భారత్ నుంచి ఎక్కువ మంది పర్యటనల కోసం మాల్దీవులకు వెళ్తుంటారు. అలా మాల్థీవులకు వెళ్లే భారత పర్యాటకులపై ఆ దేశం తాత్కాలికంగా నిషేదం విధించింది. భారత్‌లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాల్లో పర్యటించిన పర్యాటకులపై కూడా మాల్ధీవులు నిషేదం విధించింది. అన్ని రకాల వీసాలపై ఈ నిషేదం వర్తిస్తుందని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు ట్వీట్ చేశారు. మే 13 నుంచి ఈ నిషేదం…
భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తికి కారణమైన బి.1.617 వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ప్రపంచంలో 44 దేశాల్లో ఆ వేరియంట్ వ్యాప్తి చెందినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కోన్నది. మొదటి వేవ్ తరువాత ఉదాసీనతను ప్రదర్శించడం వలనే భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కరోనా మ్యూటేషన్‌లు ఏర్పడటానికి ఉదాసీనతే కారణమని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది. ఇండియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ బి.1.617 వేరియంట్ అటు బ్రిటన్‌లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇండియా తరువాత అత్యదిక ఇండియా…
ప్రధాని మోడీకి ఏపీ సిఎం జగన్ మరో లేఖ రాశారు. ఆక్సిజన్ కేటాయింపులు, సరఫరాపై ప్రధానికి సిఎం జగన్ లేఖ రాశారు. కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని సిఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. 20 ఆక్సిజన్ ట్యాంకర్లను ఏపీకి మంజూరు చేయాలని సిఎం జగన్ లేఖలో కోరారు. కోవాగ్జిన్ తయారీ దేశీయ అవసరాలను పూర్తిగా తీర్చలేకపోయిందని, ఈ వ్యాక్సిన్ ను భారీగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడిందని సిఎం జగన్ తెలిపారు.…
తెలంగాణలో లాక్ డౌన్ విధించడంపై బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మేము పూర్తి మద్దతిస్తామని ముందే చెప్పామని… లాక్ డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే అప్పగించిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాలు పూర్తి స్థాయి/పాక్షిక లాక్ డౌన్ ప్రకటించాయన్నారు. మొత్తానికి ఆలస్యంగానైనా రాష్ట్ర ప్రభుత్వం లాక్…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి పదిరోజులపాటు రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేయబోతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యవసర వస్తువులు, మెడిసిన్ ఇతర వస్తువులు కొనుగోలు చేయడానికి అనుమతులు ఇచ్చారు. ఉదయం 10 గంటల తరువాత ఎవరూ బయటకు రాకూడదు. లాక్‌డౌన్ మినహాయింపులు ఉన్న అత్యవసర సర్వీసులు, లాక్ డౌన్ పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతులు ఉంటాయి. ఇక, వేటికి పూర్తి స్థాయిలో మినహాయింపులు…
కరోనా కేసులపై ఇంగ్లాండ్ కు చెందిన ప్రజారోగ్య విభాగం ఓ అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనం ప్రకారం మొదటి డోస్ తీసుకున్న వారిలో కరోనాను నిలువరించే శక్తి 80శాతం పెరిగిందని, ఫలితంగా మొదటి డోస్ తీసుకున్నాక 80శాతం మేర కేసులు తగ్గాయని ఇంగ్లాండ్ ప్రజారోగ్య సంస్థ పేర్కొన్నది. ఫైజర్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న అనంతరం 80శాతం రక్షణ కల్పిస్తున్నట్టు ప్రజారోగ్య సంస్థ పేర్కొన్నది. రెండో డోసులు తీసుకున్నాక 97 శాతం రక్షణ కల్పిస్తున్నట్టు ఇంగ్లాండ్ ప్రజారోగ్య సంస్థ పేర్కొన్నది. ఇంగ్లాండ్ లో వ్యాక్సిన్ తీసుకున్నాక 80 ఏళ్లకు పైబడిన వృద్దులు ఆసుపత్రుల్లో…
తెలంగాణలో కరోనా కేసులు విలయం కొనసాగుతున్న నేపథ్యంలో కెసిఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ విధిస్తున్నట్లు కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ ఉండనుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు లాక్ డౌన్ నిర్ణయం…
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతున్నది. తెలంగాణ కేబినెట్ లో కీలక విషయాల గురించి చర్చించబోతున్నారు. నైట్ కర్ఫ్యూ సమయంలో జరిగిన పరిణామాలు, కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ విధిస్తే వచ్చే నష్టాలు, ఇబ్బందులు తదితర విషయాల గురించి ఈ కేబినెట్ మీటింగ్ లో చర్చించబోతున్నారు. ఈనెల 13 వ తేదీన రంజాన్ కావడంతో రంజాన్ తరువాత నుంచి లాక్ డౌన్ విధిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నది అనే…
కరోనా పరీక్షలు తగ్గడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని హెచ్చరించింది. నైట్ కర్ఫ్యూ నిబంధనలు ఎక్కడ అమలు కావడం లేదని.. రాత్రి 1 గంటలకు ఫుడ్ దొరుకుతుందని హైకోర్టు సీరియస్ అయింది. నిబంధనల ఉల్లంఘనపై మాకు లేఖలు, ఇమెయిల్స్ వస్తున్నాయని హైకోర్టు పేర్కొంది. సరిహద్దుల్లో అంబులెన్స్ లను అడ్డుకోవడం దారుణమని…మీకు ఎవరు చెప్పారు.. అంబులెన్స్ లను అడ్డుకోవాలని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబులెన్స్ లను అడ్డుకోవడంపై వివరాలు కోరిన హైకోర్టు..పాతబస్తీలో…
దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు ఉదృతం అవుతున్న సంగతి తెలిసిందే. భారత్ ను ఆదుకోవడానికి పలు దేశాలు ముందుకు వచ్చాయి. అంతర్జాతీయ సంస్థలు. బహుళ జాతీయ కంపెనీలు ముందుకు తమవంతు సహాయం ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ 110 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని భారత్ లోని కేర్, ఎయిడ్ ఇండియా, సేవ ఇంటర్నేషనల్ సంస్థలకు పంపిణి చేసింది. ఈ మూడు సంస్థలు ఈ నిధులను భారత్ లో కరోనా మహమ్మారి కోసం…