కర్ణాటక మెడికల్ కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ కొంపముంచింది. కరోనా నిబంధనలు గాలికొదిలేసి ఫ్రెషర్స్ పార్టీ జరుపుకోవడంతో… వందలాది మంది విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. ధార్వాడ్ మెడికల్ కాలేజీలో కరోనా కేసుల సంఖ్య 182కు చేరింది. విద్యార్థులతోపాటు సిబ్బంది కూడా వైరస్ బారినపడ్డారు. దీంతో ధార్వాడ్ మెడికల్ కాలేజీ కోవిడ్ క్లస్టర్‌గా మారిపోయింది. బాధితుల్లో మెజార్టీ సంఖ్య టీకా రెండు డోసులు తీసుకొన్నవారే కావడం.. మరింత టెన్షన్ పుట్టిస్తోంది. ధార్వాడ్ జిల్లాలోని ఎస్‌డీఎమ్ కాలేజ్ ఆఫ్ మెడికల్…
మన ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు ఓ రోజు పెరుగుతూ…. ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. అయితే.. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 8,954 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు దేశంలో 99,023 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష లోపు దిగి రావడం శుభపరిణామం. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 267 మంది మృతి చెందారు.…
తెలంగాణలో యథావిధిగా స్కూళ్లు నడపాల్సిందేనని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. స్కూళ్లు బంద్ అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగిస్తున్నామన్నారు. ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో సైతం స్కూళ్లు నడపాల్సిందేనని సీఎం చెప్పారని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పాఠశాలలకు సెలవు అంటూ వస్తున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దన్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిద్దామని, కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.…
మన ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు ఓ రోజు పెరుగుతూ…. ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. అయితే.. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 6,990 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు దేశంలో 1,00,543 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 190 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 10,116 మంది కరోనా నుంచి…
ఇంజనీరింగ్, డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు కాలేజీలు మొదలవ్వబోతున్నాయి. ఇప్పటికే కొత్త విద్యార్థులకు పరిచయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఆనందం ఎంతోకాలం నిలబడేట్టు కన్పించడం లేదు. కరోనా వేరియంట్ ఒమిక్రాన్ నీలినీడల నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి తిరిగి ఆన్‌లైన్ బోధన ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ దిశగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగా మంగళవారం రాష్ట్రం లోని అన్ని విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో సమావేశం నిర్వహిస్తోంది. ఆన్‌లైన్ విద్యాబోధనే ఇందులో…
ప్రపంచం మొత్తం ఇప్పుడు కొత్త వేరియంట్‌తో భయపడుతున్నది. ఎటు నుంచి దేశంలోకి ప్రవేశిస్తుందో తెలియక ఆందోళనలు చెందుతున్నారు. ఈ వేరియంట్ నుంచి బయటపడేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని దేశాలు అంతర్జాతీయ ప్రయాణికులపై నిషేదం విధిస్తే, ఇజ్రాయిల్ వంటి దేశాలు సరిహద్దులు మూసివేశాయి. ప్రపంచ దేశాలు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంటే, చైనా మాత్రం తనకేమి తెలియదు అన్నట్టుగా బలప్రదర్శన చేస్తున్నది. Read: బ్రేకింగ్ : ఒమిక్రాన్‌పై సబ్ కమిటీ.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..…
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి అస్సలు వదలడం లేదు. కొత్తగా రూపాంతరం చెంది ప్రజలపై దాడులు చేస్తూనే ఉంది. ఇక తాజాగా సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. 43 మంది విద్యార్థులు,ఒక ఉపాధ్యాయురాలు కరోనా బారిన పడ్డారు. ఈ పాఠశాలలో ఏకంగా 520 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే… నిన్న నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఏకంగా 43 మంది విద్యార్థులు,…
ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ ఇండియాను వణికిస్తోంది. ఈ నేపథ్యంలోనే… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఇక తాజాగా ఎయిర్ పోర్టుల్లో కొత్త వేరియంట్ పై కేంద్రం గైడ్ లైన్స్ కూడా విడుదల చేసింది. ఒమిక్రాన్ ప్రభావం ఉన్న దేశాల నుంచి వస్తే… టెస్టింగ్ తప్పని సరి అని కేంద్రం తాజాగా ప్రకటన చేసింది. వ్యాక్సిన్ తో సంబంధం లేకుండా… ఎయిర్ పోర్ట్ లో టెస్టింగ్స్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ ఎయిర్ పోర్ట్…
జనం పిట్టల్లా రాలిపోయారు..దొరగారు పట్టించుకోండని… సీఎం కేసీఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కరోనా సెకండ్ వేవ్ లో డాక్టర్లుంటే బెడ్స్ లేవని… బెడ్స్ ఉంటే ఆక్సిజన్ లేదని… దీంతో జనం పిట్టల్లా రాలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల. పారాసిటమోల్ వేసుకుంటే సరిపోతుందని… ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారని కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. దొరగారు కనీసం ఇప్పుడైనా చేతులు కాలినంక ఆకులు పట్టుకోకుండా ప్రజల ప్రాణాలను కాపాడాలని.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్…
మన దేశంలో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో దేశంలో 8,309 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 236 మంది మృతి చెందారు. దేశంతో మొత్తం ఇప్పటి వరకు 3,40,08,183 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,68,790 మంది మృతి చెందారు. దేశంలో 1,03,859…