తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 6361 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,69,722 కి చేరింది. ఇందులో 3,89,491 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 77,704 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 51 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన…
కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. కరోనా విజృంభిస్తున్న సమయంలో మళ్ళీ ఒక్కొక్క రంగం తిరిగి మూతపడుతున్నది. దీంతో ఆయా రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. దేశంలో ఏప్రిల్ నెలలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చింది. దేశంలో రోజుకు మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ మరణాల సంఖ్య భారీగా పెరిగింది. లాక్ డౌన్ పెట్టాలనే ఒత్తిడి పెరిగింది. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే పాక్షిక లాక్ డౌన్ ను విధించారు. …
టీం ఇండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంట్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అశ్విన్ ఇంట్లో ఏకంగా 10 మందికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా అశ్విన్ భార్య ప్రీతి ట్విటర్ లో పేర్కొంది. “ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు పెద్దవాళ్ళు, నలుగురు పిల్లలకు పాజిటివ్ గా తేలింది పిల్లల వల్ల అందరికీ కరోనా సోకింది. అందుకే గతవారం ఓ పేడకలలా గడిచింది. అందరూ జాగ్రత్తగా ఉండండి. టీకా తీసుకోండి.” అని అశ్విన్ భార్య ప్రీతి ట్వీట్…
తెలంగాణ సిఎం కెసిఆర్ కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సీఎం కేసీఆర్ కు నిన్న నిర్వహించిన యాంటీజన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. మొన్నటి యాంటీజన్ టెస్ట్ రిపోర్ట్ లో నెగెటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్ట్ లో కచ్చితమైన ఫలితం రాలేదని సీఎం వ్యక్తిగత వైద్యులు ఎం.వీ రావు తెలిపారు. వైరస్ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి కచ్చితమైన ఫలితాలు రావని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్…
తెలంగాణ సర్కార్ పై మరోసారి టీఎస్ హైకోర్టు అసంతృప్తిని వ్యక్త పరిచింది. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ నేటితో ముగుస్తుంది.. అయినా ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్త పరిచింది. ఉదయమే కేసు ఉన్నా మధ్యాహ్నం వరకు సమయం కోరిన ప్రభుత్వం.. మధ్యాహ్నం తర్వాత కూడా నిర్ణయం వెల్లడించలేదు అడ్వాకేట్ జనరల్. మీరు నిర్ణయం తీసుకోకపోతే మేమే ఆదేశాలు ఇస్తామన్న హైకోర్టు..నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు అని ప్రశ్నించింది. సరైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఏజీ.…
దేశంలో సెకండ్ వేవ్ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మహమ్మారి కేసులు వేగంగా వ్యాపిస్తుండటంతో కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ఇక మహారాష్ట్రలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. రోజుకు 60వేలకు పైగా పాజిటివ్ కేసులు 800 లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. రెండో దశ ప్రభావం మిగతా రాష్ట్రాల కంటే మహారాష్ట్రపైనే అధికంగా ఉన్నది. అయితే, సెకండ్ వేవ్ తో కరోనా తొలగిపోలేదని, జులై ఆగస్టు నెలల్లో థర్డ్ వేవ్…
కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ సిఎం కెసిఆర్ కొలుకున్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవి రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం.. సీఎం కెసిఆర్ కు ఇవాళ తన వ్యవసాయ క్షేత్రంలో కొవిడ్ పరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసియార్ పరీక్షలు నిర్వహించారు. యాంటిజెన్ టెస్టులో సిఎం కెసిఆర్ కు కరోనా నెగిటివ్ వచ్చింది. ఇక ఆర్టీపీసియార్ పరీక్షా ఫలితాలు రేపు రానున్నాయి. కాగా సిఎం కెసిఆర్…
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పిడిగుపాటు వార్త చెప్పిందని.. రెమిడిసివేర్ ఇంజక్షన్లు కేంద్రం పరిధిలోకి తీసుకుందని ఫైర్ అయ్యారు ఈటల రాజేందర్. ఇది చాలా బాధాకరంగా ఉందని..కేంద్రం నిర్ణయానికి నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన రెమిడిసివేర్ మాకు అవసరం ఉన్నంత ఇవ్వాలని…దీనిపై కేంద్రానికి లేఖ రాస్తామని వెల్లడించారు ఈటల. రెమిడిసివేర్ కొరత రాకుండా.. 4 లక్షల వైల్స్ కి ఆర్దర్…
మనదేశంలో రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ కి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానున్నది. అయితే, 60 నుంచి 70 శాతం ఈ వ్యాక్సిన్ ను రష్యా నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నది. ఇండియాలో జూన్ నుంచి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఈ వ్యాక్సిన్ పై ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. అయితే, ఈ వ్యాక్సిన్ కు అనుమతులు మంజూరు కావడంతో దీని ధర…
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ రోజు రాత్రి నుండి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉండనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. నేటి నుంచి మే 1 వరకు కర్ఫ్యూ కొనసాగునుంది. అత్యవసర సర్వీసులకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కర్ఫ్యూ నుంచి మీడియా,…