ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 10 వరకు అభ్యర్థులు ప్రతి రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈనెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపట్టనుండగా.. 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువుగా నిర్ణయించారు. ఇక, ఈనెల 30న పోలింగ్ నిర్వహించనుండగా.. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్, ఎన్నికల ఫలితాల ప్రకటన ఉండనుంది.
Kunamneni: ఇప్పుడిప్పుడు మాట మారిస్తే మాత్రం సరైంది కాదు.. కాంగ్రెస్ తో పొత్తు ఇవాళ ,రేపు ఫైనల్ అవుతుందని CPI రాష్ట్ర కార్యదర్శి కూనoనేని సాంబశివరావు అన్నారు.
Manikrao Thakre: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పొత్తు పెట్టుకోనుందని తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే అన్నారు. వామపక్షాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, అవి ఫలిస్తాయన్నారు.
Congress-CPM: సీట్ల సర్ధుబాటుపై గురువారం మధ్యాహ్నం వరకు కాంగ్రెస్ కు సీపీఎం డెడ్ లైన్ విధించింది. కాంగ్రెస్ తో పొత్తులపై ఇంకా స్పష్టత రాకపోవడంతో వామపక్షాలు ఇవాళ కీలక నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది.
కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ పై తారురోడ్డు డ్యామేజీ కావడంతో.. కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ, చాడ వెంకట్ రెడ్డిలు కేబుల్ బ్రిడ్జ్ నాణ్యతని పరిశీలించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాల్ లో సీపీఐ పార్టీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. దేశంలో ఏ ఎన్నికల్లోనైనా వామపక్ష పార్టీలు ప్రజా ఎజెండాను అమలు చేస్తాయన్నారు.
CPl Narayana about Congrss Alliance: తమని కాదని కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కుదిరిందని, సీట్ల సర్దుబాటు ఇంకా కుదరాల్సి ఉందన్నారు. కమ్యూనిస్టులది విశాల హృదయం అని, చట్ట సభల్లో తమ వాయిస్ ఉండాలనేదే ఆలోచన అని నారాయణ తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్టీల మధ్య పొత్తుల గురించి చర్చలు జోరుగా జరుగుతున్నాయి.…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకొని పోయింది అని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు. జనసేన ఎన్డీయే జట్టులో టెక్నికల్ గా మాత్రమే ఉంది.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన పొత్తులతో ఎన్నికలకు వెళ్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు.