కరోనా మహమ్మారి విజృభిస్తున్నప్పటి నుండి ఇప్పటివరకు తెలంగాణాలో 100 మంది జర్నలిస్టులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. దేశం మొత్తంలో దాదాపు పదిహేను రాష్ట్రాలలో జర్నలిస్టులను “ఫ్రంట్ లైన్ వారియర్స్ ” గా గుర్తించారని… వారికి ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి, ఉచిత వైద్యం రాష్ట్ర ప్రభుత్వాలు చేయిస్తున్నాయని వెల్లడించారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఇతర రాష్ట్రాలు ఆర్ధిక సహాయం కూడా చేస్తున్నాయని… కాబట్టి కరోనాతో మృతి చెందిన…
కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వైరస్ గాలిలో ఎంత దూరం వరకు వ్యాపించి ఉంటుంది. ఎంత తీవ్రత ఉంటుంది అనే అంశాలపై అనేక మంది అనేక సమాధానాలు ఇచ్చారు. అయితే, అమెరికాకు చెందిన అంటువ్యాధుల నియంత్రణ సంస్థ మరోసారి దీనికి సమాధానం తెలిపింది. కరోనా రోగి నుంచి వైరస్ మూడు నుంచి ఆరు అడుగుల దూరం వరకు వ్యాపించి ఉంటుందని, గాలి వెలుతురు సరిగా లేని గదిలో ఆరు అడుగుల కంటే ఎక్కువ దూరం వరకు…
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కర్ఫ్యూ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఒడిశా నుంచి ఎవరూ రాకుండా బోర్డర్ క్లోజ్ చేసేశారు ఏపీ పోలీసులు, అధికారులు. ఇచ్ఛాపురం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మెడికల్ ఎమర్జెన్సీకి మాత్రమే మినహాయింపులు ఇస్తున్నారు అధికారులు. ఇది ఇలా ఉండగా.. ఆంధ్రా – ఒడిశా సరిహద్దుల్లో ఒడిశా అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఒడిశాలో లాక్ డౌన్ అమల్లో ఉంది. ఆంధ్రా ప్రాంతం నుంచి…
సిఎం కెసిఆర్ పై బిజేపి నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. తెలంగాణలో కరోనా పరిస్థితి దారుణంగా ఉందని.. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. “తెలంగాణలో కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అయోమయంలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. కేవలం నైట్ కర్ఫ్యూ వల్ల ఫలితం లేదని తేలిపోయింది. పగటి పూట నియంత్రణలేమీ లేవు. మరోవైపు కొన్ని పెద్ద రాష్ట్రాలు పరిస్థితిని అదుపు చేసేందుకు స్వల్పకాల లాక్‌డౌన్ విధించాయి. మరి తెలంగాణ విషయానికి వచ్చే సరికి…
“కోవిడ్-19” విపత్తు నేపథ్యంలో ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు. “రెండవ విడత” కరోనా విపత్తులో దేశం విలవిల్లాడుతోందని..ఎలాగైనా సరే ప్రజల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో ప్రతి ఆరుగురి “కోవిడ్” బాధితుల్లో, ఒకరు భారతీయుడు ఉన్నాడని లేఖలో పేర్కొన్నారు. దేశ జనాభా, జనసాంద్రత నేపథ్యంలో వైరస్ శరవేగంగా అనేక రూపాంతరాలతో విజృంభిస్తోందని.. నియంత్రణ లేకుండా వైరస్‌ను వదిలేయడం వల్ల దేశానికే కాదు, ప్రపంచానికి కూడా ముప్పు అని పేర్కొన్నారు. వైరస్ రూపాంతరాలపై “జీనోమ్…
కరోనా సోకదని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతోంది. ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పంజాబ్ ఎక్స్పర్ట్ కమిటీ హెడ్ డాక్టర్ కె కె తల్వార్ క్లారిటీ ఇచ్చారు. మద్యం తీసుకుంటే కరోనా రాదనే వార్తల్లో అసలు నిజం లేదని చెప్పారు. ఈ ఫేక్ వార్త వలలో పడకూడదని ప్రజలను కోరారు. ఈ అంశంపై తల్వార్ పూర్తి వివరణ ఇచ్చారు. అధికంగా మద్యం సేవించడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి కరోనా సోకే…
ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కరోనా మహమ్మారిపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని సంచారం. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఆరోగ్యశాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దనే ఉండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటె, గతనెల 19 వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన…
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్.. మన ఇండియాను కుదిపేస్తోంది. అటు కేసులు పెరగడం, ఇటు వ్యాక్సిన్ల కొరత చాలా ఇబ్బందిగా మారింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పెడుతున్న వ్యాక్సిన్ల కొరత తీర్చేందుకు.. అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టీకాల పేటెంట్స్ రద్దుకు మద్దతు తెలిపింది అమెరికా ప్రభుత్వం. వ్యాక్సిన్ల మేధో సంపత్తి హక్కులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. అమెరికా తాజా నిర్ణయం తో ప్రపంచ…
ఇండియాలో రోజురోజుకు కరోనా కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య వేలల్లో ఉంటోంది. దీంతో ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ జాబితాలో పోలెండ్ కూడా చేరిపోయింది. ఇండియా నుంచి పోలెండ్‌కు వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్ ను తప్పనిసరి చేసింది. 14 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని పోలెండ్ ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే పోలెండ్ దౌత్యవేత్తల కుటుంబం ఇండియా నుంచి పోలెండ్‌కు చేరుకుంది. పోలెండ్‌కు చేరుకున్న దౌత్యవేత్తల కుటుంబానికి…
ఇండియాలో కరోనా మహమ్మారి ఉధృతి తీవ్రంగా ఉన్నది. రోజువారీ కేసులు మూడున్నర లక్షలకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 3,82,315 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,06,65,148 కి చేరింది. ఇందులో 1,69,51,731 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 34,87,229 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 3780 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో…