ఏపీలో విద్యుత్ మోటర్లకు మీటర్ల ఏర్పాటు వివాదాస్పదంగా మారుతోంది. విపక్షాలు ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వం, మంత్రులు మండిపడుతున్నారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మీడియాతో ముచ్చటించారు. వ్యవసాయ కనెక్షన్ల కు మీటర్ల ఏర్పాటుతో విద్యుత్ సరఫరా పై రైతుకు హక్కు కల్పించినట్లు అవుతుంది. విద్యుత్ మీటర్ల ఏర్పాటు రైతులకు ఉరితాడులు అని టిడిపి తప్పుడు ప్రచారం చేసిందన్నారు. ప్రతి ఏటా కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్స్ మరమ్మతులకు 102 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం అన్నారు.
Read Also: Talasani Srinivas Yadav: రాజగోపాల్ రెడ్డి సానుభూతి డ్రామాలు నమ్మొద్దు
గత ప్రభుత్వ హయాంలో ట్రాన్స్ఫార్మర్స్ పాడైపోతే అడిగే దిక్కే లేదు. వచ్చే మార్చి లోపు రాష్ట్రంలో వ్యవసాయ కనెక్షన్ లకు మీటర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేస్తాం అని స్పష్టం చేశారు మంత్రి పెద్దిరెడ్డి. రాష్ట్రంలో 95 శాతం మంది రైతులు వ్యవసాయానికి విద్యుత్ మీటర్ల ఏర్పాటుపై సంతృప్తిగా ఉన్నారన్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకే విద్యుత్ సరఫరా చేశాం…తెలంగాణ నుంచి రావలసిన బకాయిలను ఇప్పించాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదే అన్నారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలపై కోర్టును ఆశ్రయించాం అని అన్నారు మంత్రి. కోర్టు ఏం చెబుతుందో చూద్దాం అన్నారు మంత్రి.
Read Also: Mla Ramanaidu: ఈయన తీరే వేరు.. టిడ్కో ఇళ్ళలో దీపావళి వేడుక