ప్రధాని మోడీకి ఏపీ సిఎం జగన్ మరో లేఖ రాశారు. ఆక్సిజన్ కేటాయింపులు, సరఫరాపై ప్రధానికి సిఎం జగన్ లేఖ రాశారు. కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని సిఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. 20 ఆక్సిజన్ ట్యాంకర్లను ఏపీకి మంజూరు చేయాలని సిఎం జగన్ లేఖలో కోరారు. కోవాగ్జిన్ తయారీ దేశీయ అవసరాలను పూర్తిగా తీర్చలేకపోయిందని, ఈ వ్యాక్సిన్ ను భారీగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడిందని సిఎం జగన్ తెలిపారు. కోవాగ్జిన్ తయారీకి భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, ఎన్ఐవీలు కలిసి చేశాయని అన్నారు. తయారీ దారులు ముందుకు వస్తే కోవాగ్జిన్ కోవాగ్జిన్ చేసేందుకు, వారికి టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ చేసేలా చర్యలు తీసుకోవాలని లేఖలో సిఎం జగన్ పేర్కొన్నారు. ఎవరైనా వ్యాక్సిన్ ఉత్పత్తికి ముందుకు వస్తే, ప్రజల ఆరోగ్యం నేపథ్యంలో వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు.