ప్రొ.హరగోపాల్‌తో పాటు తదితరులపై పెట్టిన దేశద్రోహం కేసును (ఉపా) వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ నిరంతరం ప్రజా సమస్యలపై స్పందిస్తూ, ప్రభుత్వానికి సరైన సూచనలు చేస్తూ, అభ్యుదయ భావాలతో రాష్ట్ర దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆ పార్టీలు పేర్కొన్నాయి.
Ramakrishna: ఏపీలో ర్యాలీలు, సభలు, సమావేశాలు, రోడ్ షోలు జరపకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఇది చాలా దుర్మార్గం అన్నారు.. వైఎస్ జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని విమర్శించిన ఆయన.. కందుకూరు, గుంటూరు ప్రమాద ఘటనలను సాకుగా చూపి వైఎస్ జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం నిరంకుశమైనది మండిపడ్డారు.. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణాలు మానుకుంటారా..? అని ప్రశ్నించారు. ప్రజా ఉద్యమాలను, ప్రశ్నించే గొంతుకలను, ప్రతిపక్షాలను అణచివేసే…
హత్య చేసిన ఎమ్మెల్సీని, మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీని రక్షించడమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయమా అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ వేయకుండా పోలీసులు అనంతబాబుకి ఎందుకు సహకరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
జక్కన్న మ్యాగ్నమ్ ఓపస్ మూవీ “ఆర్ఆర్ఆర్” మరో కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఇద్దరు స్టార్ హీరోలు మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్, రామ్ చరణ్ స్క్రీన్ స్పేస్ ను పంచుకోవడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించనున్నారు. అయితే తాజాగా చరిత్రను వక్రీకరిస్తున్నారని సీపీఐ నేత రామకృష్ణ నిర్మాతలపై మండిపడ్డారు. అల్లూరి సీతారామ రాజు పాత్రను డిజైన్ చేసిన విధానంలో తప్పులు దొర్లాయని అన్నారు. నిజ జీవితంలో బ్రిటీష్…
పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నా.. నిర్బంధించినా.. ఛలో విజయవాడ విజయవంతం అయ్యిందని చెబుతున్నాయి ఉద్యోగ సంఘాలు.. ఇక, ఛలో విజయవాడపై స్పందించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. కర్నూలులో మాట్లాడుతూ.. ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం సక్సెస్.. ఇది సీఎం జగన్ నియంతృత్వానికి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.. ఉద్యోగులు కొత్తవి ఏమీ కోరడం లేదన్నారు.. పీఆర్సీ అమలు సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారితో చర్చలు జరపడం ఆనవాయితీ.. కానీ, పీఆర్సీ నివేదికను ఉద్యోగులకు సీఎం జగన్ ఎందుకు ఇవ్వడం…
రాష్ట్ర విభజన తర్వాత కమ్యూనిస్టుల పరిస్థితి మారిపోయింది. చంద్రబాబు చెప్పిందే రామకృష్ణ చేస్తున్నారనే విమర్శలపై ఆయన స్పందించారు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో అనేక అంశాలపై రామకృష్ణ తనదైన రీతిలో సమాధానాలిచ్చారు. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల పాత్ర తగ్గుతోంది. పార్లమెంటులో 5 సీట్లే వున్నాయి. ప్రజలకు ఇప్పుడున్న సమస్యలు వేరు. సమస్యల పరిష్కారం కోసం కొత్త పద్ధతులు కావాలి. ప్రజలకోసం పోరాటం చేయాలి. వర్గ పార్టీ కాబట్టి కష్టజీవులు, కార్మికులు, కర్షకుల కోసం మేం పోరాడుతున్నాం. మార్పులు…
గ్రామపంచాయతీల పటిష్టత, నిధుల సమస్య తీర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. సర్పంచ్ లకు నిధులు, విధులు లేకుండా పంచాయతీల అభివృద్ధి ఎలా సాధ్యం..?కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 14, 15 ఆర్థిక సంఘాల నిధులతో పాటు సాధారణ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం సరి కాదన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. సర్పంచ్ లకు అధికారాలు లేకుండా చేయడమే మీరు చెబుతున్న అధికార వికేంద్రీకరణా..? పంచాయతీలకు నిధులు…
ఏపీలోని పరిస్థితులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నా ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. ఏపీ దివాళా తీసింది. లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నా అభివృద్ధి లేదు. ఏ రంగంలో అభివృద్ధి చెందిందో చెప్పమంటే ఒక్క మంత్రీ సమాధానం చెప్పడం లేదు. అప్పులిస్తే తప్పించి జీతాలు, పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదు. మంత్రులందరూ డమ్మీలు. సీఎంకి సజ్జల వాయిస్. అన్ని శాఖలకి…