రాష్ట్ర విభజన తర్వాత కమ్యూనిస్టుల పరిస్థితి మారిపోయింది. చంద్రబాబు చెప్పిందే రామకృష్ణ చేస్తున్నారనే విమర్శలపై ఆయన స్పందించారు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో అనేక అంశాలపై రామకృష్ణ తనదైన రీతిలో సమాధానాలిచ్చారు. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల పాత్ర తగ్గుతోంది. పార్లమెంటులో 5 సీట్లే వున్నాయి.
ప్రజలకు ఇప్పుడున్న సమస్యలు వేరు. సమస్యల పరిష్కారం కోసం కొత్త పద్ధతులు కావాలి. ప్రజలకోసం పోరాటం చేయాలి. వర్గ పార్టీ కాబట్టి కష్టజీవులు, కార్మికులు, కర్షకుల కోసం మేం పోరాడుతున్నాం. మార్పులు వచ్చాయి. జనంతో సంబంధం లేని వ్యవస్థ వచ్చేసింది. వివిధ రకాల కార్మికులకు మేం భరోసా కల్పించాల్సి వుంది. అనేక కర్మాగారాల్లో మా యూనియన్లు వున్నాయి. భారతదేశంలో ఏఐటీయూసీ వుంది. బలంగా వుంది. సీపీఐఎం వచ్చాక సమ్మెలు చేయడానికి కార్మికులు ముందుకెళుతున్నారు. మేం సమ్మెకు పిలుపు ఇస్తే 25 నుంచి 30 కోట్ల మంది మాతో కలిసి వచ్చేవారు.
మా గురించి జాలి పడాల్సింది లేదు. ఉద్యమం మేం ఎవరికోసం చేస్తున్నామో వారికి తెలుసు. వారి ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చాక వారికి వ్యతిరేకంగా విధానాలు తెస్తున్నారు. చైతన్యం తీసుకురావడంలో మేం ఫెయిలయ్యాం అంటున్నారు రామకృష్ణ. మేం స్వంతంగా పోటీచేసి గెలిచే అవకాశం వుంటే అలాగే వెళతాం. అన్నిపార్టీలు సర్దుబాటు చేసుకుంటున్నాయి. ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా మేం వినియోగించుకోలేదు. పాకులాడి మేం ఎవరినీ ప్రొజెక్ట్ చేయలేదు. అది చారిత్రక తప్పిదం అని మేం అనుకోవడం లేదు.
ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం
ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మేం నిలబడ్డాం. కమ్యూనిస్టులు రాటుతేలి ఒక స్టాండ్ తీసుకుంటారని జనం నమ్ముతారు. కాంగ్రెస్ వచ్చి మాతో కలిశారు. ఒకే పక్క వారు వుంటారని అనుకోవడం లేదు. సందర్భాన్ని బట్టి మేం ఒక నిర్ణయం తీసుకుంటాం. ఒక మతోన్మాద పార్టీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. మోడీని గద్దె దించాలని మేం పోరాటం చేస్తాం. బీజేపీని మేం ఒకరమే ఓడించలేం. కాబట్టి ఇతర పార్టీలు, లౌకిక శక్తులతో మేం చేతులు కలుపుతాం. 2014లో మాతో కలిసి వచ్చే పార్టీలతో మేం కలిసి పోటీ చేశాం. 2019లో జనసేనతో కలిశాం.
వ్యవస్థను మార్చడానికి మాకు కాస్త సమయం పడుతుంది. కొత్త పార్టీల వైపు మేం చూడలేదు. కొత్త పార్టీల వైపు మేం వెళ్ళడం లేదు. మాది పిడివాదం కాదు. వాళ్ళ సమస్య తీరేవరకూ వుంటున్నారు. తర్వాత వెళ్ళిపోతున్నారు. కమ్యూనిస్టుల పునరేకీకరణ కావాలి. రెండు పార్టీలతో పాటు మిగతా లెఫ్ట్ పార్టీలు కలవాలి. సీపీఎంలోనూ మార్పులు వచ్చాయి. వారు కూడా మారాలని అంటున్నారు రామకృష్ణ. మేం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశాం. మళ్ళీ సరిదిద్దుకుంటున్నాం. ఇప్పడిప్పుడే విద్యార్ధులు మావైపు వస్తున్నారు.
151 సీట్లు ఇస్తే ఏదైనా చేయవచ్చా?
కేంద్రాన్ని కదిలించలేకపోయారు. రైతు ఉద్యమాలకు భయపడే మోడీ రైతుచట్టాలను రద్దుచేశారు. మా ఉద్యమమే లేకపోతే మోడీ మారేవారు కాదంటున్నారు. ఏపీలో జగన్ పాలన దారుణంగా వుంది. అప్పులు చేయడం ద్వారా ఏ ఒక్కరంగంలో అభివృద్ధి జరగలేదు. కరోనా సమయంలో పేదల్ని ఆదుకోవడాన్ని మేం అభినందిస్తున్నాం. లక్షల కోట్లు అప్పులు తేవడం అభివృద్ధా? పన్నులు పెరిగాయి. ఓటీఎస్ స్కీం, కరెంట్ ఛార్జీలు, విద్యుత్ సంస్కరణలు అమలుచేశారు. జగన్ ప్రమాణ స్వీకారం సమయంలో కరెంట్ ఛార్జీలు పెంచమన్నారు. అదానీకి అప్పగిస్తున్నారు. 9వేల మెగావాట్ల విద్యుత్ ఏపీకి రప్పిస్తున్నారు. పారదర్శకంగా చేయాలి. రూల్స్ పాటించడం లేదు. ఖచ్చితంగా కోర్టులో దొరికిపోతారు. 151 సీట్లు ఇస్తే ఏదైనా చేయవచ్చా? అన్ని సీట్లు గెలిచినా ప్రతిపక్షాలు వుండాలి. టీడీపీ చెబితేనే నేను చేస్తానని విమర్శలు రావడం సహజం. టీడీపీకి చెప్పేది తప్పే. పాలసీలను బట్టి మేం ముందుకు వెళుతున్నాం. చంద్రబాబుకి అనుకూలంగా వుంటారని అపవాదుపై ఆయన సరైన సమాధానం ఇవ్వలేకపోయారు.