2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలువలేదు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో.. స్వదేశంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో విజయం సాధించనందుకు ఆ దేశ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆఫ్ఘన్ జట్టు కోచ్ జోనాథన్ ట్రాట్ ఆస్ట్రేలియాకు ఓ వార్నింగ్ ఇచ్చాడు. 'ఇప్పుడు ఎవరూ ఆఫ్ఘన్ జట్టును తేలికగా తీసుకోరు. గతంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ అద్భుతంగా రాణించింది. ఇప్పుడు మేము మరింత బలంగా ఉన్నాము. తర్వాత జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ మ్యాచ్ సెమీ ఫైనల్స్ మార్గాన్ని నిర్ణయించే మ్యాచ్ కావడం వల్ల' అని ట్రాట్ పేర్కొన్నాడు.
Champions Trophy 2025 : ‘‘ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ గ్రాండ్ ఫైనల్లో భారత క్రికెట్ జట్టు విజయం సాధిస్తుందని 22 మంది పండితులు అంచనా వేశారు. ఈ 22 మంది పండిట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నియమించింది.
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. మాజీ కెప్టెన్ బాబర్ ఆజంపై విమర్శలు గుప్పించాడు. బాబర్ ఆజంను 'మోసగాడు' అని అభివర్ణించాడు. అతను మోసగాడు ఎందుకో గల కారణాన్ని అక్తర్ వివరించాడు. బాబర్ ఆజంను పాకిస్తాన్ కింగ్ అని పిలుస్తారు.. కానీ ఆజం పెద్ద మ్యాచ్లలో జట్టు తరపున సరిగ్గా ఆడలేకపోతున్నాడు. ఈ క్రమంలో అతనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విరాట్ కోహ్లీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారులు ప్రశంసల జల్లు కురిపించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో మాజీ బీసీసీఐ చైర్మన్, మాజీ క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ ప్రశంసించారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతోంది. పాకిస్తాన్లోని కరాచీలో జరుగుతున్న ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. దీంతో.. ఆఫ్ఘాన్ ముందు 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
పాకిస్తాన్కు ఐసీసీ షాక్ ఇచ్చింది. బుధవారం కరాచీలో న్యూజిలాండ్తో జరిగిన టోర్నమెంట్-ఓపెనర్లో స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్తాన్కు ఐసిసి జరిమానా విధించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లో 228 పరుగులు చేసింది. భారత్ ముందు 229 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా శనివారం సాయంత్రం దుబాయ్ చేరుకుంది. ఆదివారం భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించి.. ఐసీసీ అకాడమీలో తమ శిక్షణను కొనసాగించింది. అయితే ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రాక్టీస్ సెషన్లో గాయపడ్డాడు. ఆదివారం ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రిషబ్ పంత్ ఎడమ మోకాలికి గాయమైంది.
పాకిస్తాన్లో ఇటీవల ముగిసిన ముక్కోణపు సిరీస్లో న్యూజిలాండ్ తమ అనుభవం లేని పేసర్లతో ఆకట్టుకుందని.. వీరి ఫామ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కూడా కొనసాగుతుందని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ టిమ్ సౌథీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.