తెలంగాణలో లాక్ డౌన్ : బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో లాక్ డౌన్ విధించడంపై బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మేము పూర్తి మద్దతిస్తామని ముందే చెప్పామని… లాక్ డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే అప్పగించిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాలు పూర్తి స్థాయి/పాక్షిక లాక్ డౌన్ ప్రకటించాయన్నారు. మొత్తానికి ఆలస్యంగానైనా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిందని… లాక్ డౌన్ సమయంలో వైద్య సేవలు, పేషేంట్ల ప్రయాణాలకు ఆటంకం కలగకుండా, టెస్టులు, ట్రీట్ మెంట్ ఆగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచిస్తున్నానని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ మాత్రమే కరోనాను కట్టడి చేయగలదని నిరూపణ అయిందని… ఈ లాక్ డౌన్ సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని తెలిపారు. రాష్ట్రానికి అవసరమున్నంత ఆక్సిజన్, రెమ్ డెసీవర్ ఇంజెక్షన్లను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పంపించిందని… ఆక్సిజన్, రెమ్ డిసీవర్ ఇంజెక్షన్ల పంపిణీ కోసం ప్రత్యేక నోడల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రయివేటు, ప్రభుత్వ ఆసుపత్రులకు ఎక్కడా ఆక్సిజన్ కొరత రాకుండా చూడాలని… కరోన చికిత్సకు అవసరమైన అన్నీ రకాల మందులను అందుబాటులో ఉంచాలన్నారు.
Also Read
- Tags
- bandi sanjay
- Covid19
- LOCK DOWN
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!