కేరళ రాష్ట్రంలో ఏటా నిర్వహించే అతి పెద్ద పండుగ త్రిసూర్ పూరం. లాక్ డౌన్ కారణంగా రెండేళ్ళ నుంచి ఈ ఉత్సవం జరగలేదు. ఈ ఏడాది కరోనా కేసులు తగ్గడంతో త్రిసూర్ పూరం ఉత్సవం వైభవోపేతంగా జరుగుతోంది. ఈసారి ఉత్సవంలో లక్షలాదిమంది పాల్గొంటారని అధికారులు చెబుతున్నారు. త్రిస్సూర్ పూరం 18వ శతాబ్ధపు కొచ్చి రాజు శక్తి తంపురాన్ ప్రారంభించిన వార్షిక పండుగగా చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈ ఉత్సవం 36 గంటలపాటు సాగుతుంది. ప్రధాన ఉత్సవాలు…
దీపావళి వచ్చిందంటే చాలు.. బాణాసంచా విషయం వెంటనే తెరపైకి వస్తుంది.. బాణాసంచాతో వాయు కాలుష్యం ఏర్పడుతుందంటూ.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించడం.. అది ఓ మతంపై జరుగుతోన్న దాడిగా తప్పుబట్టడం జరుగుతూనే ఉంది.. వివిధ సందర్భాల్లో కాల్చే బాణాసంచాపై లేని నిషేధం.. కేవలం హిందువుల పండుగల సమయంలోనే ఎందుకు అంటూ ప్రశ్నించేవారు లేకపోలేదు. దీంతో.. నిషేధం విధించినా.. అవి ఏ మాత్రం పట్టించుకోకుండా టపాసులు కాల్చేస్తున్నారు.. దీంతో.. వాయు కాలుష్యం ఏర్పడుతోంది.. ఇక, దేశరాజధానిలో పరిస్థితి…
దీపావళి సందర్భంగా క్రాకర్స్ కి ఎంత హడావిడి వుంటుందో స్వీట్స్ కి కూడా అంతే. బంధు మిత్రులకు స్వీట్స్ పంచుతూ, తియ్య తియ్యని స్వీట్స్ తింటూ సందడి చేస్తారు. హైదరాబాద్ లో కరోనా భయం నుంచి కోలుకుంటోంది. దీపావళి సందర్భంగా స్వీట్ షాపుల్లో హడావిడి పెరిగింది. అన్ని వర్గాలకు అందుబాటులో వుండే విధంగా జంబో స్వీట్ ప్యాక్ లు అందుబాటులోకి తెచ్చారు నిర్వాహకులు. బొకేల తరహాలో స్వీట్స్ చేతితో తాకకుండా కరోనా నిబంధనలతో తయారుచేశారు. ఈ స్వీట్లు…
పిండివంటలు, స్వీట్లు ప్రతి పండుగలోనూ కనిపిస్తాయి. కానీ దీపావళి సమ్ థింగ్ స్పెషల్ పండుగ. ప్రజలకు వెలుగుల పండుగ కాగా వ్యాపారులకు కాసులు కురిపించే పండగ. ప్రతి ఇంటి ముందూ విరజిమ్మే టపాసుల వెలుగులు తగ్గనుందా..? అన్న ఆందోళనలో ప్రజలు వున్నారు. టపాసుల అమ్మకం కోసం పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందా? రాదా? అనే ఆందోళనలో వ్యాపారులు ఉన్నారు. మార్కెట్లో టపాసుల కొరత తీవ్రంగా వుంది. లాక్ డౌన్ లో ఉత్పత్తి లేకపోవడం… శివకాశీలో ప్రమాదం కారణంగా…
దీపావళి సందడి దేశవ్యాప్తంగా ప్రారంభం అయింది. అలాగే, దీపావళి బాణసంచా దుకాణాల్లో పేలుళ్ళు ఆందోళన కలిగిస్తున్నాయి. తమిళనాడులో కళ్లకురిచ్చి జిల్లా శంకరాపురంలో బాణాసంచా దుకాణంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు విడుదలై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీపావళి పండుగ వచ్చేస్తోంది.. ఇంటిల్లిపాది కలిసి ఉత్సాహంగా టపాసులు కాల్చుతూ సంతోషంగా గడుపుతారు.. అయితే, రోజురోజుకీ పెరుగోతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు గత కొన్నేళ్లుగా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కోర్టులు, ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి.. దీపావళి రోజు పెద్ద ఎత్తున ధ్వని, వాయుష్య కాలుష్యం నమోదు అవుతుండడంతో.. కాలుష్య నియంత్రణ మండలి చర్యలను పూనుకుంది. ఇక, ఏపీలో దీపావళి పండుగ రోజు రాత్రి 8-10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చాలని కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది……
దీపావళి అంటే బాణాసంచా.. ఇంటిల్లిపాదీ ఉదయం లక్ష్మీ పూజ చేసి రాత్రి బాణాసంచా కాల్చకపోతే పండగ పూర్తికానట్లే.. అయితే ఈసారి దీపావళికి క్రాకర్స్ ఎక్కువగా దొరక్కపోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు దగ్గరపడుతున్న తరుణంలో బాణసంచా విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తిగా క్రాకర్స్ పై నిషేధం విధించలేదని, పర్యావరణానికి హాని కలిగించని క్రాకర్స్ మాత్రం ఉపయోగించవచ్చని తెలిపింది. దీపావళి కాళీ పూజల సందర్భంగా నిర్దేశించిన సమయంలో గ్రీన్ ఫైర్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని, ఎట్టి పరిస్థితిలోను…