కృష్ణా జిల్లాలో దీపావళి పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. మచిలీపట్నంలో దీపావళి మందులు కాలుస్తూ ఒక బాలుడు మరణించడం విషాదం నింపింది. మచిలీపట్నంలో దీపావళి మందులు కాలుస్తూ పదకొండేళ్ళ బాలుడు మృతిచెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read Also: Nayanthara: సరోగసీ వివాదం.. మొదటిసారి పిల్లలతో నయన్ ఇలా
మరణించిన బాలుడిని నవీన్ మిట్టల్ కాలనీకి చెందిన వేమూరి లక్ష్మి నరసింహారావుగా గుర్తించారు. పెద్దల పర్యవేక్షణ లేకుండా మతాబు కలుస్తుండగా ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో బైక్ దగ్ధం అయింది. తీవ్రగాయాల పాలైన బాలుడిని మచిలీపట్టణం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసికెళ్ళమన్నారు. దీంతో ఆ బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.