తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దారుణమైన పరిస్థితులలో ఉంది. ప్రతి రోజు రోజు వేల సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి.ఈ రోజు తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,707 కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తాజా గా విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటలలో 2,707 కేసులు వెలుగు చూశాయి. కాగ నిన్న రాష్ట్రంలో 2,319 కేసులు…
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే వుంది. 2లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు కొనసాగుతున్నాయి. గత కొద్దిరోజులుగా వీఐపీలకు కరోనా సోకుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో 50 మంది కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ, పార్లమెంటరీ బోర్డులు గురువారం సమావేశం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కమిటీ సమావేశాలకు హాజరుకావాల్సి ఉంది. కరోనా పరీక్షల్లో 50…
ఢిల్లీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా కట్టడికి ఢిల్లీ సర్కార్ నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలను అమలు చేస్తున్నది. ఈ కర్ఫ్యూల వలన కొంత వరకు ఉపయోగం ఉన్నట్టు కనిపిస్తున్నది. వీకెండ్ కర్ఫ్యూ తరువాత కొంతమేర కరోనా ఉధృతి తగ్గింది. అయితే, ఈ జనవరిలోనే కరోనా పీక్స్ దశకు చేరుకునే అవకాశం ఉందని, కరోనా కేసులు రెండు రోజులు వరసగా తగ్గితే ఆంక్షలను ఎత్తి వేస్తామని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ స్పష్టం చేశారు. కేసులు…
ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోని పార్లమెంట్ భవన్‌లో కరోనా కలకలం రేగింది. గత రెండు రోజులుగా పార్లమెంట్ లో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా టెస్టులు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం రెండు రోజుల్లో 350 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో పార్లమెంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులందరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 350 మంది సిబ్బందికి…
కర్ణాటకలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. గత నాలుగురోజులుగా బెంగళూరులో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కర్ణాటకలో 8,906 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 7,113 కేసులు ఒక్క బెంగళూరులోనే నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరులో పాజిటివిటీ రేటు 10శాతంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. Read: కుమారుడికి కరోనా పాజిటివ్…
మూడో వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొందాం అని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల వైద్యాధికారులు, ఆశా వర్కర్లతో మంత్రి హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్, ఒమిక్రాన్ వేరియంట్‌ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ వైద్యసేవలను దేశానికి ఆదర్శంగా నిలుపుదామని హరీష్‌రావు పిలుపునిచ్చారు. రెండో డోసు వంద శాతం పూర్తయ్యేలా పని చేయాలని అధికారులకు సూచించారు. 15-18 ఏండ్ల వారి…
కరోనాకు వారు వీరు అనే తేడాలేదు. ఎవర్నీ వదలడం లేదు. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, తాజాగా మరో సీఎం కరోనా బారిన పడ్డారు. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కరోనా బారిన పడినట్టు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. లక్షణాలు పెద్దగా లేవని, వైద్యుల సలహా మేరకు వారం రోజులపాటు హోమ్ ఐసోలేషన్‌లో…
కరోనాకు పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో ఇప్పుడు క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. వూహాన్ నగరంలో పుట్టిన కరోనా, ప్రపంచం మొత్తం వ్యాపించింది. గత మూడేళ్లుగా కరోనాతో ప్రజలు సహజీవనం చేయాల్సి వస్తున్నది. వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినా లాభం లేకుండా పోతున్నది. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల వ్యాప్తితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదిలా ఉంటే, చైనాలో రెండు మూడు కేసులు నమోదైన నగరాల్లో కఠినమైన లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ప్రజలెవరినీ బయటకు రానివ్వడంలేదు. గత రెండు వారాలుగా జియాంగ్ సిటీ…
కరోనా మహామ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నది. సామాన్యులతో పాటు వైద్యులు, వైద్యసిబ్బందికి, నర్సులకు కరోనా సోకుతున్నది. ఇక యూకే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూకేలో ప్రతిరోజు భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. భారీగా కేసులు నమోదవుతున్నా లక్షణాలు తక్కువ స్థాయిలో ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం. అయితే, యూకేలోని లింకన్‌షైర్‌కు చెందిన మోనికా అనే మహిళా నర్సుకు నవంబర్ 9 వ తేదీన కరోనా సోకింది. కరోనా బారిన పడ్డ అ నర్స్‌ను ఆసుపత్రిలో…