగంగా పరుగులు సాధించి భారత్‌పై ఒత్తిడి పెంచారు. ఆ తర్వాత కెప్టెన్ ఒలీ పోప్ (22), జో రూట్ (29) మిడిలార్డర్‌లో నిలదొక్కుకోగా.. చివరగా హ్యారీ బ్రుక్ 53 పరుగులతో అద్భుతంగా ఆడాడు. ఇక భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు చెరో 4 వికెట్లు, ఆకాశ్ దీప్ ఒక వికెట్ సాధించారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 247 పరుగులకు ఆలౌట్ అవడంతో భారత్‌పై 23 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్ ప్లేయర్ క్రిస్ వోక్స్ గాయం కారణంగా బ్యాటింగ్‌కు రాలేదు. ఇకపై భారత్ రెండో ఇన్నింగ్స్‌ను ఎలాంటి వ్యూహంతో మొదలుపెడుతుందో వేచి చూడాల్సిందే.
Innings Break!
Impressive bowling display from #TeamIndia! 🙌
4⃣ wickets each for Prasidh Krishna and Mohammed Siraj
1⃣ wicket for Akash DeepScorecard ▶️ https://t.co/Tc2xpWMCJ6#ENGvIND | @prasidh43 | @mdsirajofficial pic.twitter.com/Xk7N26i5Wj
— BCCI (@BCCI) August 1, 2025