RRR : మరో కాంట్రవర్సీలో జక్కన్న మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జక్కన్న మ్యాగ్నమ్ ఓపస్ మూవీ “ఆర్ఆర్ఆర్” మరో కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఇద్దరు స్టార్ హీరోలు మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్, రామ్ చరణ్ స్క్రీన్ స్పేస్ ను పంచుకోవడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించనున్నారు. అయితే తాజాగా చరిత్రను వక్రీకరిస్తున్నారని సీపీఐ నేత రామకృష్ణ నిర్మాతలపై మండిపడ్డారు. అల్లూరి సీతారామ రాజు పాత్రను డిజైన్ చేసిన విధానంలో తప్పులు దొర్లాయని అన్నారు. నిజ జీవితంలో బ్రిటీష్ వారితో పోరాడిన అల్లూరిని, వారితో కలిసి పని చేసే పోలీసు అధికారిగా మేకర్స్ ఎలా చూపిస్తారని కమ్యూనిస్టు నాయకుడు ప్రశ్నించారు. మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేసిన నిజమైన దేశభక్తుడు అల్లూరి. కానీ మేకర్స్ మాత్రం ఇంకోటి చూపిస్తున్నారని రామకృష్ణ అన్నారు.
Read Also : Mohan Babu and Vishnu : రంగంలోకి దిగిన నాయీ బ్రాహ్మణులు … కేసు నమోదు
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
రాజమౌళిని గొప్ప దర్శకుడని, కమ్యూనిస్టు నాయకుడు అల్లూరిని తప్పుగా చిత్రీకరించి ఇలాంటి సినిమా నిర్మాత ఎలా తప్పు చేస్తాడని ప్రశ్నించారు. ఈ చిత్రానికి వ్యతిరేకంగా సెన్సార్ బోర్డు కార్యాలయాల ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విప్లవకారుల కుటుంబ సభ్యులకు సినిమాను చూపించాలని, వారు ఓకే చెప్పిన తర్వాతే సినిమాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు వేర్వేరు టైమ్‌లైన్‌లకు చెందిన ఇద్దరు వ్యక్తులపై మేకర్స్ ఎలా సినిమా తీస్తారు ? అనే దానిపై కొన్ని ప్రశ్నలు లేవనెత్తడంతో వివాదాలు మొదలయ్యాయి. అల్లూరి 1924లో మరణించారని, కొమరం భీమ్ 1940లో మరణించారని తెలుపుతూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సినిమాలో చరిత్రను తప్పుగా చూపిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక భీమ్ నిజాం రాజుపై పోరాడినప్పుడు ఎన్టీఆర్ ముస్లిం టోపీ ధరించడాన్ని బీజేపీ తప్పు పట్టింది.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!