ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ సివియర్ కాదని నిపుణులు చెబుతున్నారు. దీంతో అనేక దేశాలు ఒమిక్రాన్ ను లైట్‌గా తీసుకుంటున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ కీలక హెచ్చరిక చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు తక్కువగా ఉంటాయని, తీవ్రత తక్కువగా ఉందని తక్కువ చేసి చూడడం పొరపాటే అవుతుందని, ఒమిక్రాన్ వేరియంట్ ఎలా విరుచుకు పడుతుంతో ఇప్పుడే అంచనా వేయలేమని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలియజేసింది. సార్స్ కోవ్ 2 వైరస్‌ను తక్కువగా అంచనా వేశారని, ఆ తరువాత దాని ప్రభావం ఎలా ఉన్నదో చెప్పాల్సిన అవసరం లేదని డబ్ల్యూహెచ్ఓ తెలియజేసింది.
Read: దూకుడు పెంచిన ఆప్: నిన్న పంజాబ్ నేడు గోవా…
కరోనా మహమ్మారిలో ఒమిక్రాన్ వేరియంట్ చివరిది కాదని, ఇంకా చాలా వేరియంట్ లు ప్రపంచానికి సవాల్‌గా మారే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ తెలియజేసింది. సుమారు 180 దేశాల నుంచి 7 మిలియన్ల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన తరువాత ఈ హెచ్చరికలు చేస్తున్నట్టు డబ్ల్యూహెచ్ఓ తెలియజేసింది. కరోనా మహమ్మారి విషయంలో గతంలో చేసిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ పేర్కొన్నది.