సీపీఐ కార్యాలయంలో ముఖ్య నేతల అత్యవసర సమావేశం కొనసాగుతుంది. నిన్న ( బుధవారం ) రాత్రి కేసీ వేణుగోపాల్ తో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయంలో ఈ మీటింగ్ లో కామెడ్స్ చర్చిస్తున్నారు. అయితే, రెండు రోజుల్లో సీట్ల పంపిణీ తేల్చాలని కేసీ వేణుగోపాల్ కి నారాయణ సూచన చేసినట్లు తెలుస్తోంది.
Read Also: Rudramkota : శ్మశానంలో పెరిగిన యువకుడి కథగా ‘రుద్రంకోట’.. సెప్టెంబర్ 22న రిలీజ్
కాంగ్రెస్-సీపీఐ పార్టీల మధ్య సీట్ల పంపిణీ విషయంలో రేపటి లోపు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నిన్న కేసీ వేణుగోపాల్ కి నియోజక వర్గాల జాబిను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇచ్చారు. ఖమ్మంలో.. కొత్తగూడం, వైరా.. నల్గొండలో.. మునుగోడు, ఆదిలాబాద్ లో-బెల్లంపల్లి, కరీంనగర్ లో- హుస్నాబాద్, అయితే, ఖమ్మం జిల్లాలోనే రెండు సీట్లు ఇవ్వలేమని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది. కావాలంటే ఒక సీటు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకొచ్చింది. అయితే, భద్రాద్రి కొత్తగూడెం కావాలని సీపీఐ కోరింది. దాంతో హుస్నాబాద్ కోసం సీపీఐ పట్టుపట్టింది.
Read Also: CP Ranganath: ఏబీవీపీ విద్యార్థులు డోర్ పగులగొట్టి వీసీ ఆఫీస్ లోకి చొరబడ్డారు
అయితే, ఇవాళ సీపీఐ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ మీటింగ్ లో వామపక్ష పార్టీ తీసుకునే కండిషన్స్ కు కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనే దానిపై సందిగ్దత కొనసాగుతుంది. కాంగ్రెస్-సీపీఐ పార్టీల మద్య పొత్త కుదిరితే.. సీపీఎం పార్టీ ఎటు వైపు మొగ్గు చూపుతుంది అనేది వేచి చూడాలి..