Off The Record: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆయన మాటలు తూటాల్లా పేలుతుంటాయి. నచ్చితే ఆకాశానికి ఎత్తేయడం, నచ్చకుంటే కడిగేయడం ఆయన నైజం. అలాంటి సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు కె.నారాయణకు ఇప్పుడు సొంత పార్టీ తీసుకున్న ఓ నిర్ణయం నచ్చనట్లుంది. అందుకే టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారట. నారాయణకు తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉంది. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి అయినా… తెలంగాణ ఉద్యమానికి పార్టీని ఒప్పించిన నేత. అయితే ప్రస్తుతం తెలంగాణలో…
Ramakrishna: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నష్టాల వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె. రామకృష్ణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఎంపీలను కలుస్తామని ప్రకటించారు.. విశాఖ ఉక్కు ఉద్యమం 810 రోజులకు పైగా జరుగుతోందన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టిందని విమర్శించారు.. గత ఏడాది 913 కోట్ల రూపాయల లాభాలు వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్…
Narayana: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను డంప్ కేంద్రంగా ప్రధాని నరేంద్ర మోడీ మార్చుతున్నారు.. కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు ఆపడం లేదు? అంటూ నిలదీశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. పారిశ్రామికవేత్త అదానీకి నొప్పి తగలకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఆయన.. విభజన చట్టాలను అమలు చేయించుకోలేని బలహీన స్థితిలో సీఎం జగన్ ఉన్నారంటూ మండిపడ్డారు.. జగన్మోహన్ రెడ్డి రోబో లాంటి వ్యక్తి.. ఆయనకు ఎలాంటి…
సీపీఐ ప్రజా పోరు యాత్రలో భాగంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మంచిర్యాల తాండూరు సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వ్యతిరేక ఐక్యతను సాధించడంలో కేసీఆర్ ఫెయిల్ అవుతున్నాడన్నారు. కేంద్రంతో కేసీఆర్ పోరాటం మంచిదే కానీ ముందుగా ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని సూచించారు.
బీజేపీ హఠావో-దేశ్ కీ బచావో అనే నినాదంతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాచైతన్య యాత్ర నిర్వహిస్తోంది. చేర్యాల, కొమురవెళ్లి మండలాల్లో నిర్వహిస్తున్న ప్రజా చైతన్యయాత్రలో జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
Ramakrishna: తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ.. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్ చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు ఎందుకు ఆచరించలేదు? అని ప్రశ్నించారు.. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామన్న విషయం ఏమైంది? అని నిదీశారు.. విభజన చట్ట హామీల అమలు, వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ…
CPI, CPM కలిసి సమావేశం అవడం ఇది తొలిసారి హిస్టారికల్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర CPI CPM ఉమ్మడి సమావేశం నాంపల్లి గ్రౌండ్స్ లో ప్రారంభించారు.
Off The Record: తెలంగాణ రాజకీయాల్లో కమ్యూనిస్టుల రూటే సపరేటు. సిపిఐ , సిపిఎం మధ్య రాజకీయ వైరం కొనసాగుతూనే ఉంది. 2018 ఎన్నికల్లో ఆ వైరంతోనే చెరో పక్షాన్ని ఎంచుకున్నాయి. సిపిఎం… బిఎల్ఎఫ్ ప్రయోగం చేసింది. సిపిఐ కాంగ్రెస్తో కలిసి ఎన్నికలకు వెళ్ళింది. చివరికి రెండు పక్షాలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇప్పుడు మరోసారి సరికొత్త ప్రయోగానికి తెర లేపాయి రెండు పార్టీలు. విధానపరమైన వైరం కొనసాగుతున్నా..కలిసి ఉద్యమాలు చేశాయి రెండు పక్షాలు. కానీ…