ఒమిక్రాన్ వ్యాప్తి కొనసాగుతుండడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాస్త కఠిన నిర్ణయాలే తీసుకున్నారు. ప్రధానంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించారు. వచ్చే వారం నుంచి ఈ కొత్త నిబంధనలు అమలుకానున్నాయి.అమెరికా బయల్దేరడానికి ఒక్కరోజు ముందు చేయించున్న కొవిడ్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో నెగెటివ్ వచ్చినట్టు ప్రయాణికులు ఆధారాలను చూపించాల్సి ఉంటుంది.
ఇది అమెరికన్లు సహా ప్రయాణికులందరికీ వర్తిస్తుంది. విమానాలు, రైళ్లు, బస్సుల్లో ప్రయాణించేవారందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.ప్రజారవాణా, పబ్లిక్ స్థలాల్లో మాస్కు ధరించకుంటే, 500 నుంచి 3000 డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. విదేశాల నుంచి అమెరికా చేరుకున్న ప్రయాణికులకు.. కోవిడ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. నెగటివ్ వచ్చినా, కొద్దిరోజులు క్వారంటైన్‌లో ఉండాలి.