Covid Outbreak: భారత్ మరో కోవిడ్ వ్యాప్తికి సిద్ధంగా ఉండాలని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) నిపుణుడు శుక్రవారం హెచ్చరించారు. అమెరికాతో పాటు దక్షిణ కొరియాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు వచ్చాయి. సీడీసీ అంచనాల ప్రకారం.. యూఎస్‌లో దేశంలోని 25 రాష్ట్రాల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. దక్షిణ కొరియాలో కూడా గణనీయంగా కేసులు నమోదవుతున్నాయి.
భారత్‌లో క్రియాశీల కొవిడ్ కేసులు శుక్రవారం 3 వేల మార్క్‌కు చేరుకున్నాయి. అయితే సబ్-వేరియంట్ JN-1 మొదటి కేసును గుర్తించిన తర్వాత కేసుల ఆకస్మిక పెరుగుదల మధ్య కేరళలో ఒక మరణం నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా చూపించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. క్రియాశీల కేసులు నిన్న 2,669 ఉండగా.. నేటికి 2,997కి పెరిగాయి.
విదేశాల్లో కరోనా విజృంభిస్తుండడంతో భారత్ అప్రమత్తమైంది. పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి నిరోధానికి మరోమారు మార్గదర్శకాలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. కేంద్ర హోమ్ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించని వారికి రూ. 100 జరిమాన విధింపునకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మాస్కు లేని వారిని దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలు, వ్యాపార సంస్థల ప్రాంగణాల్లోకి అనుమతిస్తే సదరు యాజమాన్యానికి రూ. 10 వేల నుంచి రూ. 25…