మన దేశంలో కరోనా కేసులు మరోసారి కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 9,119 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 396 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,44,882 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,09,940 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. ఇక మరో వైపు.. దేశవ్యాప్తంగా…
ఏపీలో ఇవాళ కరోనా కేసులు కాస్త పెరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,987 శాంపిల్స్ పరీక్షించగా.. 264 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. ఒకరు కరోనా తో మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 247 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్‌లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,02,55,667కు చేరుకున్నాయి..…
ఏపీలో కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 18, 777 శాంపిల్స్ పరీక్షించగా.. 127 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈరోజు కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. ఇక, ఇదే సమయంలో 184 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,01,95, 561 కు…
మన దేశంలో కరోనా కేసులు మరోసారి కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 10,302 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 267 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,44,99,925 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,24,868 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. ఇక మరో వైపు.. దేశవ్యాప్తంగా…
ఇండియాలో కరోనా కేసులు మళ్ళీ భారీగా పెరిగాయి. 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 11, 919 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో 3.38 కొట్ల మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,28, 762 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 470 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 4,64, 623 మంది మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల్లో ఇండియాలో 12,242 మంది కరోనా నుంచి కోలుకోగా…
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రెండు డోసుల వాక్సిన్ త్వరగా పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్ని జిల్లాల వైద్యాధికారులను ఆదేశించారు. ఒక్క మనిషి కూడా మిగులకుండా ప్రతీ ఒక్కరికి కోవిడ్ వాక్సిన్ ఇవ్వాలని సూచించారు. బుధవారం బీఆర్కే భవన్ లో అన్ని జిల్లాల వైద్యాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ని ప్రతీ గ్రామం ఏదీ వదలకుండా వాక్సినేషన్ ప్రక్రియ వేగంగా చేపట్టాలన్నారు. వందకు వంద శాతం మొదటి డోస్, రెండో…
ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు ఆర్.ఎన్.ఆర్. మనోహర్ (61) బుధవారం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. గత ఇరవై రోజులుగా ఆయన అదే హాస్పిటల్ లో వైద్య సేవలు పొందుతున్నారు. ఇరవై రోజుల క్రితం కొవిడ్ 19 కారణంగా ఆయనను మెరుగైన వైద్యం నిమిత్తం హాస్పిటల్ లో చేర్చినట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే ఈ రోజు ఉదయం గుండెపోటుతో ఆర్.ఎన్.ఆర్. మనోహర్ తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. పలు తమిళ చిత్రాలలో మనోహర్ క్యారెక్టర్…
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఈ నెల 15న పరీక్షలు జరపగా ఇవాళ కరోనా పాటిటివ్ తేలిందన్నారు. ప్రస్తుతం గవర్నర్ బిశ్వభూషన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. గవర్నర్ బిశ్వభూషణ్‌ను అస్వస్థతకు గురికావడంతో విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ఆయన రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. ముందు…
ఏపీలో ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గాయి. ఇక తాజా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 26, 514 శాంపిల్స్ పరీక్షించగా.. 191 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 416 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,00,31,083 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,70,286 కు…
ఇండియా ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,271 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. మరో 285 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. ఇదే సమయంలో 11,376 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు 3,38,37,859 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది.. ప్రస్తుతం దేశ్యాప్తంగా…