ఐపీఎల్ 2025 రెండవ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. తొలి మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఆరు వికెట్లకు 286 పరుగులు చేసింది. 287 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ 242 పరుగులకే పరిమితమైంది. 5 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసి ఓటమి పాలైంది. ధ్రువ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో మూడో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య చెపాక్‌లో జరుగుతోంది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట ముంబై బ్యాటింగ్ చేయనుంది. కాగా.. హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం విధించడంతో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్ రితురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో సీఎస్కే జట్టు కొత్త ఉత్సాహంతో ప్రవేశిస్తుంది. రెండు…
టీమిండియా బ్యాటింగ్ డైనమైట్ ఇషాన్ కిషన్ మాంచి ఫైర్ మీద ఉన్నాడు. బౌండరీలతో బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ఐపీఎల్ 2024 తర్వాత పూర్తిగా విఫలమైన ఇషాన్ కిషాన్ తనేంటో నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఇషాన్ సుడిగాలి ఇన్నింగ్స్‌లతో ఇతర జట్లకి హెచ్చరికలు పంపాడు. అదే తరహాలో మొదటి మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. ఇషాన్ కిషన్ అద్భుతమైన…
ఈరోజు ఐపీఎల్ 2025 రెండవ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతోంది. రెండు జట్లు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తలపడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ రియాన్ పరాగ్ చేతిలో ఉంది. హైదరాబాద్ పగ్గాలు పాట్ కమ్మిన్స్ చేతిలో ఉన్నాయి. రెచ్చిపోయిన ఆరెంజ్ ఆర్మీ 14 ఓవర్లలోనే 200 స్కోర్ పూర్తి చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన రెండు జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. 18వ సీజన్లో భాగంగా నేడు రెండు టీంలు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు తలపడినప్పుడల్లా.. అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ రోజు కూడా అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే.. గత 12 సంవత్సరాలుగా ముంబై ఇండియన్స్ జట్టు తొలి మ్యాచ్‌లో గెలవకపోవడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా లేకుండా ముంబై ఇండియన్స్ ముందుకెళ్తోంది.…
ఐపీఎల్ 2025 మూడవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ముంబై ఇండియన్స్ జట్టు సూర్యకుమార్ యాదవ్ చేతిలో ఉంటుంది. గత ఐపీఎల్ సీజన్లో మూడోసారి స్లో ఓవర్ రేట్‌ను ఉల్లంఘించినందుకు ముంబై ఇండియన్స్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. ఈ నిషేధం కారణంగా, హార్దిక్ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మొదటి…
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది కోల్‌కతా నైట్ రైడర్స్. అజింక్య రహానె (56), సునీల్ నరైన్ (44), రఘువంశీ (30) పరుగులు చేశారు. కాగా.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రహానేపైనే అందరి దృష్టి మళ్లింది. అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన రహానే.. అన్ని ఫార్మాట్లలో ఆడాడు. కానీ క్రమంగా టెస్ట్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం అయ్యాడు. టెస్ట్ క్రికెట్లో ప్రధానంగా మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్…
ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్ ఈరోజు (మార్చి 22, శనివారం) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరగనుంది. 18వ సీజన్.. కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. అయితే.. వర్షం అభిమానుల ఉత్సాహాన్ని క్షీణింపజేస్తోంది. గత రెండు రోజులుగా కోల్‌కతాలో ఆరెంజ్ అలర్ట్ అమలులో ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన యాంటీ సైక్లోనిక్ ప్రసరణ కారణంగా మార్చి 22 వరకు కోల్‌కతాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ…
ఆర్సీబీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఈసారి అట్టడుగున నిలుస్తుందని జోస్యం చెప్పారు. ఆర్సీబీ అంటే తనకేమీ ద్వేషం లేదని.. కోహ్లీకి కూడా తానెప్పుడూ వ్యతిరేకం కాదన్నారు.