కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సీన్లు వచ్చేశాయి… ఇక మనం భయపడాల్సిన పనిలేదు అనుకున్నారంతా. కానీ… కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంది. ఒమిక్రాన్‌గా విజృంభిస్తోంది. రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్న వాళ్లను సైతం ఈ ఒమిక్రాన్ వేరియంట్ వదలడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా 59 దేశాలకు కరోనా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించింది. ఆయా దేశాల్లో 2 వేల 936 మందికి ఒమిక్రాన్ సోకినట్టు ఇప్పటి వరకూ స్పష్టమైంది. అలాగే, కరోనా సోకినట్టు నిర్ధారణైన 78 వేల మందిలో…
గత కొన్ని రోజులుగా కరోనా కేసులు ప్రపంచంలో పెరుగుతున్నాయి. యూరప్, అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. కాగా ఇప్పుడు తైవాన్‌లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రెండోసారి కరోనా కేసులు ఎలా మొదలయ్యాయి అనే అంశంపై పరిశోధకులు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. రెండోసారి కరోనా ఓ మహిళా సైంటిస్ట్ కు సోకిందని అమె ద్వారా తైవాన్‌లో మెల్లిగా కేసులు పెరుగుతున్నాయని వెల్లడైంది. Read: పెరుగు కోసం…
ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని… తీవ్ర లక్షలు కలిగిస్తుందనే ఆధారాలు లేవంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ ఓ. అందువల్ల ఒమిక్రాన్ వేరియంట్ గురించి అర్థం చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వ్యాక్సీన్ తీసుకున్న వాళ్లకు సైతం ఒమిక్రాన్ సోకుతున్నా… రోగులకు రక్షణ కొనసాగుతుందని తెలిపింది. అన్ని రకాల వేరియంట్లపై వ్యాక్సీన్లు సమర్థవంతంగా పనిచేశాయని ఇప్పటికే రుజువైందని వివరించింది. కాగా.. మన ఇండియా లో కూడా ఈ కొత్త వేరియంట్ వ్యాపించిన…
ఇండియాలో కరోనా కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.… గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 9419 కరోనా కేసులు, 159 మరణాలు నమోదు అయ్యాయి. ఇక ఇప్పటి వరకు దేశంలో 94,742 కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 159 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 8,251 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్…
కరోనా మహమ్మారి ఇప్పట్లో ప్రపంచాన్ని వదిలేలా కనిపించడం లేదు. తగ్గినట్టే తగ్గి కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యూరప్ దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో మళ్లీ ఆందోళన మొదలైంది. ఆసుపత్రులకు తాకిడి పెరిగింది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య సైతం పెరుగుతుండటంతో యూరప్ దేశాల్లో ఆంక్షలు కఠినం చేసేందుకు సిద్దం అవుతున్నారు. కరోనా కేసులతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా వేగంగా యూరప్ దేశాల్లో వ్యాపిస్తోంది. యూరప్‌లోని 19 దేశాల్లో ఈ వేరియంట్…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా పెరిగి పోతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 8,439 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. మరో 195 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశ వ్యాప్తంగా మరణాల సంఖ్య 473,952 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 93,733 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. ఇక మరో వైపు.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్…
కరోనా నుంచి బయటపడ్డాం. ఇక ఊపిరి పీల్చుకోవచ్చు అనుకునే లోపే చాపకింద నీరులా ఒమిక్రాన్ రూపంలో మరో భయంకర కొత్త వేరియంట్ వచ్చేసింది. దేశంలో ఒమిక్రాన్ టెన్షన్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్.. రోజులు గడుస్తున్నా కొద్ది ప్రపంచదేశాలకు క్రమేపీ పాకుతోంది. ఇప్పటికే చాలా దేశాల్లో ఒమిక్రాన్ పంజా విసురుతుండగా.. భారత్‌లోకి కూడా ప్రవేశించి సవాల్ విసురుతోంది. కరోనా థర్డ్ వేవ్ భారత దేశంలో ఫిబ్రవరి నాటికి గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని ఐఐటీ…
ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో తెలంగాణ సర్కార్ మళ్లీ నిబంధనలు కఠినం చేస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేశారు. లేదంటే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు. అంతేకాదు… కొందరిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. గతేడాది మాస్క్ నిబంధన ఉల్లంఘించిన 3 లక్షల 26 వేల 758 మందిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేయడంతోపాటు వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించారు. ఈ లెక్కన రాష్ట్రంలో జరిమానా ఉల్లంఘనల…
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య ఇవాళ కాస్త తగ్గింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.… గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 6,822 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు దేశంలో 95,014కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 220 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 10,004 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో భారత్‌లో ఇప్పటి…
తెలంగాణలో ఇంకా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కాలేదని… తెలంగాణ వైద్య శాఖ ప్రకటన చేసింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో 13 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిపింది. ఈ రోజు సాయంత్రం వరకు జీనోమ్ సిక్వెన్స్ ఫలితాలు వచ్చే అవకాశమని.. తెలంగాణ వైద్య శాఖ పేర్కొంది. ఈ మహమ్మరిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజల భాగస్వామ్యం అవసరమని.. హైదరాబాద్ లో రేపో మాపో కొత్త వేరియంట్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది వైద్యశాఖ.…