ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలులోకి రానున్నది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు జరుగుతుంది. జనవరి 18 నుంచి 31 వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమలు జరుగుతుంది. నైట్ కర్ఫ్యూతో పాటు కొన్ని కొత్త నిబంధనలను కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ రూల్స్ ను బ్రేక్ చేసిన వారికి రూ. 1000 జరిమానా విధించాలని నిర్ణయించింది. శుభకార్యాలు, మతపరమైన కార్యక్రమాల కోసం బహిరంగ ప్రదేశాల్లో అయితే గరిష్టంగా 200 మంది, ఇండోర్‌లో అయితే 100 మందికి అనుమతులు ఇచ్చింది. ఈ కార్యక్రమాలకు హాజరయ్యేవారు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించింది. సినిమా హాళ్లలో 50 శాతం సీటింగ్‌కు అవకాశం కల్పించింది. అదేవిధంగా ప్రజా రవాణాలో ప్రయాణం చేసేవారు తప్పని సరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది.
Read: షాకింగ్.. విడిపోతున్నట్లు ప్రకటించిన హీరో ధనుష్-ఐశ్వర్య దంపతులు
వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో సిబ్బందితో పాటు అక్కడి వచ్చే కస్టమర్లను కూడా మాస్క్ పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని లేదంటే రూ. 10 వేల నుంచి 25 వేల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఆదేశించింది. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో తప్పని సరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఫార్మా, మెడికల్, ఐటి, ఇంటర్నెట్, పెట్రోల్, నీటి సరఫరా, విద్యుత్ వంటి విభాగాలకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది. సిబ్బంది తప్పని సరిగా ఐడి కార్డ్ దగ్గర ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.