ఒమిక్రాన్ వ్యాప్తి కొనసాగుతుండడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాస్త కఠిన నిర్ణయాలే తీసుకున్నారు. ప్రధానంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించారు. వచ్చే వారం నుంచి ఈ కొత్త నిబంధనలు అమలుకానున్నాయి.అమెరికా బయల్దేరడానికి ఒక్కరోజు ముందు చేయించున్న కొవిడ్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో నెగెటివ్ వచ్చినట్టు ప్రయాణికులు ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. ఇది అమెరికన్లు సహా ప్రయాణికులందరికీ వర్తిస్తుంది. విమానాలు, రైళ్లు, బస్సుల్లో ప్రయాణించేవారందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.ప్రజారవాణా, పబ్లిక్ స్థలాల్లో మాస్కు…
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇప్పటికే ఈ ఒమిక్రాన్ వేరియంట్ 38 దేశాలకు పాకేసిందని నిపుణుల చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. మన దేశంలోనూ ఈ వేరియంట్ ప్రవేశించింది. ఇప్పటికే భారత్‌లో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా… ఇప్పుడు ఆ సంఖ్య 5 కు చేరుకుంది. తాజాగా ఢిల్లీలో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. అతన్ని ఎల్‌ఎన్‌జీపీ ఆస్పత్రికి తరలించి……
ఇండియా కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 8,895 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 2796 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,633,255 కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య 473,326 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 99,155 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది…
కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రమాదకరమైనదే. కానీ, దాని గురించి అప్పుడే అతిగా భయపడటం మంచిది కాదు. దాని తీవ్రతపై ఇంకా శాస్ర్తీయ స్పష్టత రాలేదు. లక్షణాలను నిర్థారించాల్సి వుంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఆ పనిలోనే ఉన్నారు. ఇంకో రెండు వారాలలో కొత్త వేరియంట్‌పై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒమైక్రాన్ రాకతో దేశంలో మరోసారి కలకలం మొదలైంది. మళ్లీ కరోనా సీజన్ మొదలైందనిపిస్తోంది. అక్టోబర్, నవంబర్‌లో సెకండ్ వేవ్ కేసులు గణనీయంగా తగ్గాయి. పండగల…
రోజుకో రూపం మార్చుతూ పెను సవాల్ విసురుతోంది కరోనా వైరస్. ఊహించని రీతిలో వ్యాపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మొదట్లో వెలుగు చూసిన కరోనా వేరియంట్లు వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వాళ్లపై ప్రభావం చూపిస్తే… తర్వాత బీటా, డెల్టా వేరియంట్లు యువకులు, మధ్య వయస్కులపై విరుచుకుపడ్డాయి. తాజాగా వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ పిల్లలపై ప్రభావం చూపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.సౌతాఫ్రికాలో ఐదేళ్ల లోపు చిన్నారులు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. ప్రస్తుతం తమ ఆస్పత్రుల్లో చేరుతున్న కరోనా…
ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు నిన్నటి కంటే ఇవాళ కాస్త పెరిగాయి. అయితే.. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 8,603 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు దేశంలో 99,974 కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 415 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 8,190 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇంత వరకూ 38 దేశాలకు ఈ వైరస్ పాకినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ఇంత వరకూ ఒక మరణం కూడా నమోదు కాకపోవడం విశేషం. కరోనా వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటోంది. మన దేశంలో కరోనా సెకండ్ వేవ్‌కు డెల్టా వేరియంట్ కారణమైంది. అప్పట్లో 90 శాతం కేసులకు డెల్టా వేరియంటే కారణం. అయితే… తాజాగా వెలుగు చూసిన…
ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న ఓమిక్రాన్ వేరింయట్ తాజగా దేశంలో కూడా వ్యాప్తి చెందడంతో ఢిల్లీ సర్కార్ అప్రమత్తమైంది. దీంతో కరోనాకు సంబంధించిన అన్ని మౌలిక సౌకర్యాలను కల్పించేందుకు కేజ్రివాల్ సర్కార్ సిద్ధమైంది. 30,000 కంటే ఎక్కువ కోవిడ్ పడకలు, ఆక్సిజన్ సరఫరాను పెంచడంతో ఓమిక్రాన్ ఎదుర్కొంటామన్నారు. 442 MT ఆక్సిజన్ నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, 21 MT ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచినట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో నిమిషానికి 500 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన అత్యాధునిక ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు నందమూరి బాలకృష్ణ. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ… కోవిడ్ మహమ్మారి ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిందన్నారు. ఆక్సిజన్ ను విమానాలలో ఇతర రవాణా సదుపాయాలను ఉపయోగించి దేశ వ్యాప్తంగా పంపిణీ చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఆక్సిజన్ సరఫరాలో కూడా…
ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు నిన్నటి కంటే ఇవాళ కాస్త పెరిగాయి. అయితే.. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 9,765 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు దేశంలో 99,763 కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 477 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 8,548 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్…