సీపీఐ నేతలతో థాక్రే చర్చలు జరిపారు. ఈ సమావేశంలో థాక్రే ముందు సీపీఐ నేతలు ప్రతిపాదనలు ఉంచారు. సీపీఐ నాలుగు స్థానాలు కావాలని అడిగింది. మునుగోడు, హుస్నాబాద్, బెల్లంపల్లి, కొత్తగూడెం సీట్లను సీపీఐ ఆశించింది. అయితే కాంగ్రెస్ మాత్రం మునుగోడు, హుస్నాబాద్ స్థానాలు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
కూనంనేని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నిర్ణయంతో మాకేం నష్టం లేదు.. నష్టపోయేది కేసీఆరే.. బీజేపీతో కేసీఆర్‌కి సఖ్యత వచ్చింది.. మునుగోడులో బీజేపీ ప్రమాదమని చెప్పిన కేసీఆర్‌కి.. ఇప్పుడు బీజేపీతో మిత్రుత్వం ఎక్కడ కుదిరింది? బీజేపీకి దగ్గరైతే.. కనీస మిత్ర ధర్మం ఉండాలి కదా? దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలి అని అడిగారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిన్న రానున్న ఎన్నికల బీఆర్‌ఎస్ తరుఫున బరిలో ఉండే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అయితే.. ఈ సందర్భంగానే సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని వెల్లడించారు. అయితే.. గతంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నిక సమయంలో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న సీఎం కేసీఆర్.. ఆ పొత్తు వచ్చే ఎన్నికల వరకు కొనసాగిస్తారని భావించారు. breaking news, latest news, telugu news, big news, cpm,…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ (సీపీఐ, సీపీఎం) పార్టీలతో పొత్తు ఉండదని తేలిపోయింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి వెళ్తామని కమ్యూనిస్టు పార్టీలు ప్రకటించాయి. అయితే, పొత్తు విషయంపై బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం ఎలాంటి పొత్తు లేదని తేల్చి చెప్పింది.
రాష్ట్రాన్ని రక్షించండి - దేశాన్ని కాపాడండి పేరుతో.. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 8 వరకు 26 జిల్లాల్లో సీపీఐ ఐస్సుయాత్ర చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.
బీఆర్ఎస్ మాకు మిత్రులు గానే చూస్తున్నామన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కూడా మాకు మిత్రులేనని, కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారనే మాట హరీష్ ఎందుకు అన్నారో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. breaking news, latest news, telugu news, Kunamneni Sambasiva Rao, harish rao, cpi, cpm ,